New Advanced Activa 2023: సరికొత్త యాక్టివా ను లాంచ్ చేసిన హోండా..-honda motorcycle scooter india launches new advanced activa 2023 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New Advanced Activa 2023: సరికొత్త యాక్టివా ను లాంచ్ చేసిన హోండా..

New Advanced Activa 2023: సరికొత్త యాక్టివా ను లాంచ్ చేసిన హోండా..

HT Telugu Desk HT Telugu
Feb 18, 2023 05:36 PM IST

New Advanced Activa 2023: హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా సరికొత్త, అత్యాధునిక యాక్టివాను మార్కెట్లోకి విడుదల చేసింది.

సరికొత్త యాక్టివ్ మోడల్ ను ఆవిష్కరిస్తున్న దృశ్యం
సరికొత్త యాక్టివ్ మోడల్ ను ఆవిష్కరిస్తున్న దృశ్యం

New Advanced Activa 2023: నూతన అత్యాధునిక యాక్టివా 2023 ను విడుదల చేసిన హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా. అంతర్జాతీయంగా సుప్రసిద్ధమైన హోండా స్మార్ట్‌ కీ ని మొట్టమొదటి సారిగా భారతదేశంలో ఈ మోడల్ ద్వారా పరిచయం చేశారు.

New Advanced Activa 2023: న్యూ హోండా యాక్టివా

భారతీయ ద్విచక్ర వాహన పరిశ్రమలో సరికొత్త చరిత్రను సృష్టిస్తూ, స్కూటర్‌ విభాగంలో ఎదురులేని నాయకునిగా వెలుగొందుతున్న హోండా మోటర్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) స్మార్టర్‌ మరియు అత్యాధునిక యాక్టివా 2023ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది హెచ్‌ఎంఎస్‌ఐ యొక్క మొట్టమొదటి ఓడీబీ2 ప్రమాణాలు కలిగిన ద్విచక్ర వాహనం. ఏప్రిల్‌ 2023 గడువు తేదీ కంటే ముందుగానే దీనిని విడుదల చేయడం విశేషం. హైదరాబాద్‌లో ఫిబ్రవరి17వ తేదీన జరిగిన నూతన యాక్టివా విడుదల కార్యక్రమంలో తెలంగాణా జోనల్‌ మేనేజర్‌ ఇస్మాయిల్‌ ఖాన్‌ ; హైదరాబాద్‌ ఏరియా మేనేజర్‌ సునీల్‌ రెడ్డి ; హైదరాబాద్‌ ఏరియా మేనేజర్‌ పునీత్‌కుమార్‌ సీ ఎస్‌తో పాటుగా హైదరాబాద్‌లోని హోండా డీలర్లు పాల్గొన్నారు.

New Advanced Activa 2023: సాంకేతికంగా అడ్వాన్స్ డ్..

సాంకేతికత పరంగా ముందుండే, హోండా కంపెనీ తమ వినియోగదారులకు సౌకర్యం మరియు సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాహనాలను రూపొందిస్తుంది. ద్విచక్ర వాహన విభాగంలో మొట్టమొదటిసారిగా మరోమారు వినూత్నమైన ఫీచర్‌ – హోండా స్మార్ట్‌ కీ ని కొత్తగా విడుదల చేసిన యాక్టివాలో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ఫిబ్రవరి 17 నుంచి అన్ని హోండా షో రూమ్ ల్లో అందుబాటులో ఉంటుంది.

WhatsApp channel

టాపిక్