Audi Q3 Sportback launch : ఆడీ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్.. ఇండియా లాంచ్ రేపే!
Audi Q3 Sportback facelift launch in India : ఇండియాలో ఆడీ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ సోమవారం లాంచ్ కానుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Audi Q3 Sportback launch in India : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్‌పై మరింత పట్టు సాధించేందుకు కృషిచేస్తోంది ప్రముఖ లగ్జరీ వాహనాల తయారీ సంస్థ ఆడీ. ఈ నేపథ్యంలోనే వరుస లాంచ్‌లతో బిజీబిజీగా ఉంటోంది. ఇక ఇప్పుడు.. బెస్ట్ సెల్లింగ్‌గా ఉన్న క్యూ3 మోడల్‌కు ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ను ఇండియాలోకి తీసుకురానుంది. ఫిబ్రవరి 13.. అంటే సోమవారమే ఈ ఆడీ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ లాంచ్ కానుంది!
మరింత స్టైలిష్‌గా.. లగ్జరీగా..
Audi Q3 Sportback 2023 : సరికొత్త ఆడీ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్‌లో కూప్ రూఫ్‌లైన్ వస్తోంది. ఈ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్కు సంబంధించిన బుకింగ్స్‌ను ఇప్పటికే మొదలుపెట్టింది ఆడీ. సంస్థ అధికారిక వెబ్సైట్ లేదా డీలర్షిప్ షోరూమ్‌లో దీనిని బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం రూ. 2లక్షల టోకెన్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది.
ఆడీ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ఎస్యూవీ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌కి.. మామూలు వర్షెన్‌కి పెద్దగా తేడా కనిపించడం లేదు. క్యూ3 స్పోర్ట్‌బ్యాక్‌లో స్లోపింగ్ రూఫ్‌లైన్, హనీకోంబ్-మెష్ గ్రిల్, బ్లాక్డ్ ఔట్ క్రోమ్ అసెంట్స్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్పోర్టీ అలాయ్ వీల్స్ వస్తాయి.
Audi Q3 Sportback price in India : ఇక ఈ ఆడీ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ క్యాబిన్లో 8.9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ విత్ ఆడీ ఇంటర్ఫేస్ వస్తుంది. యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, ఎంఎంఐ నేవిగేషన్, ఐడీ స్మార్ట్‌ఫోన్ ఇంటర్ఫస్, ఆడీ వర్చ్యువల్ కాక్‌పిట్, వయర్లెస్ ఛార్జింగ్, యాంబియెంట్ లైటింగ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టెబుల్ సీట్స్, 10- స్పీకర్ ఆడీ సిస్టెమ్ వంటి ఫీచర్స్ వస్తున్నాయి.
ఫీచర్స్ ఇవే..
ఇక ఈ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్‌లో 2.0 లీటర్ 4 సిలిండర్ టర్బోఛార్జ్డ్ టీఎఫ్ఎస్ఐ మోటార్ ఉంటుంది. క్యూ3లోనూ ఇదే ఉంటుంది. ఇది 188 బీహెచ్పీ పవర్‌ను, 320 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 7- స్పీడ్ డీఎస్జీ ట్రాన్స్మిషన్ ఉంది. అయితే.. 45 టీఎఫ్ఎస్ఐ ఇంజిన్ వేరియంట్‌ను కూడా ఆడీ ఇండియా తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది 241 బీహెచ్పీ పవర్‌ను, 370 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
Audi Q3 Sportback launch : ఇక లాంచ్ అయిన తర్వాత.. ఈ ఆడీ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్.. మెర్సిడెస్ జీఎల్ఏ, బీఎండబ్ల్యూ ఎక్స1 వంటి లగ్జరీ వాహనాలకు గట్టి పోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
ఆడీ క్యూ3.. గతేడాది ఇండియాలో లాంచ్ అయ్యింది. దీని ప్రారంభం ఎక్స్‌షోరూం ధర రూ. 44.89లక్షలుగా ఉంది. ఇక ఆడీ క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ రూ. 50లక్షల ప్రైజ్ పాయింట్‌తో మొదలవుతుందని తెలుస్తోంది.
సంబంధిత కథనం