Honda new SUV : హ్యుందాయ్ క్రేటాకు ధీటుగా హోండా కొత్త ఎస్యూవీ- త్వరలోనే లాంచ్!
22 March 2023, 10:06 IST
Honda new SUV : హోండా నుంచి కొత్త ఎస్యూవీ లాంచ్‌కానున్నట్టు తెలుస్తోంది. హ్యుందాయ్ క్రేటా వంటి ఎస్‌యూవీలతో ఈ మోడల్ పోటీపడనున్నట్టు సమాచారం.
హ్యుందాయ్ క్రేటాకు ధీటుగా హోండా కొత్త ఎస్యూవీ- త్వరలోనే లాంచ్!
Honda new SUV : హ్యుందాయ్ క్రేటాకు ఇండియాలోనే కాకుండా ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉంది. ఇక ఇప్పుడు.. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా.. హ్యుందాయ్ క్రేటాకు పోటీగా ఓ కొత్త ఎస్‌యూవీని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది 2023 మధ్యలో లాంచ్‌కానున్నట్టు సమాచారం. హోండా అమేజ్ ప్లాట్‌ఫామ్‌పైనే ఈ ఎస్యూవీ కూడా తయారవుతోంది!
2023 హోండ్ ఎస్యూవీ.. వచ్చేస్తోంది!
టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఎస్‌యూవీకి సంబంధించిన ఫొటోలు ఆన్లైన్లో దర్శనమిచ్చాయి. ఫలితంగా.. డిజైన్‌కు సంబంధించిన కీలక వివరాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఫొటోల ప్రకారం.. హోండా సరికొత్త ఎస్‌యూవీలో స్లీక్ హెడ్‌ల్యాంప్స్, బ్లాక్డ్-ఔట్ వీల్స్, రేర్ విండో వైపర్ వంటివి ఉంటాయి.
2023 Honda SUV : ఇండియాలో కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్‌కు చాలా డిమాండ్ ఉంది. కానీ హోండాకు మాత్రం ఈ సెగ్మెంట్లో ఇంకా ఎలాంటి వెహికిల్ లేదు. ఈ లోటును భర్తీ చేసే విధంగా ఈ కొత్త ఎస్యూవీ ఉండనున్నట్టు తెలుస్తోంది. హ్యుందాయ్ క్రేటాతో పాటు వోక్స్వ్యాగన్ టైగన్, కియా సెల్టోస్, స్కోడా కుషక్ వంటి ఎస్‌యూవీలకు ఈ కొత్త హోండ్ మోడల్ పోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
2023 హోండా ఎస్‌యూవీలో బానెట్ పొడవుగా ఉండే అవకాశం ఉంది. గ్రిల్, ఎయిర్-వెంట్ వెడల్పు కాస్త ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. రూఫ్ రెయిల్స్, ఓఆర్వీఎంలు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చీస్, బ్లాక్డ్ ఔట్ వీల్స్ వంటివి రావొచ్చు. షార్క్- ఫిన్ యాంటీనా, రేక్డ్ విండ్‌స్క్రీన్, విండో వైపర్, టెయిల్ల్యాంప్ వంటివి.. ఎస్యూవీ రేర్‌లో ఉండొచ్చు.
Honda new SUV launch : హోండా నుంచి రానున్న కొత్త ఎస్‌యూవీలో 1.5 లీటర్ ఐ- వీటీఈసీ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఇందులో 5 స్పీడ్ మేన్యువల్, సీవీటీ గేర్‌బాక్స్ ఆప్షన్స్ ఉండొచ్చు. దీనితో పాటు ఎలక్ట్రిక్ మోటార్‌తో కూడిన ఒక హైబ్రీడ్ ఇంజిన్ మోడల్‌ను హోండా తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. డీజిల్ ఇంజిన్ ఉండదు.
ఇక 2023 హోండా ఎస్యూవీ ఇంటీరియర్ విషయానికొస్తే.. వయర్లెస్ ఛార్జర్, ఆటో క్లైమేట్ కంట్రోల్, రేర్ ఏసీ వెంట్స్, మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్స్ వస్తాయి. డిజిటల్ క్లస్టర్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్లు.. సరికొత్త కనెక్టివిటీ ఆప్షన్స్‌తో రావొచ్చు. 360 డిగ్రీ కెమెరా, ఏడీఏఎస్ వంటి సేఫ్టీ ఫీచర్స్ లభించనున్నట్టు తెలుస్తోంది.
Honda latest launches in India : ఇండియాలో హోండా కొత్త ఎస్యూవీ 2023 ఆగస్ట్- అక్టోబర్ మధ్యలో లాంచ్ అవ్వొచ్చు. దీని ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 11లక్షలు- రూ. 12లక్షల మధ్యలో ఉండొచ్చని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి. 2023 హోండా ఎస్‌యూవీపై రానున్న కాలంలో మరింత సమాచారం వెలువడే అవకాశం ఉంది.