world's top selling automaker : ప్రపంచంలో ఏ సంస్థ కార్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయో తెలుసా?
30 January 2023, 13:44 IST
- world's top-selling automaker : ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్థకు చెందిన కార్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి? అన్న ప్రశ్నకు.. వరుసగా మూడో ఏడాది కూడా ‘టయోటా’నే సమాధానం! 2022లోనూ టాప్ సెల్లింగ్ ఆటోమేకర్‌గా నిలిచింది టయోటా మోటార్ కార్ప్. ఆ వివరాలు..
ప్రపంచంలో ఏ సంస్థ కార్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయో తెలుసా?
world's top selling automaker : ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్‌ను 'టయోటా మోటార్స్' ఏలుతోంది! గతేడాది.. వరల్డ్ టాప్ సెల్లింగ్ ఆటోమేకర్‌గా నిలిచింది ఈ జపాన్ ఆధారిత ఆటోసంస్థ. టయోటా.. ఈ ఘనత సాధించడం ఇది వరుసగా మూడో ఏడాది కావడం విశేషం.
టయోటా.. తగ్గేదేలే..!
2022లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీద 10.5 మిలియన్ వాహనాలను విక్రయించింది టయోటా మోటార్ కార్ప్. ఈ జాబితాలో.. వోక్స్వ్యాగన్ రెండో స్థానంలో ఉంది. 2022లో 8.3మిలియన్ వాహనాలను అమ్మింది. దశాబ్ద కాలంలో సంస్థ సేల్స్ ఇంత తక్కువగా నమోదుకావడం ఇదే తొలిసారి! రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, సప్లై చెయిన్ వ్యవస్థ దెబ్బతినడంతో వోక్స్వ్యాగన్ సేల్స్ పడిపోయాయి. కానీ టయోటా మాత్రం 2022లోనూ దూసుకెళ్లింది.
Toyota vehicle sales in 2022 : టయోటా గ్లోబల్ సేల్స్‌లో ట్రక్ యూనిట్ హినో మోటార్స్, చిన్నకార్ల తయారీ సంస్థ డైహట్సూ నెంబర్లు కూడా ఉన్నాయి. మొత్తం మీద వీదేశీ సేల్స్ రికార్డుస్థాయిలో 8.6 మిలియన్గా నమోదయ్యాయి. కానీ దేశీయంగా మాత్రం.. టయోటా వాహనాల సేల్స్ 9.6శాతం పడ్డాయి. జపాన్‌లో ఈ సంస్థ.. గతేడాది కేవలం 1.9మిలియన్ వాహనలను మాత్రమే విక్రయించగలిగింది. విదేశాల్లో సంస్థకు మంచి డిమాండ్ లభిస్తుండటంతో.. దేశీయంగా విక్రయాలు తగ్గినా, టయోటా అగ్రస్థానంలో నిలిచింది.
ఆసియా, అమెరికాలో క్రేజీ డిమాండ్..!
ఇతర ఆటో సంస్థల్లాగానే టయోటా మోటార్స్‌కి కూడా సెమీకండక్టర్ సరఫరాలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఆసియా, అమెరికాలో వస్తున్న డిమాండ్, అందుకు తగ్గట్టు తయారీ కూడా పుంజుకోవడం సంస్థకు కలిసి వచ్చింది.
Toyota motors top selling automaker : ఎస్ అండ్ పీ గ్లోబల్ మొబిలిటీ నివేదిక ప్రకారం.. 2023లో కూడా టాప్ సెల్లింగ్ ఆటోమేకర్‌గా టయోటా కొనసాగుతుంది. రెండో స్థానంలో ఉన్న వోక్స్‌వ్యాగన్‌కు, టయోటాకు మధ్య వ్యత్యాసం ఇంకా పెరుగుతుంది. 2024 నాటికి వాహనాల సేల్స్ పూర్తిస్థాయిలో పెరుగుతాయని అంచనా వేసింది. లైట్ వెహికిల్ సేల్స్ విభాగంలో.. ఈ దశాబ్దం చివరి నాటికి 11 మిలియన్ మైలురాయిని అందుకునే సామర్థ్యం టయోటాకు ఉందని అభిప్రాయపడింది.
ఈవీవైపు చూపు.. ఎప్పుడు?
అంతర్జాతీయ మార్కెట్లో కొత్త కొత్త మోడల్స్‌ను లాంచ్ చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తోంది టయోటా మోటో కార్ప్. ఈ క్రమంలోనే ఇన్నోవా హైక్రాస్‌ను ఇటీవలే లాంచ్ చేసింది. దీనికి మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఇక హైబ్రీడ్ టెక్నాలజీ, హైడ్రోజెన్ పవర్డ్ వాహనాలు, ఇంటర్నల్ కంబషన్ వాహనాలపై అధికంగా దృష్టిసారిస్తోంది టయోటా. అయితే.. ఈవీలపై శ్రద్ధ పెట్టడం లేదని ఈ ఆటోమేకర్పై విమర్శలు వినిపిస్తున్నాయి.