Toyota GR Corolla Hatchback: టయోటా జీఆర్ కొరొల్లా హ్యాచ్‍బ్యాక్ ఇండియాకు వచ్చేస్తోంది..‘ఆటో ఎక్స్‌పో’లో.. -toyota gr corolla hatchback to be showcased at auto expo 2023 know the details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Toyota Gr Corolla Hatchback: టయోటా జీఆర్ కొరొల్లా హ్యాచ్‍బ్యాక్ ఇండియాకు వచ్చేస్తోంది..‘ఆటో ఎక్స్‌పో’లో..

Toyota GR Corolla Hatchback: టయోటా జీఆర్ కొరొల్లా హ్యాచ్‍బ్యాక్ ఇండియాకు వచ్చేస్తోంది..‘ఆటో ఎక్స్‌పో’లో..

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 03, 2023 02:43 PM IST

Toyota GR Corolla Hatchback: టయోటా జీఆర్ కొరొల్లా హ్యాచ్‍బ్యాక్ కారు ఆటో ఎక్స్‌పోలోకి రానుంది. సాధారణ హ్యాచ్‍బ్యాక్ కంటే కాస్త డిఫరెంట్ లుక్‍తో ఇది రానుంది.

Toyota GR Corolla Hatchback: టొయోటా జీఆర్ కొరొల్లా హ్యాచ్‍బ్యాక్ వచ్చేస్తోంది (Photo: Toyota)
Toyota GR Corolla Hatchback: టొయోటా జీఆర్ కొరొల్లా హ్యాచ్‍బ్యాక్ వచ్చేస్తోంది (Photo: Toyota)

Toyota GR Corolla Hatchback: ఈనెలలో జరిగే ఆటో ఎక్స్‌పో 2023 (Auto Expo 2023) కోసం ప్రముఖ ఆటోమొబైల్స్ తయారీ సంస్థ టయోటా (Toyota) సిద్ధమవుతోంది. ఈ షోలో టయోటా కొరొల్లా హ్యాచ్‍బ్యాక్‍ను ప్రదర్శించనుంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఈ కారు అందుబాటులో ఉండగా.. తొలిసారి ఇండియాకు ప్రదర్శన కోసం తీసుకురానుంది. ఇటీవలే ఇన్నోవా హైక్రాస్, ఎల్‍సీ300ను లాంచ్ చేసిన టయోటా.. ఇప్పుడు ఈ జీఆర్ కొరొల్లా హ్యాచ్‍బ్యాక్‍ను ప్రదర్శించనుంది. వివరాలివే..

Toyota GR Corolla Hatchback: ఇంజిన్

1.6 లీటర్, త్రీ సిలిండర్, సింగిల్-స్క్రోల్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‍ను టయోటా జీఆర్ కొరొల్లా కలిగి ఉంటుంది. గరిష్ఠంగా 304hp పవర్, 370Nm పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ జనరేట్ చేయగలదు. దాదాపు మెర్సెడెజ్ ఏఎంజీ ఏ35 సెడాన్‍కు ఇది సమానంగా కనిపిస్తోంది.

టయోటా జీఆర్ కొరొల్లా హ్యాచ్‍బ్యాక్‍లో 6-స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. 0-100 kph (గంటకు కిలోమీటర్ల వేగం)కు 5 సెకన్లలోనే చేరుకోగలదు ఈ హ్యాచ్‍బ్యాక్.

సాధారణ హ్యాచ్‍బ్యాక్‍ల్లా కాకుండా ర్యాలీ మోడల్‍ను పోలినట్టుగా ఈ టయోటా జీఆర్ కొరొల్లా డిజైన్ ఉంటుంది. ఫ్రంట్ గ్రిల్ పెద్దగా, ఎయిర్ ఇన్‍టేక్స్ కాస్త వెడల్పుగా ఉంటాయి. మోటోస్పోర్ట్ ను స్ఫూర్తిగా తీసుకొని ఈ కారు క్యాబిన్‍ను టయోటా డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది. లెదర్ ట్రిమ్డ్ జీఆర్ స్టీరింగ్ వీల్, జీఆర్ బ్యాడ్జ్ సీట్లు, అల్యూమియమ్ పెడల్స్ ఉంటాయి.

ఆటో ఎక్స్‌పో 2023 ఈవెంట్‍లో టయోటా హైక్రాస్, ఎల్‍సీ300తో పాటు మరిన్ని ఫ్యుయెల్ వెహికల్స్, స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్లను ప్రదర్శించనుంది. అయితే ఏ మోడళ్లను ఎక్స్‌పోలోకి తీసుకొస్తున్నది లిస్టును టయోటా ఇంకా వెల్లడించలేదు. అయితే కొత్త ప్రియస్ మోడల్ ఇందులో ఉంటుందని తెలుస్తోంది. జీఆర్ కొరొల్లా హ్యాచ్‍బ్యాక్‍ను ప్రదర్శించనున్నట్టు చెప్పిన టయోటా.. లాంచ్ గురించి ఇంకా స్పష్టతనివ్వలేదు.

Auto Expo 2023 Detail: ఆటో ఎక్స్‌పో ఎప్పుడు?

ఈనెల 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఢిల్లీలోని ప్రగతి మైదాన్‍లో ఆటో ఎక్స్‌పో 2023 జరగనుంది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, కియా, టాటా మోటార్స్, టయోటా, మహీంద్రాతో పాటు చాలా కంపెనీలు కొత్త మోడళ్లను ఈ ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నాయి. అలాగే కొన్ని కంపెనీలు కాన్సెప్ట్‌లను కూడా విడుదల చేయనున్నాయి. సరికొత్త యాక్ససరీలు కూడా ఈ ఎక్స్‌పోలో వస్తాయి.

Whats_app_banner