Tata Motors price hike : భారీగా పెరగనున్న టాటా మోటార్స్ వాహనాల ధరలు..
Tata Motors price hike 2023 : టాటా మోటార్స్ వాహనాల ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు ఆటో సంస్థ ఓ ప్రకటన చేసింది.
Tata Motors price hike : టాటా మోటార్స్ నుంచి.. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది! తమ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్టు ఈ దేశీయ దిగ్గజ ఆటో సంస్థ ప్రకటించింది. తమ మోడల్స్‌పై దాదాపు 1.2శాతం ప్రైజ్ హైక్ తీసుకుంటున్నట్టు వెల్లడించింది. పెంచిన ధరలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
ఒకటే కారణం..
ఇండియా ఆటో మార్కెట్లో టాటా మోటార్స్ ఎస్‌యూవీలు, ఈవీ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త మోడల్స్‌ను కస్టమర్ల ముందుకు తీసుకొస్తోంది ఈ ఆటో సంస్థ. అయితే.. వాహనాల ధరలను కూడా క్రమంగా పెంచుకుంటూ వెళుతోంది. ముడిసరకు ధరలు పెరుగుతున్నాయంటూ.. గతేడాది అంతా వాహనాల ధరలను పెంచిన టాటా మోటార్స్, ఇప్పుడు కూడా అదే కారణం చెబుతోంది.
Tata Motors price hike 2023 : "ముడిసరకు ధరల భారాన్ని సంస్థ చాలా వరకు మోసింది. కస్టమర్లపై ఆ ప్రభావం పడకుండా చూసుకుంది. కానీ ఇప్పుడు కొంత భాగాన్ని కస్టమర్లపై వేయాల్సిన సమయం వచ్చింది. అందుకే ప్రైజ్ హైక్ తీసుకుంటున్నాము," అని శుక్రవారం ఓ అధికారిక ప్రకటన వెలువరిచింది టాటా మోటార్స్.
తాజా పెంపుతో.. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న టాటా హారియర్, టాటా సఫారీతో పాటు ఇతర మోడల్స్ ధరలు పెరగనున్నాయి.
అన్ని ఆటో సంస్థలదీ ఇదే దారి..!
టాటా మోటార్స్ ఒక్కటే వాహనాల ధరలను పెంచడం లేదు. దేశంలోని దాదాపు అన్ని ఆటో సంస్థలు ఇప్పటికే ప్రైజ్ హైక్ తీసుకున్నాయి. అవి కూడా.. 'ముడిసరకు ధరల'పైనే భారాన్ని మోపాయి.
Maruti Suzuki price hike news : మరో దేశీయ దిగ్గజ ఆటో సంస్థ మారుతీ సుజుకీ.. వాహనాల ధరలను ఇప్పటికే పెరిగాయి. మోడల్ ఆధారంగా గరిష్ఠంగా 1.1శాతం ప్రైజ్ హైక్ తీసుకుంది మారుతీ సుజుకీ. ఈ పెంచిన ధరలు జనవరి 16 నుంచే అమల్లోకి వచ్చాయి. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇంకెంత పెంచుతారు?
'ముడిసరకు ధరల' పేరుతో ఏడాది కాలంగా వాహనాల ధరలను ఇష్టమొచ్చినట్టు పెంచుకుంటూ పోయాయి ఆటో సంస్థ. దేశీయంగా మంచి డిమాండ్ ఉండటం, ఆర్డర్ బుక్‌లో పెండింగ్ వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆటో సంస్థలు ఈ ధైర్యం చేయగలిగాయి. అందుకు తగ్గట్టుగానే.. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటో మార్కెట్‌గా ఇండియా అవతరించింది. కానీ ఇలా ఇంకెన్నాళ్లు పెంచుతాయి? అని ప్రశ్నలు ఇప్పుడిప్పుడే ఉత్పన్నమవుతున్నాయి. మాటిమాటికి వాహనాల ధరలు పెంచేస్తే.. డిమాండ్ తగ్గిపోయే ప్రమాదం ఉందని, కొత్త కారు తీసుకునేందుకు ప్రజలు ఇష్టపడరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Tata Motors price hike news : మరి వాహనాల ప్రైజ్ హైక్‌కు ఎప్పుడు ముగింపు పడుతుందో వేచి చూడాలి.
సంబంధిత కథనం