తెలుగు న్యూస్  /  Business  /  Top 10 Dividend Yield Stocks 5 Year Average Returns Are Better Than Fds

Top 10 dividend yield stocks: ఎఫ్‌డీ కంటే అధిక రాబడి.. టాప్ 10 డివిడెండ్ స్టాక్స్ ఇవే

HT Telugu Desk HT Telugu

06 December 2022, 16:00 IST

    • Top 10 dividend yield stocks: ఫిక్స్‌డ్ డిపాజిట్ కంటే అధిక రాబడి ఇచ్చే డివిడెండ్ స్టాక్స్ గురించి చూస్తున్నారా? టాప్ 10 డివిడెండ్ స్టాక్స్ ఇవిగో..
టాప్ 10 డివిడెండ్ స్టాక్స్ ఇవే
టాప్ 10 డివిడెండ్ స్టాక్స్ ఇవే

టాప్ 10 డివిడెండ్ స్టాక్స్ ఇవే

ప్రస్తుతం భారతీయ స్టాక్ మార్కెట్లు జీవితకాలపు గరిష్టస్థాయికి చేరుకున్నాయి. అయితే ఈ వారం ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల నుంచి లాభాలు రాబట్టుకుంటున్నారు. దీంతో స్వల్ప దిద్దుబాటుకు లోనవుతోంది. ఇలాంటి సమయాల్లో భారీగా డివిడెండ్ ఇచ్చే స్టాక్స్‌ వైపు దృష్టి పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఐడీబీఐ క్యాపిటల్ సంస్థ డిసెంబరు 2022 కోసం డివిడెండ్ స్టాక్స్ జాబితా వెల్లడించింది. ఇది ఇచ్చిన టాప్ 10 డివిడెండ్ ఈల్డ్ స్టాక్స్ ఐదేళ్ల సగటు రాబడి.. సంప్రదాయ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్స్ కంటే కూడా ఎక్కువగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Stock market: ర్యాలీకి బ్రేక్; స్టాక్ మార్కెట్ క్రాష్; రూ. 2.3 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

Cibil score : జీవితంలో ఎప్పుడూ లోన్​ తీసుకోకపోయినా.. సిబిల్​ స్కోర్​పై ఎఫెక్ట్​ పడుతుందా?

Mahindra XUV 3XO vs Tata Nexon : ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ వర్సెస్​ నెక్సాన్​.. ఏది బెస్ట్​?

Stocks to buy today : ఈ రూ. 98 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో మంచి ప్రాఫిట్స్​..!

టాప్ డివిడెండ్ ఈల్డ్ స్టాక్స్ జాబితా

1. NMDC: ఎన్ఎండీసీ

ఐడీబీఐ క్యాపిటల్ రిపోర్ట్ ప్రకారం ఎన్ఎండీసీ డివిడెండ్ల ద్వారా అత్యధికంగా 12.3 శాతం రాబడి ఇచ్చింది. ఆర్థిక సంవత్సరంలో వచ్చే నికర లాభాన్ని బట్టి కంపెనీలు డివిడెండ్ ఇస్తాయి. తాజాగా ఎన్ఎండీసీ 46.06 శాతం డివిడెండ్ ఇచ్చింది. ప్రతి ఈక్విటీ షేరుకు రూ. 14.7 చొప్పున డివిడెండ్ ఇచ్చింది.

2. REC: ఆర్‌ఈసీ

కేంద్ర విద్యుత్తు శాఖ వెన్నుదన్నుగా ఉన్న రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ రెండో అత్యధిక డివిడెండ్ రాబడి ఇచ్చిన కంపెనీగా నిలిచింది. ఇది ఐదేళ్లలో సగటున 12 శాతం రాబడి ఇచ్చింది.

3. GAIL (India): గెయిల్

గెయిల్ ఐదేళ్ల సగటు డివిడెండ్ రాబడి 10.7 శాతంగా ఉంది. ప్రభుత్వ యాజమాన్యంలోని గెయిల్ తాజాగా 36.23 శాతం మేర డివిడెండ్ ప్రకటించింది. 2022 ఆర్థిక సంవత్సరంలో ఒక్కో షేరుకు రూ. 10 డివిడెండ్ ప్రకటించింది.

4. Power Finance Corporation: పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్

దేశ విద్యుత్తు రంగానికి ఆర్థిక సేవలు అందించేదిగా పేరున్న పీఎఫ్‌సీ ఐదేళ్ల సగటు డివిడెండ్ రాబడి 10.1 శాతంగా ఉంది. 2022 ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ పేఔట్ 22.61 శాతంగా ఉంది.

5. HUDCO: హడ్కో

దేశంలో హౌజింగ్, ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు రుణాలు అందించే హడ్కో గడిచిన ఐదేళ్లలో డివిడెండ్ల రూపంలో సగటు 9.3 శాతం రాబడి ఇచ్చింది. 2022 ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ పేఔట్ 40.82 శాతంగా ఉంది.

6. Coal India: కోల్ ఇండియా

ప్రభుత్వ యాజమాన్యంలోని బొగ్గు ఉత్పత్తి సంస్థ కోల్ ఇండియా గడిచిన ఐదేళ్లలో డివిడెండ్ల రూపంలో 9.1 శాతం సగటు రాబడి ఇచ్చింది.

7. Phillips Carbon Black: ఫిలిప్స్ కార్బన్ బ్లాక్

అత్యంత పెద్దదైన కార్బన్ బ్లాక్ తయారీ కంపెనీ ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ డివిడెండ్ల రూపంలో 7.1 శాతం సగటు రాబడి ఇచ్చింది.

8. Power Grid Corporation of India: పవర్ గ్రిడ్

ప్రభుత్వ యాజమాన్యంలోని పవర్ గ్రిడ్ కంపెనీ కూడా డివిడెండ్ల రూపంలో మంచి రాబడే ఇచ్చింది. ఐదేళ్లలో సగటున 6.7 శాతం రాబడులు అందించింది.

9. Ircon International: ఇర్కాన్ ఇంటర్నేషనల్

భారతీయ రైల్వే వెన్నుదన్నుగా ఉన్న ఇర్కాన్ గడిచిన ఐదేళ్లలో డివిడెండ్ల రూపంలో సగటున 6.7 శాతం రాబడి ఇచ్చింది.

10. MOIL: మొయిల్

మాంగనీస్ ఓర్ మైనింగ్ కంపెనీ మొయిల్ డివిడెండ్ల రూపంలో ఐదేళ్లుగా సగటున 6.5 శాతం రాబడి ఇస్తోంది.

ఇవి కాకుండా ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, హిందుస్తాన్ జింక్, ఎన్టీపీసీ, వంటివి కూడా సగటున 5.9 శాతం రాబడి ఇస్తున్నాయి.

డివిడెండ్స్ మీ స్టాక్స్‌పై ఇన్సెంటివ్ రూపంలో వచ్చే అదనపు ఆదాయం అన్నమాట. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ కంటే కూడా సగటున ఇవి ఎక్కువ ఆధాయం ఇస్తున్నందున మదుపరులు వీటివైపు మొగ్గు చూపుతున్నారు.

డిస్‌క్లెయిమర్: ఇక్కడ ఇచ్చిన సిఫారసులు, అభిప్రాయాలు అనలస్టిలు, బ్రోకింగ్ కంపెనీలవే. హెచ్‌టీవి కావు.