తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tata Punch Ev Vs Citroen Ec3 : ఈ రెండు ఎలక్ట్రిక్​ వెహికిల్స్​లో ఏది బెస్ట్​?

Tata Punch EV vs Citroen eC3 : ఈ రెండు ఎలక్ట్రిక్​ వెహికిల్స్​లో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu

11 February 2024, 15:30 IST

    • Tata Punch EV price : టాటా పంచ్​ ఈవీ వర్సెస్​ సిట్రోయెన్​ ఈసీ3.. ఈ రెండు ఎలక్ట్రిక్​ వెహికిల్స్​లో ఏది బెస్ట్​? ఇక్కడ తెలుసుకోండి..
ఈ రెండు ఎలక్ట్రిక్​ వెహికిల్స్​లో ఏది బెస్ట్​?
ఈ రెండు ఎలక్ట్రిక్​ వెహికిల్స్​లో ఏది బెస్ట్​?

ఈ రెండు ఎలక్ట్రిక్​ వెహికిల్స్​లో ఏది బెస్ట్​?

Tata Punch EV on road price in Hyderabad : ఇండియన్​ ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో కొత్తగా లాంచ్​ అయిన టాటా పంచ్​ ఈవీ.. టాక్​ ఆఫ్​ ది టౌన్​గా మారింది! స్టైలిష్​ డిజైన్​తో.. ఈ ఈవీ కస్టమర్లను ఆకర్షిస్తోంది. అదే సమయంలో.. సబ్​ కాంపాక్ట్ ఈవీ​ సెగ్మెంట్​లో మరో ఎలక్ట్రిక్​ వెహికిల్​.. సిట్రోయెన్​ ఈసీ3కి గట్టిపోటీని ఇస్తోంది టాటా పంచ్ ఈవీ​. ఈ నేపథ్యంలో.. ఈ రెండింటినీ పోల్చి, ఏది కొంటే బెటర్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

టాటా పంచ్​ ఈవీ వర్సెస్​ సిట్రోయెన్​ ఈసీ3- ఫీచర్స్​..

టాటా మోటార్స్​కు చెందిన సెకెండ్​ జెనరేషన్​ “ఆక్టీ. ఈవీ” ప్లాట్​ఫామ్​పై ఈ టాటా పంచ్​ ఈవీని రూపొందించారు. ఇందులో 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, 10.23 ఇంచ్​ వర్చ్యువల్​ కాక్​పిట్​, వెంటిలెటేడ్​ ఫ్రెంట్​ సీట్స్​, ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్స్​ ఉన్నాయి.

Citroen eC3 on road price in Hyderabad : ఇక సిట్రోయెన్​ ఈసీ3లో 10.25 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, వయర్​లెస్​ యాపిల్​ కార్​ప్లే, ఆండ్రాయిడ్​ ఆటో కనెక్టివిటీతో పాటు 35 ఇతర కనెక్టివిటీ ఫీచర్స్​ ఉన్నాయి.

మొత్తం మీద చూస్తే.. టాటా పంచ్​ ఈవీ ఫీచర్స్​ ముందు.. సిట్రోయెన్​ ఈసీ3 ఫీచర్స్​ డల్​గానే కనిపిస్తున్నాయి!

టాటా పంచ్​ ఈవీ వర్సెస్​ సిట్రోయెన్​ ఈసీ3- ఇంజిన్​, బ్యాటరీ, రేంజ్​..

టాటా పంచ్​ ఈవీ ఎస్​యూవీలో రెండు వర్షెన్​లు ఉన్నాయి. ఒకటి 25 కడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​తో కూడిన మిడ్​-రేంజ్​ వర్షెన్​. దీని రేంజ్​ 315 కి.మీలు. రెండోది.. 35 కేడబ్ల్యూహెచ్​తో కూడిన లాంగ్​ రేంజ్​ వర్షెన్​. దీనిని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 421 కి.మీల దూరం ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది. స్టాండర్డ్​ టాటా పంచ్​ ఈవీలో 60 కేడబ్ల్యూ పర్మనెంట్​ మాగ్నెట్​ సింక్రొనైజ్​ ఏసీ మోటార్​ ఉంటుంది. ఇది 114 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. లాంగ్​ రేంజ్​లో ఉండ 90 కేడబ్ల్యూ మోటార్​.. 190 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

Tata Punch EV range : టాటా పంచ్​ ఈవీలో రెండు ఛార్జింగ్​ ఆప్షన్స్​ ఉన్నాయి. అవి.. 7.2 కేడబ్ల్యూ ఫాస్ట్​ హోం ఛార్జర్​, 50 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్​ ఛార్జర్​. 10శాతం నుంచి 80 శాతం ఛార్జింగ్​ని కేవలం 56 నిమిషాల్లో పూర్తి చేసుకోవచ్చు!

మరోవైపు.. సిట్రోయెన్​ ఈసీ3లో ఒకటే బ్యాటరీ ప్యాక్​ ఉంది. ఫ్రెంట్​ యాక్సిల్​ మౌంటెడ్​ ఎలక్ట్రిక్​ మోటార్​కి 29.2 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్​ కనెక్ట్​ చేసి ఉంటుంది. ఈ మోటర్​.. 57 హెచ్​పీ పవర్​ని, 143 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇక బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. 320కి.మీల దూరం ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది.

టాటా పంచ్​ ఈవీ వర్సెస్​ సిట్రోయెన్​ ఈసీ3- ధరలు ఎంతంటే..

Citroen eC3 range details : ఇండియాలో టాటా పంచ్​ ఈవీ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 11లక్షలుగా ఉంది. సిట్రోయెన్​ ఈసీ3 ఎక్స్​షోరూం ధర రూ. 11.61లక్షలుగా ఉంది. పంచ్​ ఈవీ టాప్​ ఎండ్​ మోడల్​ ఎక్స్​షోరూం ధర రూ. 15.49లక్షలుగా ఉండగా.. సిట్రోయెన్​ ఈసీ3 టాప్​ ఎండ్​ మోడల్​ ఖరీదు రూ. 13.50 లక్షలుగా ఉంది (ఎక్స్​షోరూం).

టాటా పంచ్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర.. సిట్రోయెన్​ ఎలక్ట్రిక్​ వెహికల్​తో పోల్చుకుంటే.. రూ. 60 తక్కువే. కానీ ముగింపు, టాప్​ ఎండ్​ ధర మాత్రం దాదాపు రూ. 2లక్షలు అధికం! అందుకు తగ్గట్టుగానే.. టాటా పంచ్​ ఈవీలో ఎక్స్​ట్రా ఫీచర్స్​ ఉన్నాయి.

తదుపరి వ్యాసం