Hyundai Casper EV : హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్.. కాస్పర్ ఈవీ ఇదే!
Hyundai Casper EV price : కొత్త ఈవీని లాంచ్ చేసేందుకు హ్యుందాయ్ మోటార్ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ హ్యుందాయ్ కాస్పర్ ఈవీ టెస్ట్ రన్ ఇటీవలే జరిగింది. పూర్తి వివరాలు..
Hyundai Casper EV test run : సరికొత్త ఎలక్ట్రిక్ వెహికిల్‌ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్. దీని పేరు హ్యుందాయ్ కాస్పర్ ఈవీ. ఇదొక బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ. ఈ ఏడాది చివర్లో.. ఇది అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు.. ఈ హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ వెహికిల్‌కి సంబంధించి, ఓ వార్త బయటకు వచ్చింది. ఆస్ట్రేలియా వీధుల్లో.. హ్యుందాయ్ కాస్పర్ ఈవీ టెస్ట్ రన్ జరిగింది. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. వాటి ద్వారా.. ఈ ఈవీకి చెందిన పలు కీలక విషయాలు స్పష్టమవుతున్నాయి. వాటిని ఇక్కడ చూసేయండి..
హ్యుందాయ్ కాస్పర్ ఈవీ..
ఆన్లైన్లో లీక్ అయిన ఫొటోలను గమనిస్తే.. హ్యుందాయ్ కాస్పర్ ఈవీ.. ఓ బుడ్డ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అని స్పష్టమవుతోంది. అంతేకాకుండా.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న కాస్పర్కి, త్వరలోనే లాంచ్ అయ్యే ఈవీ వర్షెన్ డిజైన్‌కి మధ్య పెద్దగా తేడా కనిపించడం లేదు. కాస్పర్ ఈవీలో సర్క్యులర్ హెడ్‌లైట్స్, ఎల్ఈడీ లైట్ సిగ్నేచర్స్పై పారామెట్రిక్ పిక్సెల్ పాటర్న్స్, స్లీక్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ వంటివి ఉన్నాయి. ఈ హ్యుందాయ్ ఎలక్ట్రిక్ వెహికిల్‌లో స్పోర్టీ అలాయ్ వీల్స్, సీ పిల్లర్ మౌంటెడ్ రేర్ డోర్ హ్యాండిల్స్, బ్లాక్డ్ ఔట్ ఫంక్షనల్ రూఫ్ రెయిల్స్ వంటివి కనిపిస్తున్నాయి.
Hyundai Casper EV price : రూమర్స్ ప్రకారం.. పెట్రోల్ వర్షెన్‌తో పోల్చుకుంటే.. హ్యుందాయ్ కాస్పర్ ఈవీ వీల్‌బేస్ కాస్త ఎక్కువగానే ఉండొచ్చు. ఇదే నిజమైతే.. కేబిన్ స్పేస్ మరింత పెరుగుతున్నట్టు అవుతుంది.
ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో అడ్వాన్స్డ్ బ్యాటరీ ప్యాక్‌ని హ్యుందాయ్ వినియోగిస్తుందని టాక్ నడుస్తోంది. ఈ బ్యాటరీ ప్యాక్ రేంజ్ 320 కి.మీలుగా ఉంటుందని సమాచారం. దీనిపై ప్రస్తుతం క్లారిటీ లేదు.
Hyundai Casper EV Australia : హ్యుందాయ్ కాస్పర్ ఎలక్ట్రిక్ వెహికిల్‌లో భారీ 10 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, హీటెడ్ స్టీరింగ్ వీల్, హీటెడ్ ఫ్రెంట్ సీట్స్, ఆర్టిఫీషియెల్ లెథర్ అప్‌హోలిస్ట్రీ, వెంటిలేటెడ్ డ్రైవర్ సీట్, సింగిల్ పన్ సన్‌రూఫ్, మూడ్ ల్యాంప్, బ్లూలింక్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ కూడా ఉంటాయని సమాచారం. హ్యుందాయ్ కొత్త ఈవీలో ఆడాస్ ఫీచర్స్ కోసం ఫ్రెంట్ రేడార్ మాడ్యూల్ ఉంటుందట.
హ్యుందాయ్ కాస్పర్ ఈవీ- ధర ఎంత?
ఆస్ట్రేలియా మార్కెట్లో హ్యుందాయ్ కాస్పర్ ఈవీ ధర 40వేల ఏయూడీగా ఉండొచ్చు. అంటే.. ఇండియన్ కరెన్సీలో అది సుమారు రూ. 21.55లక్షలు.
Hyundai Casper EV review : మరి ఈ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ.. అంతర్జాతీయ మర్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుంది? ఇతర ఫీచర్స్ వివరాలేంటి? ఇండియాలో లాంచ్ అవుతుందా? ఎప్పుడు లాంచ్ అవుతుంది? వంటి అంశాలపై ప్రస్తుతం క్లారిటీ లేదు. త్వరలోనే.. వీటిపై హ్యుందాయ్ మోటార్ స్పందించే అవకాశం ఉంది.
సంబంధిత కథనం