New electric scooter : 98కి.మీ రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్- ధర ఎంతంటే..
Lectrix EV LXS 2.0 : ఈవీ తయారీ సంస్థ లెక్ట్రిక్స్.. ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేసింది. దాని ఫీచర్స్, రేంజ్, ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
Lectrix EV LXS 2.0 electric scooter price in India : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లోని ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌కు డిమాండ్ మామూలుగా లేదు. మరీ ముఖ్యంగా.. 2 వీలర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌కు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. దానిని క్యాష్ చేసుకునేందుకు.. ఆటోమొబైల్ సంస్థలు పోటీపడి మరీ కొత్త కొత్త ఈవీలను లాంచ్ చేస్తున్నాయి. ఎస్ఏఆర్ ఎలక్ట్రిక్ మొబిలిటీలో భాగమైన 2 వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ లెక్ట్రిక్స్ ఈవీ.. తాజాగా ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేసింది. దాని పేరు ఎల్ఎక్స్ఎస్ 2.0. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఫీచర్స్, రేంజ్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..
ఈ లెక్ట్రిక్స్ సంస్థకు ఇప్పటికే మార్కెట్లో.. ఎల్ఎక్స్ఎస్ 3.0 ఈవీ ఉంది. తాజాగా లాంచ్ అయిన ఎల్ఎక్స్ఎస్ 2.0.. దాని కింది వరుసలో ఉంటుంది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లో 2.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. బీఎల్డీసీ హబ్ మోటార్ ఈ వెహికిల్‌లో ఉంది. దీని టాప్ స్పీడ్ 60 కేఎంపీహెచ్. బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. ఈ ఎల్ఎక్స్ఎస్ 2.0 ఈ-స్కూటర్.. 98 కి.మీలు ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది.
Lectrix EV LXS 2.0 range : 25 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, ఫాలో-మీ హెడ్‌ల్యాంప్ ఫంక్షన్, 90/100 ఫ్రెంట్- 110/90 10- ఇంచ్ టైర్స్‌తో పాటు మరిన్ని ఫీచర్స్ వస్తున్నాయి.
రేంజ్, క్వాలిటీ, వాల్యూ కోసం చూసే కస్టమర్లకు తమ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఎల్ఎక్స్ఎస్ 2.0 సూట్ అవుతుందని లెక్ట్రిక్స్ చెబుతోంది.
"వాల్యూ కోసం చూసే కస్టమర్ల ఆలోచనలను మేము అర్థం చేసుకోగలము. అందుకు తగ్గట్టుగా మేము ఓ కొత్త ఈవీని తీసుకొచ్చాము. వాల్యూ- అఫార్డెబులుటీని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తుంది ఈ ఈ-స్కూటర్. ఇన్నోవేషన్, క్వాలిటీ విషయంలో అస్సలు రాజీపడలేదు," అని సార్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎండీ, సీఈఓ క విజయ కుమార్ తెలిపారు.
లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ 2.0 ధర ఎంతంటే..
Best electric scooter in India : ఈ లెక్ట్రిక్స్ ఎల్ఎక్స్ఎస్ 2.0 ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్‌షోరూం ధర రూ. 79,999గా ఉంది. బుకింగ్స్ మొదలయ్యాయి. మార్చ్‌లో డెలివరీలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. అంతేకాకుండా.. ఈ స్కూటర్ కొన్న వారికి 3ఏళ్లు లేదా 3000 కి.మీల వరకు వారెంటీని ఇస్తోంది సంస్థ. ఇందులో యాంటీ థెఫ్ట్ సిస్టెమ్ కూడా ఉంది. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ కూడా ఉంది. డోర్ స్టెప్ సర్వీస్‌ని కూడా ఇస్తామని సంస్థ చెబుతోంది.
లెక్ట్రిక్స్ సంస్థకు ఇండియాలో సేల్స్ బాగా పెరుగుతున్నాయి. తన పోర్ట్‌ఫోలియోలోని వెహికిల్‌ని ఇప్పటికే దేశవ్యాప్తంగా 10వేలకుపైగా మందికి విక్రయించామని సంస్థ చెబుతోంది.
సంబంధిత కథనం