Hyundai cars discounts: హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్స్; ఈ కార్లకు మాత్రమే..-hyundai vehicles get cheaper by upto 50 000 rupees check details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Cars Discounts: హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్స్; ఈ కార్లకు మాత్రమే..

Hyundai cars discounts: హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్స్; ఈ కార్లకు మాత్రమే..

HT Telugu Desk HT Telugu
Feb 08, 2024 05:42 PM IST

Discounts on Hyundai cars : తమ కార్ల శ్రేణిలోని పలు కార్లపై హ్యుందాయ్ కంపెనీ డిస్కౌంట్లను ప్రకటించింది. గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా, ఐ20, వెర్నా తదితర మోడల్స్ పై రూ. 50,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అయితే, Creta, Exter, Ioniq 5 లపై మాత్రం ఈ డిస్కౌంట్ ఆఫర్‌లు అందుబాటులో లేవు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (REUTERS)

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ వాహన ఉత్పత్తి సంస్థ హ్యుందాయ్ (Hyundai) తన వాహన శ్రేణిలోని పలు వాహనాలపై రూ. 50 వేల వరకు డిస్కౌంట్ లను ప్రకటించింది. వినియోగదారులు గ్రాండ్ ఐ10 నియోస్, ఆరా, ఐ20, వెర్నా, ఆల్కజార్, టస్కన్ మోడల్స్ పై ఈ తగ్గింపును పొందవచ్చు. హ్యుండై ఎక్స్ టర్, క్రెటా, అయోనిక్ 5 మోడల్స్ పై మాత్రం ఎలాంటి ప్రమోషనల్ ఆఫర్స్ అందుబాటులో లేవు.

జనవరిలో హైయెస్ట్ సేల్స్

ఈ సంవత్సరం జనవరి నెలలో హ్యుందాయ్ అత్యధిక నెలవారీ దేశీయ విక్రయాలను సాధించింది. ఈ సేల్స్ లో ఎక్స్‌టర్ (exter), క్రెటా (creta) మోడల్‌లదే సింహభాగం. హ్యుందాయ్ కంపెనీ జనవరిలో భారతీయ మార్కెట్లో మొత్తం 57,115 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలను విక్రయించినట్లు నివేదించింది. వీటికి ఎగుమతి చేసిన కార్ల యూనిట్ల సంఖ్యను కూడా కలిపితే, మొత్తం అమ్మకాలు 67,615 యూనిట్లకు చేరుకున్నాయి.

వీటిపై డిస్కౌంట్స్..

హ్యుందాయ్ ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్స్ మోడల్ ను, ప్రాంతాన్ని, వేరియంట్ ను, అందుబాటును బట్టి మారుతుంటాయన్న విషయాన్ని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. Grand i10 Nios CNG వేరియంట్‌ లపై రూ. 20,000 నగదు తగ్గింపు, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు లభిస్తుంది. మొత్తంగా ఈ మోడల్ పై రూ. 33,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. Aura, CNG మోడల్‌లపై కూడా రూ. 33,000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, నాన్-సిఎన్‌జి మోడల్స్ కు రూ. 5,000 వరకు డిస్కౌంట్ తో పాటు, ఎక్స్ఛేంజ్ బోనస్‌, కార్పొరేట్ డిస్కౌంట్‌ కూడా లభిస్తాయి.

ఐ 20 పై..

హ్యుందాయ్ i20 (Hyundai I20) ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ MT వేరియంట్‌కు రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 15,000 నగదు తగ్గింపును హ్యుందాయ్ అందిస్తుంది. అయితే IVt మోడల్ పై మాత్రం ఎక్స్ఛేంజ్ బోనస్‌ మాత్రమే అందుతుంది. ఫేస్‌లిఫ్ట్ చేసిన వెర్నా సెడాన్ స్టిక్కర్ ధరపై రూ. 15,000 తగ్గింపుతో పాటు రూ. 20,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తుంది. వెన్యూ (Hyundai venue) మోడల్ పై రూ. 25 వేల వరకు డిస్కౌంట్ ను హ్యుందాయ్ ప్రకటించింది. ఇందులో నగదు తగ్గింపులు, ఎక్స్‌ఛేంజ్ బోనస్‌లు ఉంటాయి. అలాగే, Alcazar SUV ని రూ. 2,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 15,000 నగదు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. టక్సన్ డీజిల్ వేరియంట్ పై గరిష్టంగా రూ. 50,000 ప్రత్యేక తగ్గింపును వినియోగదారులు పొందవచ్చు. అయితే, టక్సన్ పెట్రోల్ వేరియంట్‌ కు ఈ డిస్కౌంట్ వర్తించదు.

WhatsApp channel