Hyundai VENUE : హ్యుందాయ్ వెన్యూ సరికొత్త ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే!
Hyundai VENUE Knight Edition : హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ లాంచ్ అయ్యింది. ఈ మోడల్ ధర, ఫీచర్స్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
Hyundai VENUE Knight Edition : దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్.. జోరు మీద ఉంది! ఇండియాలో సంస్థకు బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌గా ఉన్న క్రేటా, అల్కజార్‌లకు 'అడ్వెంచర్' ఎడిషన్‌ను ఇటీవలే లాంచ్ చేసిన ఈ సంస్థ.. తాజాగా వెన్యూ ఎస్‌యూవీకి కూడా కొత్త అవతారాన్ని ఇచ్చింది. హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ తాజాగా లాంచ్ అయ్యింది. ఈ మోడల్ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..
హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్..
వెన్యూ ఎస్‌యూవీలో బ్లాక్ పెయింటెడ్ గ్రిల్ వస్తోంది. అలాయ్ వీల్స్, వీల్ కవర్స్ వంటివి కూడా బ్లాక్‌లోనే ఉండనున్నాయి. ఇక ఈ వెహికిల్ కేబిన్‌లో కూడా ఆల్-బ్లాక్ థీమ్ కనిపిస్తుంది. ఫలితంగా ఆ మోడల్ మరింత అట్రాక్టివ్‌గా మారింది.
ఈ కొత్త ఎడిషన్‌లో డ్యూయెల్ కెమెరా సెటప్‌తో కూడిన డాష్‌క్యామ్, సన్‌రూఫ్, స్పోర్టీ మెటాలిక్ ప్యాడెల్స్, ఎలక్ట్రో-క్రోమిక్ ఐఆర్వీఎం వంటి ఫీచర్స్ సైతం లభిస్తున్నాయి. వీటితో పాటు ఎయిర్ ప్యూరిఫయర్, యాంబియెంట్ లైటింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, బాస్ సౌండ్ సిస్టెమ్ వంటివి కూడా ఉన్నాయి.
వెన్యూ నైట్ ఎడిషన్.. ధర ఎంతంటే!
Hyundai VENUE Knight Edition price : ఈ ఎస్‌యూవీలో 1.2 లీటర్ ఇన్లైన్ 4 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 5 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ లభిస్తోంది. దీని పేరు వెన్యూ ఎస్ (ఓ) నైట్ ఎంటీ వర్షెన్. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 10లక్షలు.
ఇదీ చూడండి:- MG Comet EV Gamer Edition : ఎంజీ కామెట్ ఈవీ గేమర్ ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే!
ఇక 1.0 లీటర్, టర్బో పెట్రోల్ ఇంజిన్ కూడా ఉంది. ఇందులో 7 స్పీడ్ డీసీటీ ట్రాన్స్మిషన్ ఉంటుంది. దీని పేరు వెన్యూ ఎస్ఎక్స్ (ఓ) డీసీటీ డ్యూయెల్ టోన్. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 13.48లక్షలు.
క్రేటా.. అల్కజార్..
హ్యుందాయ్ క్రేటా, అల్కజార్ ఈ కొత్త ఎడిషన్స్‌లో బ్లాక్డ్- ఔట్ స్కిడ్ ప్లేట్స్, గ్రిల్, సైడ్ సిల్స్, రూఫ్ రెయిల్స్, ఓఆర్వీఎంలు, షార్క్ ఫిన్ యాంటీనా, అలాయ్ వీల్స్ వంటివి వస్తున్నాయి. ఫ్రెంట్ ఫెండర్‌పై "అడ్వెంచర్" ఎంబ్లమ్ ఉంటుంది. ఇక రేర్‌లో డార్క్ క్రోమ్ ఫినీష్‌తో కూడిన హ్యుందాయ్ లోగో లభిస్తోంది. ఇక ఇంటీరియర్‌లో ఆల్- బ్లాక్ థీమ్, కొత్త అప్‌హోలిస్ట్రీ, సేజ్ గ్రీన్ ఇన్సర్ట్స్, డ్యూయెల్ కెమెరా డాష్‌క్యామ్, మెటల్ పాడ్స్, అడ్వెంచర్ స్పెక్ మాట్స్లు మరింత స్టైల్‌ను యాడ్ చేసే విధంగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం