Tata Motors car sales : 13.9శాతం పెరిగిన టాటా మోటార్స్ సేల్స్..
02 January 2023, 7:01 IST
- Tata Motors car sales data : డిసెంబర్‌కు సంబంధించిన సేల్స్ డేటాను రిలీజ్ చేసింది టాటా మోటార్స్. మొత్తం మీద 13.9శాతం వృద్ధిని నమోదు చేసింది.
టాటా మోటార్స్
Tata Motors car sales in December 2022 : 2022 డిసెంబర్‌కు సంబంధించిన కార్ సేల్స్ డేటాను విడుదల చేసింది దేశీయ దిగ్గజ ఆటో సంస్థ టాటా మోటార్స్. 40,407 ప్యాసింజర్ యూనిట్స్‌ను విక్రయించింది. 2021 డిసెంబర్లో అది 35,462 యూనిట్లుగా ఉంది. అంటే.. ఈసారి 13.9శాతం వృద్ధిని నమోదు చేసినట్టు! మొత్తం మీద.. సేల్స్ విషయంలో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 32.8శాతం వృద్ధిని సాధించినట్టు టాటా మోటార్స్ వెల్లడించింది. 2023 ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికంలో 1,32,255 ప్యాసింజర్ వాహనాలను విక్రయించినట్టు స్పష్టం చేసింది. గత ఆర్థిక ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ సంఖ్య 99,564గా ఉండేదని వివరించింది.
ఒక్క డొమెస్టిక్ మార్కెట్లోనే 40,043 ప్యాసింజిర్ వెహికిల్స్‌ను డిసెంబర్లో విక్రయించింది టాటా మోటార్స్. 2021 డిసెంబర్ (35,2999)తో పోల్చుకుంటే ఇది 13.4శాతం ఎక్కువ. మొత్తం మీద గత త్రైమాసికంలో 1,31,297 యూనిట్లను డొమెస్టిక్ మార్కెట్లో విక్రయించింది.
Tata Motors price hike : టాటా మోటార్స్ ఎగుమతులు కూడా గత నెలలో గణనీయంగా పెరిగాయి. విదేశీ విపణిలోకి 364 వాహనాలను ఎగుమతి చేసింది ఈ దిగ్గజ ఆటో సంస్థ. 2021 డిసెంబర్ (163)తో పోల్చుకుంటే ఇది 13.9శాతం ఎక్కువ.
ఇక దేశీయ ఈవీ సెగ్మెంట్లో దూసుకెళుతున్న టాటా మోటార్స్.. 2022 డిసెంబర్లో 3,868 ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మింది. 2021 డిసెంబర్‌తో (2,355) పోల్చుకుంటే ఇది 64.2శాతం అధికంగా ఉండటం విశేషం. ఇక ఎఫ్వై23 మూడో త్రైమాసికంలో మొత్తం మీద 12,596 ఈవీలను విక్రయించింది. గత ఆర్థిక ఏడాది ఇదే త్రైమాసికంలో 5,826 యూనిట్లను సేల్ చేసింది. అంటే ఈ సెగ్మెంట్లో 116.2శాతం వృద్ధిని నమోదు చేసినట్టు!
Tata Motors car sales data : "2022 సంవత్సరం మాకు ఎంతో కీలకం. పరిశ్రమ కన్నా ఎక్కువ వృద్ధిని నమోదు చేశాము. 5లక్షల మైలురాయిని అందుకున్నాము. ఇక ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో గత త్రైమాసికం ది బెస్ట్‌గా నిలిచింది. కొత్త లాంచ్‌లు, పండుగ డిమాండ్, వాహనాల సప్లై మాకు కలిసి వచ్చింది. భవిష్యత్తులో కూడా మా వృద్ధి ఇదే విధంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాము," అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ఎండీ శైలేష్ చంద్ర వెల్లడించారు.
టయోటా.. అదుర్స్..!
Toyota car sales data : డిసెంబర్‌తో పాటు 2022 మొత్తానికి సంబంధించిన కార్ సేల్స్ డేటాను రిలీజ్ చేసింది టయోటా కిర్లోస్కర్ మోటార్. ఇండియాలో.. దశాబ్ద కలంలోనే అత్యుత్తమ ప్రదర్శన చేసింది ఈ సంస్థ. డిసెంబర్లో 10,421 యూనిట్లు సేల్ చేసింది. 2021 డిసెంబర్లో అది 10,834గా ఉంది. కాగా.. 2022 మొత్తం మీద 1,60,357 యూనిట్లను విక్రయించింది. 2021తో (1,30,768) పోల్చుకుంటే ఇది 23శాతం అధికం. గతంలో.. అంటే 2012లో 1,72,241 యూనిట్లను విక్రయించింది. ఆ తర్వాత ఈ స్థాయిలో సేల్స్ ఎప్పుడు జరగలేదు.
అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఇన్నోవా హైక్రాస్ వంటి కొత్త కొత్త లాంచ్‌లతో కస్టమర్లను ఆకర్షించినట్టు, అందుకే సేల్స్ వృద్ధి చెందినట్టు సంస్థ చెబుతోంది. ఈ రెండు వాహనాలకు కస్టమర్ల నుంచి విపరీతమైన డిమాండ్ కనిపిస్తున్నట్టు వెల్లడించింది. ఫార్చ్యునర్, లెజెండర్, కామ్రీ, వెల్ఫైర్ వంటి మోడల్స్‌కు క్రేజ్ కొనసాగుతోందని స్పష్టం చేసింది.