తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Maruti Suzuki Car Sales : మారుతీ సుజుకీ కార్ల అమ్మకాలు డౌన్​.. ఎంజీ మోటార్​ సేల్స్​ అప్​!

Maruti Suzuki car sales : మారుతీ సుజుకీ కార్ల అమ్మకాలు డౌన్​.. ఎంజీ మోటార్​ సేల్స్​ అప్​!

01 January 2023, 13:28 IST

google News
  • Maruti Suzuki car sales : 2022 డిసెంబర్​కు సంబంధించిన ఆటో సేల్స్​ను ఆయా సంస్థలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నాయి. మారుతీ సుజుకీ, ఎంజీ మోటార్​ సేల్స్​ వచ్చాయి. మారుతీ సుజుకీ కార్ల అమ్మకాలు తగ్గాయి. ఎంజీ మోటార్​ సేల్స్​ పెరిగాయి.

మారుతీ సుజుకీ కార్ల అమ్మకాలు డౌన్​..
మారుతీ సుజుకీ కార్ల అమ్మకాలు డౌన్​..

మారుతీ సుజుకీ కార్ల అమ్మకాలు డౌన్​..

Maruti Suzuki car sales : మారుతీ సుజుకీ వాహనాల జోరు తగ్గింది! 2022 డిసెంబర్​లో 1,39,347 హోల్​సేల్​ యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. 2021 డిసెంబర్​తో పోల్చుకుంటే ఇది 9శాతం తక్కువ. 2021 డిసెంబర్​లో 1,53,149 యూనిట్లను విక్రయించింది ఈ దిగ్గజ ఆటో సంస్థ.

డిసెంబర్​ ఆటో సేల్స్​కు సంబంధించిన వివరాలను ఆదివారం విడుదల చేసింది మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్​ (ఎంఎస్​ఐఎల్​). 2021 డిసెంబర్​లో 1,26,021 డొమెస్టిక్​ హోల్​సేల్​ యూనిట్లు అమ్ముడుపోగా.. 2022 చివరి నెలలో 1,13,535 వాహనాలే సేల్​ అయ్యాయి. ఇది 9.91శాతం తక్కువ.

Maruti Suzuki December car sales : 2021తో పోల్చుకుంటే.. 2022 డిసెంబర్​లో ఆల్టో, ఎస్​- ప్రెస్సో వంటి మినీ కార్ల విక్రయాలు తగ్గాయి. నాడు 16,320 కార్లు అమ్ముడుపోగా.. ఈసారి అది 9,765గా నిలిచింది. అదే సమయంలో.. బలెనో, సెలేరియా, డిజైర్​, ఇగ్నిస్​, స్విఫ్ట్​, టూర్​ ఎస్​, వాగన్​ఆర్​ వంటి వాహనాలు​ 57,502 అమ్ముడుపోయాయి. 2021 డిసెంబర్​లో అది 69,345గా ఉంది.

మరోవైపు బ్రెజా, ఎర్టిగా, ఎస్​-క్రాస్​, ఎక్స్​ఎల్​6, గ్రాండ్​ విటారాతో కూడిన మారుతీ సుజుకీ ఎస్​యూవీ సెగ్మెంట్​ బలపడింది. 2021 డిసెంబర్​ 26,982 వాహనాలు అమ్ముడుపోగా.. ఈసారి అది 33,008గా నిలిచింది.

విడి భాగాల కొరత కారణంగా.. వాహనాల తయారీ దెబ్బతిందని. అందుకే ప్రొడక్షన్​ తగ్గువగా జరిగిందని మారుతీ సుజుకీ వెల్లడించింది. ప్రొడక్షన్​ను పెంచేందుకు తగిన చర్యలు చేపట్టినట్టు వివరించింది.

ఈ నెలలో వాహనాల ధరలు పెంచనున్నట్టు మారుతీ సుజుకీ ఇప్పటికే ప్రకటించింది. ఈ విషయంపై ఇంకొన్ని రోజుల్లో పూర్తి వివరాలు అధికారికంగా బయటకొస్తాయి. మారుతీ సుజుకీతో పాటు టాటా మోటార్స్​, హ్యుందాయ్​ వంటి ఆటో సంస్థలు సైతం.. ఈ నెలలో కార్ల ధరలను పెంచాలని నిర్ణయించుకున్నారు.

ఎంజీ మోటార్​..

MG Motor India December car sales : 2022 డిసెంబర్​కు సంబంధించిన కార్​ సేల్స్​ వివరాలను ఆదివారం ప్రకటించింది ఎంజీ మోటార్​. గత నెలలో ఎంజీ మోటార్​ ఇండియా సేల్స్​ 53శాతం పెరిగాయి. మొత్తం మీద 3,899 వాహనాలు అమ్ముడుపోయాయి. 2021 డిసెంబర్​లో ఇది 2,550గా ఉంది.

కొవిడ్​ సంక్షోభం, లాజిస్టిక్స్​ కారణంగా ప్రొడక్షన్​ దెబ్బతిందని.. అయితే రానున్న రోజుల్లో పరిస్థితులు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది ఎంజీ మోటార్​.

MG Motor India sales : దేశంలో ఈవీ సెగ్మెంట్​పై ఎంజీ మోటార్​ అధిక దృష్టిని సారించింది. ఎంజీ ఈవీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డ్రైవ్​లో భాగంగా.. ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో 150కి ఛార్జర్స్​ను ఏర్పాటు చేశారు.

తదుపరి వ్యాసం