తెలుగు న్యూస్  /  Business  /  Stocks To Buy Or Sell Today 2nd March 2023 Lic Sbi Share Price Target

Stocks to buy today : స్టాక్స్​ టు బై.. ఎల్​ఐసీ, ఎస్​బీఐ షేర్​ ప్రైజ్​ టార్గెట్స్​ ఇవే..

Sharath Chitturi HT Telugu

02 March 2023, 6:20 IST

    • Stocks to buy today : ట్రేడర్స్​ ట్రాక్​ చేయాల్సిన నేటి స్టాక్స్​ టు బై లిస్ట్​ను నిపుణులు వెల్లడించారు. ఆ వివరాలు..
స్టాక్స్​ టు బై లిస్ట్​
స్టాక్స్​ టు బై లిస్ట్​

స్టాక్స్​ టు బై లిస్ట్​

Stocks to buy today : వరుస నష్టాలకు బ్రేక్​ పెడుతూ.. దేశీయ స్టాక్​ మార్కెట్​లు బుధవారం ట్రేడింగ్​ సెషన్​ను లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 448 పాయింట్ల లాభంతో 59,411 వద్ద స్థిరపడింది. 146 పాయింట్లు పెరిగిన నిఫ్టీ.. 17,450 వద్దకు చేరింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 429 పాయింట్లు లాభపడి.. 40,698 వద్ద ముగిసింది.

ట్రెండింగ్ వార్తలు

Ampere Nexus e-scooter: రివర్స్ మోడ్, 136 కిమీ రేంజ్ తో భారత్ లోకి యాంపియర్ నెక్సస్ ఈ-స్కూటర్

ITR filing 2024: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? ఫామ్ 16 గురించి ఈ విషయాలు తెలుసుకోండి

Air India-Vistara merger: ఎయిర్ ఇండియా - విస్తారా విలీనంపై కీలక అప్ డేట్ ఇచ్చిన టాటా సన్స్

Changes from May 1 : మే 1 నుంచి ఈ విషయాల్లో భారీ మార్పులు.. కచ్చితంగా తెలుసుకోవాలి

స్టాక్​ మార్కెట్​ నిపుణుల ప్రకారం.. నిఫ్టీ షార్ట్​ టర్మ్​ డౌన్​ట్రెండ్​ మారింది! సిస్టెమ్​లో షార్ట్​ పొజిషన్​లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏమాత్రం షార్ట్​ కవరింగ్​ కనిపించినా, మార్కెట్​లు ఇక్కడి నుంచి ఇంకా పెరుగుతాయి. రానున్న సెషన్స్​పైనే ఇది ఆధారపడి ఉంటుంది.

Stock market news today : "కీలకమైన సపోర్ట్​ నుంచి మార్చ్​ 1 ట్రేడింగ్​ సెషన్​లో నిఫ్టీ పుంజుకుంది. ఫలితంగా నిఫ్టీ షార్ట్​ టర్మ్​ డౌన్​ట్రెండ్​ మారింది. ఇక్కడి నుంచి ముందు 17,610 లెవల్స్​కు నిఫ్టీ చేరే అవకాశం ఉంది. 17,299- 17,353 లెవల్స్​ వద్ద సపోర్ట్​ దొరకొచ్చు," అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కు చెందిన రీటైల్​ రీసెర్చ్​ హెడ్​ దీపక్​ జసానీ తెలిపారు.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 424.88కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1498.66కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

స్టాక్స్​ టు బై లిస్ట్​..

రామ్​కో సిమెంట్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 710, టార్గెట్​ రూ. 750- రూ. 760

యూపీఎల్​:- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 695, టార్గెట్​ రూ. 730- రూ. 740

LIC share price target : లైఫ్​ ఇన్ష్యూరెన్స్​ కార్పొరేషన్​ (ఎల్​ఐసీ):- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 584, టార్గెట్​ రూ. 640

SBI share price target : స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఎస్​బీఐ):- బై కరెంట్​ మార్కెట్​ ప్రైజ్​, స్టాప్​ లాస్​ రూ. 516, టార్గెట్​ రూ. 565

హావెల్స్​ ఇండియా:- బై రూ. 1216, స్టాప్​ లాస్​ రూ. 1180, టార్గెట్​ రూ. 1260

Tata Motors share price target : టాటా మోటార్స్​, బై రూ. 426, స్టాప్​ లాస్​ రూ. 416, టార్గెట్​ రూ. 426

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు.. ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)