తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Day Trading Stocks Today: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన 7 స్టాక్స్.. డే ట్రేడింగ్ గైడ్

Day Trading Stocks Today: ట్రేడర్లు నేడు ఫోకస్ చేయాల్సిన 7 స్టాక్స్.. డే ట్రేడింగ్ గైడ్

10 March 2023, 7:42 IST

    • Day Trading Stocks Today: డే ట్రేడింగ్ చేసే వారు నేడు గమనించాల్సిన స్టాక్‍లను (Stocks to Buy Today) నిపుణులు సూచించారు. అలాగే నేడు భారత స్టాక్ మార్కెట్లు ఎలా ఓపెన్ అయ్యే అవకాశం ఉందంటే..
Intraday Stocks Today: ట్రేడర్లూ.. నేడు ఈ స్టాక్‍లపై లుక్కేయండి
Intraday Stocks Today: ట్రేడర్లూ.. నేడు ఈ స్టాక్‍లపై లుక్కేయండి

Intraday Stocks Today: ట్రేడర్లూ.. నేడు ఈ స్టాక్‍లపై లుక్కేయండి

Day Trading Guide: అంతర్జాతీయ మార్కెట్లలో తీవ్ర ప్రతికూలత ఉండటంతో గురువారం సెషన్‍లో భారత మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 164.80 పాయింట్లు కోల్పోయి 17,589.60 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 541.81 పాయింట్లు క్షీణించి 59,806.28 పాయంట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 320 పాయంట్లు తగ్గి 41,256 వద్దకు చేరింది. మరి నేడు (మార్చి 10, శుక్రవారం) భారత స్టాక్ మార్కెట్లు ఎలా ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, ట్రేడర్లు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఏవో ఇక్కడ తెలుసుకోండి.

ట్రెండింగ్ వార్తలు

iPad Air 2024: రెండేళ్ల నిరీక్షణకు తెర; లేటెస్ట్ ఎం2 చిప్ తో ఐప్యాడ్ ఎయిర్ 2024 సిరీస్ లాంచ్

Massive discounts on Mahindra cars: ఎక్స్ యూ వీ 300 సహా మహీంద్ర కార్లపై బంపర్ ఆఫర్స్, హెవీ డిస్కౌంట్స్..

Indegene Limited IPO: అదిరిపోయే జీఎంపీతో ఓపెన్ అయిన ఇండిజీన్ లిమిటెడ్ ఐపీఓ; ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు..

Stock market crash: స్టాక్ మార్కెట్ క్రాష్ కు కారణాలేంటి?.. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు మారాయా?

ప్రతికూలమే..!

SGX Nifty: భారత స్టాక్ మార్కెట్లు నేడు కూడా నష్టాలతోనే మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎస్‍జీఎక్స్ నిఫ్టీ 127 పాయింట్ల నష్టంతో ఉంది. అమెరికా మార్కెట్లు గురువారం కూడా భారీ నష్టాలను చవిచూశాయి.

నిఫ్టీకి 17,550 నుంచి 17,500 వద్ద బలమైన సపోర్ట్ ఉందని ప్రభుదాస్ లీలాధర్ టెక్నికల్ రీసెర్ వైస్ ప్రెసిడెంట్ వైశాలీ పరేఖ్ విశ్లేషించారు. ఒకవేళ ఆ లెవెల్‍ను దాటి నిఫ్టీ పడితే 17,200 వద్ద ముఖ్యమైన సపోర్ట్ ఉందని తెలిపారు. మార్కెట్‍లో సెంటిమెంట్ మళ్లీ నెగెటివ్‍గా మారిందని అన్నారు. 17,750 వద్ద నిఫ్టీకి రెసిస్టెట్స్ ఎదురవుతోందని, ఆ లెవెల్స్ వద్ద భారీగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోందని పరేఖ్ అభిప్రాయపడ్డారు.

Day Trading Stocks to Buy Today: ట్రేడర్లు నేడు గమనించాల్సిన స్టాక్స్

ఎస్‍బీఐ కార్డ్: బై అట్ రూ.767, టార్గెట్: రూ.795, స్టాప్ లాస్: రూ.755

కావేరీ సీడ్స్: బై అట్ రూ.565, టార్గెట్: రూ.587, స్టాప్ లాస్: రూ.556

బర్జర్ పెయింట్స్: బై అట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ (సీఎంపీ), టార్గెట్: రూ.605 నుంచి రూ.610, స్టాప్ లాస్: రూ.575

టీవీఎస్ మోటార్: బై అట్ రూ.1,087, టార్గెట్: రూ.1,135, స్టాప్ లాస్: రూ.1,065

హెచ్‍డీఎఫ్‍సీ బ్యాంక్: బై అట్ రూ.1,630, టార్గెట్: రూ.1,675, స్టాప్ లాస్: రూ.1,600

టాటా స్టీల్: బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.114, స్టాప్ లాస్: రూ.104

యాక్సిస్ బ్యాంక్: బై అట్ సీఎంపీ, టార్గెట్: రూ.895, స్టాప్ లాస్: రూ.845

(గమనిక:- ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)