తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Stock Market Special Session : నేడు స్టాక్​ మార్కెట్​ స్పెషల్​ లైవ్​ ట్రేడింగ్​ సెషన్​..

Stock market special session : నేడు స్టాక్​ మార్కెట్​ స్పెషల్​ లైవ్​ ట్రేడింగ్​ సెషన్​..

Sharath Chitturi HT Telugu

02 March 2024, 7:22 IST

google News
    • Stock market news today : శనివారం స్టాక్​ మార్కెట్​లు పనిచేస్తాయి! ఇందుకు ఓ కారణం ఉంది. డిజాస్టర్​ రికవరీ సిస్టెమ్​ని టెస్ట్​ చేసేందుకు ఈ స్పెషల్​ లైవ్​ సెషన్​ని నిర్వహిస్తున్నారు.
నేడు స్టాక్​ మార్కెట్​ స్పెషల్​ లైవ్​ ట్రేడింగ్​ సెషన్​..
నేడు స్టాక్​ మార్కెట్​ స్పెషల్​ లైవ్​ ట్రేడింగ్​ సెషన్​..

నేడు స్టాక్​ మార్కెట్​ స్పెషల్​ లైవ్​ ట్రేడింగ్​ సెషన్​..

Stock market special live trading session today : సాధారణంగా.. స్టాక్​ మార్కెట్​లకు శనివారం సెలవు ఉంటుంది. కానీ.. మార్చ్​ 2న దేశీయ సూచీలు పనిచేస్తాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​, ఎన్​ఎస్​ఈ నిఫ్టీలో స్పెషల్​ లైవ్​ ట్రేడింగ్​ సెషన్​ జరుగుతుంది. తమ డిజాస్టర్​ రికవరీ సిస్టెమ్​ని పరీక్షించేందుకు బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలు ఈ లైవ్​ సెషన్​ని ఏర్పాటు చేశాయి.

ఈ రోజు ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్​లో ప్రైమరీ సైట్ (పీఆర్) డిజాస్టర్ రికవరీ (డిఆర్) సైట్ కు మార్చడం జరుగుతుంది.

"ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్ విభాగాల్లో 2024 మార్చ్​ 02 శనివారం ప్రైమరీ సైట్ నుంచి డిజాస్టర్ రికవరీ సైట్​కు ఇంట్రాడే స్విచ్ ఓవర్​తో ఎక్స్ఛేంజ్ ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్​ని నిర్వహిస్తుందని సభ్యులు గమనించాలి" అని ఎన్ఎస్ఈ సర్క్యులర్​లో పేర్కొంది.

డిజాస్టర్​ రికవరీ సెషన్​ ఎందుకు?

Stock market Disaster Recovery system : మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రీసెర్చ్ అనలిస్ట్ ప్రశాంత్ తాప్సే మాట్లాడుతూ.. “కార్యకలాపాలను ప్రభావితం చేసే ఏదైనా ఊహించని సంఘటనను మేనేజ్​ చేయడానికి, తక్కువ సమయంలో డీఆర్ సైట్ నుంచి కార్యకలాపాలను పునరుద్ధరించడానికి మా మౌలిక సదుపాయాల సంసిద్ధతను పరీక్షించడం కోసం ఇలాంటి సెషన్లు నిర్వహిస్తున్నాము,” అని అన్నారు.

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకునేలా, మౌలిక సదుపాయాలు బలంగా ఉండేలా చూసుకోవాలి తాప్సే అభిప్రాయపడ్డారు. జీరో డౌన్​టైమ్​తో వ్యాపారాన్ని నడపడానికి ఎక్స్ఛేంజ్ సిద్ధంగా ఉండటానికి ఇటువంటి సెషన్లు సహాయపడతాయని చెప్పారు.

టెక్నికల్​ కారణాలతో బ్రోకరేజ్​ యాప్స్​, స్టాక్​ మార్కెట్​ అధికారిక వెబ్​సైట్స్​ నిలిచిపోయిన ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. వాటితో ట్రేడర్లకు, మదుపర్లకు భారీ నష్టాలు కలుగుతున్నాయి. వాటిని కంట్రోల్​ చేసేందుకే ఈ డిజాస్టర్​ రికవరీ సిస్టెమ్​ని తీసుకొస్తున్నారు.

స్పెషల్ ట్రేడింగ్ సెషన్ టైమింగ్..

Disaster Recovery session stock market : ఎన్ఎస్ఈ సర్క్యులర్ ప్రకారం.. స్పెషల్ ట్రేడింగ్ సెషన్​ని రెండు విభాగాలుగా విభజిస్తారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 9.15 గంటల నుంచి 10 గంటల వరకు.. 45 నిమిషాల పాటు మొదటి సెషన్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం 11.30 నుంచి 12.30 గంటల వరకు మరో లైవ్ ట్రేడింగ్ సెషన్ ఉంటుంది.

Capital market segment
Capital market segment
F&O Segment

ప్రైస్ బ్యాండ్ డెరివేటివ్..

నేటి స్టాక్​ మార్కెట్​ లైవ్​ ట్రేడింగ్​ సెషన్​లో.. డెరివేటివ్​ ప్రాడక్ట్స్​తో సహా అన్ని సెక్యూరిటీలకు గరిష్ట ధర బ్యాండ్ 5%. ప్రస్తుతం 2% లేదా అంతకంటే తక్కువ ప్రైజ్​ బ్యాండ్​లో ఉన్న సెక్యూరిటీలు ఆ బ్యాండ్లలోనే అందుబాటులో ఉంటాయని ఎన్ఎస్ఈ తెలిపింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో..

Stock market news today : ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో దేశీయ సూచీలు భారీగా లాభపడ్డాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1245 పాయింట్లు పెరిగి 73745 వద్ద ముగిసింది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 356 పాయింట్ల లాభంతో 22339 వద్ద ముగిసింది. 1166 పాయింట్లు పెరిగిన బ్యాంక్​ నిఫ్టీ 47287 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 128.94 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3814.53 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

తదుపరి వ్యాసం