తెలుగు న్యూస్  /  Business  /  Sensex Creates History Know Why It Soared 900 Points Today

Sensex hit a new high: సరికొత్త శిఖరాలకు సెన్సెక్స్

HT Telugu Desk HT Telugu

24 November 2022, 15:48 IST

    • సెన్సెక్స్ జీవితకాలపు గరిష్టానికి చేరుకుంది. గురువారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 62,272 పాయింట్లకు చేరుకుంది.
సరికొత్త జీవితకాలపు గరిష్టానికి చేరిన సెన్సెక్స్
సరికొత్త జీవితకాలపు గరిష్టానికి చేరిన సెన్సెక్స్

సరికొత్త జీవితకాలపు గరిష్టానికి చేరిన సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ సూచీ సెన్సెక్స్ జీవితకాలపు గరిష్టానికి చేరింది. గురువారం స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 62,272 పాయింట్లకు చేరుకుంది. ఇంట్రా డేలో 62,412.33 పాయింట్లను తాకింది. కాగా 52 వారాల కనిష్ట స్థాయి 50,921 పాయింట్లు ఉంది.

గురువారం నెలవారీ డెరివేటివ్ (ఎఫ్ అండ్ ఓ) కాంట్రాక్ట్స్ ఎక్స్‌పైరీ డేట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ జీవితకాలపు గరిష్టానికి చేరుకుంది. ముఖ్యంగా ఐటీ కంపెనీల్లో భారీ కొనుగోళ్ల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ భారీగా పుంజుకుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని తగ్గిస్తున్నట్టు సంకేతాలు ఇవ్వడంతో అంతర్జాతీయ మార్కెట్లు కూడా దూకుడుగా సాగాయి. సెన్సెక్స్ 762 పాయింట్లు పెరిగింది. ఇంతకుముందు జీవితకాలపు గరిష్టం అక్టోబరు 19, 2021న 62,245గా నమోదైంది. ఇక నిఫ్టీ కూడా 18,484.10 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రా డేలో 18,529.70 పాయింట్లను తాకింది.

డాలర్ బలహీనంగా ఉండడంతో రూపాయి పుంజుకుంది. ‘వడ్డీ రేట్ల పెంపు వేగం తగ్గుతుందన్న సంకేతాలు వెలువడడంతో యూఎస్ డాలర్ బలహీనపడింది. ఆర్థిక వృద్ధి మందగిస్తున్న నేపథ్యంలో వడ్డీ రేట్ల పెంపు వేగం తగ్గుతుందని ఆర్థిక వేత్తల అంచనాలకు తగినట్టుగానే తాజా సంకేతాలు వెలువడ్డాయి..’ అని కోటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ప్రతినిధి రవీంద్ర రావు విశ్లేషించారు.

టాపిక్