తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ravindra Bharti : '1000శాతం రిటర్నులు పక్కా' అన్న ఫిన్​ఫ్లుయెన్సర్​కి సెబీ షాక్​! రూ. 12 కోట్లు కట్టాలని..

Ravindra Bharti : '1000శాతం రిటర్నులు పక్కా' అన్న ఫిన్​ఫ్లుయెన్సర్​కి సెబీ షాక్​! రూ. 12 కోట్లు కట్టాలని..

Sharath Chitturi HT Telugu

07 April 2024, 16:30 IST

  • Ravindra Bharti : ప్రముఖ ఫిన్​ఫ్లుయెన్సర్​ రవీంద్ర భారతీకి షాక్​ ఇచ్చింది సెబీ. అక్రమంగా సంపదించారంటూ.. రూ. 12 కోట్లు వెనక్కి ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రముఖ ఫిన్​ఫ్లుయెన్సర్​ రవీంద్ర భారతికి సెబీ షాక్​..!
ప్రముఖ ఫిన్​ఫ్లుయెన్సర్​ రవీంద్ర భారతికి సెబీ షాక్​..!

ప్రముఖ ఫిన్​ఫ్లుయెన్సర్​ రవీంద్ర భారతికి సెబీ షాక్​..!

Ravindra Bharti finfluencer : కోట్లు కోట్లు సంపాదించండి అని ఆశ పెట్టి.. ప్రజలకు కోర్సులు అమ్మి, వారి నుంచి కొందరు ఫిన్​ఫ్లుయెన్సర్లు డబ్బులు తీసుకుంటుండటం.. అలాంటి వారిపై సెబీ (సెక్యూరిటీస్​ అండ్​ ఎక్స్​ఛేంజ్​ బోర్డ్ ఆఫ్​ ఇండియా​) కఠిన చర్యలు తీసుకుంటుండటం.. ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాము. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి రిపీట్​ అయ్యింది. ప్రముఖ ఫిన్​ఫ్లుయెన్సర్​ రవీంద్ర బాలు భారతిపై కఠిన చర్యలు తీసుకుంది సెబీ. స్టాక్​ మార్కెట్​ ట్రైనింగ్​ అంటూ ప్రజల నుంచి అక్రమంగా తీసుకున్న రూ. 12కోట్లను తిరిగి వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. 25శాతం నుంచి 1000శాతం వరకు రిటర్నులు సంపాదించవచ్చని రవీంద్ర భారతి తన ఫాలోవర్లకు చెప్పినట్టు తెలుస్తోంది!

ట్రెండింగ్ వార్తలు

Renault summer service camp 2024: రెనో కార్లకు సమ్మర్ సర్వీస్ క్యాంప్; కస్టమర్లకు ఆఫర్స్, గిఫ్ట్స్ కూడా..

Tata Motors Q4 Results: క్యూ 4 లో దూసుకుపోయిన టాటా మోటార్స్; నికరలాభంలో 222% వృద్ధి

Phone hack: మీ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయిందో లేదో.. ఇలా తెలుసుకోండి..

OnePlus: ఇకపై అన్ని జియోమార్ట్ స్టోర్ట్స్ లో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ల సేల్; చిన్న పట్టణాల్లోనూ లభ్యం

ఫిన్​ఫ్లుయెన్సర్​ రవీంద్ర భారతిపై కఠిన చర్యలు..

రవీంద్ర భారతీ, ఆయన భార్య శుభంగి భారతీలు.. 2016లో రవీంద్ర భారతి ఎడ్జ్యుకేషన్​ ఇన్​స్టిట్యూట్​ని ప్రారంభించారు. ఇది ఒక అన్​-రిజిస్టర్డ్​ ఇన్​వెస్ట్​మెంట్​ అడ్వైజరీ. స్టాక్​ మార్కెట్​ ట్రేడింగ్​, ఇన్​వెస్ట్​మెంట్స్​లో ఎడ్జ్యుకేషన్​, ట్రైనింగ్​ ఇవ్వడం ఈ సంస్థ పని.

Finfluencer Ravindra Bharti : భారతికి రెండు యూట్యూబ్​ ఛానెల్స్​ ఉన్నాయి. భారతి షేర్​ మర్కెట్​ మరాఠి అనే ఛానెల్​లో 10.8 లక్షల మంది సబ్​స్క్రైబర్స్​ ఉన్నారు. ఇక భారతి షేర్​ మార్కెట్​- హిందీ అనే యూట్యూబ్​ ఛానెల్​లో 8.22 లక్షల మంది సబ్​స్క్రైబర్స్​ ఉన్నారు. అడ్వైజరీ సర్వీసులు కూడా భారతీ ఇస్తుంటారని సమాచారం. అయితే.. సెబీ అనుమతి ఉంటేనే ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. సెబీ దగ్గర రిజిస్టర్​ కాని వాళ్లు.. ఇలాంటి సలహాలు, సూచనలు ఇవ్వడం నేరం.

"25శాతం నుంచి 1000శాతం వరకు రిటర్నులు పొందండి" అని భారతి తన సబ్​స్క్రైబర్స్​కి చెప్పేవారని తెలుస్తోంది.

వాస్తవానికి రిటర్నులపై ఇలా కచ్చితంగా ఎవరూ చెప్పలేరు. కానీ చాలా మంది ప్రజలు వీటిని నమ్మి, డబ్బులు పెట్టి మోసపోతూ ఉంటారు. తమ కష్టార్జితాన్ని కొందరు చేతుల్లో పెడుతుంటారు.

Ravindra Bharti stock market : రవీంద్ర భారతి వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన సెబీ.. టిప్స్​, సలహాల పేరుతో ఇప్పటివరకు పోగు చేసిన రూ. 12,03,82,130.91 ని ఇవ్వాలని తేల్చిచెప్పింది. ఈ డబ్బులను ఎస్క్రో అకౌంట్​కి ట్రాన్స్​ఫర్​ చేయాలని ఆదేశించింది. ఇలా.. ప్రజల నుంచి డబ్బులు తీసుకున్న వారు తప్పు చేశారని తెలిస్తే.. వారి నుంచి ఆ డబ్బులను తీసుకునేందుకు ఈ ఎస్క్రో అకౌంట్​ని మొదలుపెట్టింది సెబీ.

అంతేకాకుండా.. ఇకపై టిప్స్​, అడ్వైజ్​లు ఇవ్వకూడదని రవీంద్ర భారతీ ఎడ్జ్యుకేషన్​ ఇన్​స్టిట్యూషన్​కి తేల్చిచెప్పింది సెబీ.

Stock market news today : స్టాక్​ మార్కెట్​ విషయంలో సాధారణ ప్రజలు మోసపోకుండా.. ఇటీవలి కాలంలో సెబీ చాలా చర్యలు చేపడుతోంది. మరీ ముఖ్యంగా.. ఫిన్​ఫ్లుయెన్సర్స్​పై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతోంది. వారు తప్పు చేశారని తేలితే.. అస్సలు విడిచిపెట్టడం లేదు. మదుపర్ల ప్రయోజనాలు తమకు చాలా ముఖ్యమని చెబుతోంది సెబీ.

"భారత క్యాపిటల్​ మార్కెట్​లు.. గత కొంత కాలంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. మదుపర్ల నమ్మకం చూసి ప్రజలు కూడా ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. ఇది కొనసాగాలంటే.. ఇన్​వెస్టర్స్​కి ప్రొటెక్షన్​ ఇవ్వాలి. ట్రాన్స్​పరెన్సీ ఉంటేనే ఈ అభివృద్ధి కొనసాగుతుంది," అని సెబీ చెప్పింది.

తదుపరి వ్యాసం