PM Modi YouTube subscribers: ప్రధాని మోదీ యూట్యూబ్ సబ్ స్క్రైబర్స్ ఎంత మందో తెలుసా?.. ఇక్కడ కూడా రికార్డే..
PM Modi YouTube subscribers: ప్రధాని నరేంద్ర మోదీ మరో రికార్డు సృష్టించారు. సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా ఉండే ప్రధాని మోదీ.. అత్యధిక యూ ట్యూబ్ ఫాలోవర్లు ఉన్న ప్రపంచ నాయకుడిగా నిలిచారు.
PM Modi YouTube subscribers: సోషల్ మీడియాలోని పలు ప్లాట్ ఫామ్స్ పై ప్రధాని నరేంద్ర మోదీ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన ఆలోచనలను పంచుకుంటూ ఉంటారు.వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ప్రధాని మోదీకి కోట్ల సంఖ్యలో ఫాలోవర్లు కూడా ఉన్నారు.
2 కోట్లు..
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) యూట్యూబ్ ఛానల్ మంగళవారం 2 కోట్ల సబ్ స్క్రిప్షన్లను అధిగమించి రికార్డు సృష్టించింది. ప్రపంచ రాజకీయ అధినేతలెవరూ కూడా ఈ విషయంలో మోదీ దరిదాపులకు రాలేని పరిస్థితి ఉంది. ప్రపంచ రాజకీయ నాయకులకు సంబంధించి యూట్యూబ్ చానెళ్లలో అత్యధిక సంఖ్యలో, అంటే, 2 కోట్లకు మించి ఫాలోవర్లు ఉన్న నాయకుడు మోదీ మాత్రమే. రెండో స్థానంలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సనోరా ఉన్నారు. ఆయన సబ్ స్క్రైబర్ల సంఖ్య 64 లక్షలు మాత్రమే. అంటే, రెండో స్థానంలో ఉన్న జైర్ బోల్సనోరా ప్రధాని మోదీ కన్నా చాలా దూరంలో ఉన్న విషయం అర్థమవుతుంది.
మూడో ప్లేస్ లో..
ప్రపంచ నాయకులలో అత్యధిక యూట్యూబ్ సబ్ స్క్రైబర్లు (YouTube subscribers) పొందిన మూడవ యూట్యూబ్ ఛానెల్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ది. ఆయన చానల్ కు 11 లక్షల మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. ఈ జాబితాలో నాలుగో స్థానంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉన్నారు. ఆయన యూట్యూబ్ ఛానెల్ కు 7,94,000 మంది సబ్స్క్రైబర్లు మాత్రమే ఉన్నారు.
వ్యూస్ లోనూ రికార్డే..
అంతేకాకుండా, వ్యూస్ విషయానికి వస్తే, 2023 డిసెంబర్లో 2.24 బిలియన్ వ్యూస్ ను నమోదు చేస్తూ మోదీ ఛానల్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సాధించిన రెండో స్థానంలో ఉన్న జెలెన్స్కీ కంటే ఇది 43 రెట్లు అధికం. డిజిటల్ ల్యాండ్ స్కేప్ లో ప్రధాని మోదీ ఉన్న అసమాన ఫాలోయింగ కు ఈ గణాంకాలు రుజువులుగా నిలుస్తాయి.