తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Renault Nissan Ev : ఇండియాలో లాంచ్​కు సిద్ధం అవుతున్న రెండు కొత్త ఈవీలు..!

Renault Nissan EV : ఇండియాలో లాంచ్​కు సిద్ధం అవుతున్న రెండు కొత్త ఈవీలు..!

Sharath Chitturi HT Telugu

29 July 2023, 7:09 IST

    • Renault Nissan EV : ఇండియాలోకి రెండు కొత్త ఈవీలను తీసుకొచ్చేందుకు ప్లాన్​ చేస్తోంది రెనాల్ట్​ నిస్సాన్​ సంస్థ. ఆ వివరాలు..
ఇండియాలో లాంచ్​కు సిద్ధం అవుతున్న రెండు కొత్త ఈవీలు..!
ఇండియాలో లాంచ్​కు సిద్ధం అవుతున్న రెండు కొత్త ఈవీలు..!

ఇండియాలో లాంచ్​కు సిద్ధం అవుతున్న రెండు కొత్త ఈవీలు..!

Renault Nissan EV : ఎలక్ట్రిక్​ వాహనాలకు హాట్​స్పాట్​గా మారింది ఇండియా. ఇక్కడ ఉన్న డిమాండ్​ చూసి దేశీయ, విదేశీ సంస్థలు.. ఈవీలను లాంచ్​ చేసేందుకు పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే రెనాల్ట్​- నిస్సాన్​ ఇండియా సైతం రెండు కొత్త ఎలక్ట్రిక్​ వాహనాలను తయారు చేయనున్నట్టు వెల్లడించింది. చెన్నైలోని తమ ఫ్యాక్టరీలో వీటిని రూపొందించనున్నట్టు స్పష్టం చేసింది. రెండు ఈవీలతో పాటు మొత్తం మీద 6 కొత్త వాహనాలను ఇక్కడ సిద్ధం చేస్తున్నట్టు వివరించింది. ఈ ప్లాంట్​లో ఇప్పటివరకు 25లక్షల కార్లను తయారీ చేసినట్టు తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

Gautam Adani : రిచ్చెస్ట్​ ఏషియన్​గా గౌతమ్​ అదానీ- ముకేశ్​ అంబానీని మళ్లీ వెనక్కి నెట్టి..

Tata Altroz Racer : టాటా ఆల్ట్రోజ్​ రేసర్​ బుకింగ్స్​ షురూ.. ఇంకొన్ని రోజుల్లో లాంచ్​!

Gold and silver prices today : జూన్​ 2 : మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

BYD Hybrid: ‘‘సింగిల్ చార్జింగ్ తో 2 వేల కిలోమీటర్ల నాన్ స్టాప్ డ్రైవ్’’.. హైబ్రిడ్ మోడల్ సెడాన్ ను లాంచ్ చేసిన బీవైడీ

రెండు కొత్త ఈవీలు..

రెనాల్ట్​- నిస్సాన్​ చెప్పిన ఈవీలపై ప్రస్తుతం ఎలాంటి సంబంధం లేదు. కాగా.. క్విడ్​ ఎలక్ట్రిక్​ వర్షెన్​ను ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్​లో సేల్​ చేస్తోంది ఈ సంస్థ. దీనికి డాసియా స్ప్రింగ్​ అని పేరు. ఇందులో 44 హెచ్​పీ పవర్​ను జనరేట్​ చేసే సింగిల్​ ఎలక్ట్రిక్​ మోటార్​ ఉంటుంది. వాహనాన్ని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 230కి.మీల వరకు ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది. మరి ఇండియాలో ఇదే మోడల్​ లాంచ్​ అవుతుందా? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ లాంచ్​ అయితే.. ఈ డాసియా స్ప్రింగ్​.. టియాగో ఈవీ, ఎంజీ కామెట్​, సిట్రోయెన్​ సీ3లకు గట్టిపోటీనిస్తుంది. ఇక రెండో ఈవీ ఏంటి? అన్నది తెలియదు.

ఇండియాలో మూడు కొత్త ఎస్​యూవీలను లాంచ్​ చేయనున్నట్టు గతేడాది ప్రకటించింది నిస్సాన్. వి ఎక్స్​- ట్రైల్​, కష్కాయ్​, జూక్​. వీటిల్లో.. ఎక్స్​- ట్రైల్​ త్వరలోనే ఇండియాలో లాంచ్​ కానుంది. ఇది ఒక ఫుల్​ సైజ్​ ఎస్​యూవీ. ఎంజీ గ్లాస్టర్​, టయోటా ఫార్చ్యునర్​కు పోటీనిస్తుంది. అయితే దీనిని ఇండియాలో తయారు చేయకపోవచ్చు. కంప్లీట్లీ బిల్ట్​ యూనిట్​(సీబీయూ)గా ఇది దేశంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.

కష్కాయ్​​ లాంచ్​ అయితే.. హ్యుందాయ్​ క్రేటా, కియా సెల్టోస్​, ఎంజీ ఆస్టర్​, మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా, స్కోడా కుషాక్​, వోక్స్​వ్యాగన్​ టైగున్​, టయోటా అర్బన్​ క్రూజ్​ హైరైడర్​లకు పోటీగా నిలుస్తుంది. వీటి లాంచ్​లపై ప్రస్తుతం క్లారిటీ లేదు.

అదిగో టెస్లా..!

Tesla in India : ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లోని ఈవీ సెగ్మెంట్​పై విదేశీ సంస్థలు ఫోకస్​ చేశాయి. ఇక్కడ 1 బిలియన్​ డాలర్ల పెట్టుబడు పెట్టేందుకు చైనాకు చెందిన దిగ్గజ సంస్థ బీవైడీ ప్రయత్నించింది. కానీ పలు కారణాలతో కేంద్రం అనుమతించలేదు. కాగా.. ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో అడుగు దూరంలో టెస్లా ఉంది! సంస్థ నుంచి అతి చౌకైన ఎలక్ట్రిక్​ వాహనాన్ని.. ఇండియా కోసం టెస్లా తయారు చేస్తున్నట్టు సమాచారం. దీనిపై త్వరలోనే ఓ అప్డేట్​ రానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం