Tesla in India : ఇండియా కోసం అతి చౌకైన ఈవీని రూపొందిస్తున్న టెస్లా..!
Tesla cars in India : సంస్థ చరిత్రలోనే అతి చౌకైన ఎలక్ట్రిక్ కారును.. ఇండియా కోసం టెస్లా రూపొందిస్తోందని సమాచారం. ఫలితంగా.. ఇండియాలో టెస్లా ఎంట్రీపై అంచనాలు మరింత పెరిగాయి
Tesla cars in India : ఇండియాలో టెస్లా ఎంట్రీపై రోజుకో వార్త బయటకొస్తోంది. తాజాగా.. మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఇండియా కోసం, ప్రత్యేకంగా ఓ ఎలక్ట్రిక్ కారును ఆటోమొబైల్ సంస్థ రూపొందిస్తోందని తెలుస్తోంది. ఇది.. సంస్థ చరిత్రలోనే అతి చౌకైన కారుగా నిలుస్తుందని సమచారం.
ఇండియా కోసం- ఆల్ న్యూ టెస్లా కారు..!
ఇండియాలో పెద్ద ఈవీ మేన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా గత కొన్ని నెలలుగా ప్లాన్ చేస్తోంది. ఈ విషయంపై.. ఈ నెలలో టెస్లా బృందం, భారత కేంద్రమంత్రి పీయుష్ గోయల్‌తో భేటీ అవుతుందని సమాచారం. అన్ని అనుకున్నట్టు జరిగితే.. భేటీ తర్వాత ఓ కీలక అప్డేట్ వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి.
Tesla cars price India : ఇండియాలో ఆల్ న్యూ టెస్లా కారు రాబోతోందని వార్తలు వస్తున్నాయి. దీని ధర 24వేల డాలర్లుగా ఉండొచ్చు. అంటే ఇండియన్ కరెన్సీలో దీని విలువ రూ. 20లక్షలు. మోడల్ 3 సెడాన్.. టెస్లాకు చౌకైన వాహనంగా కొనసాగుతోంది. చైనాలో దీని ధర సుమారు రూ. 26లక్షలు. అంటే.. ఇండియాలో 25శాతం తక్కువ ధరకు కొత్త వెహికిల్‌ను రూపొందించాలని సంస్థ ప్లాన్ చేస్తోంది.
ఇక్కడ ఎలాన్ మస్క పెద్ద ప్లానే వేసినట్టు తెలుస్తోంది. ఇండియాలో ఈవీలకు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోంది. మొత్తం సేల్స్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 2శాతం కన్నా తక్కువగా ఉంది. కానీ సేల్స్.. అత్యంత వేగంగా పుంజుకుంటున్నాయి. ఈ మార్కెట్‌కు మంచి డిమాండ్ ఉంది. అందుకే.. సంస్థ చరిత్రలోనే చౌకైన ఈవీతో ఎంట్రీ ఇచ్చి, మార్కెట్ షేరును క్యాప్చర్ చేయాలని మస్క్ చూస్తున్నట్టు తెలుస్తోంది.
Most affordable Tesla car in India : ఇండియా మార్కెట్లో ఎంట్రీ ఇవ్వాలని చాలా కాలంగా చూస్తోంది టెస్లా. ట్యాక్స్‌లు తగ్గిస్తే వస్తామని సంస్థ చెబుతుంటే.. ఇండియాలో మేన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ పెట్టాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఇంతకాలం నో.. నో అంటూ వచ్చిన ఆటోమొబైల్ సంస్థ.. ఇప్పుడు మేన్యుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సిద్ధమవుతోంది.
కొత్త విధానాలేవీ ఉండవు..
అయితే.. ఇండియాలోకి వస్తే టెస్లాకు కొన్ని మినహాయింపులు ఉండొచ్చని ఊహాగానాలు సాగాయి. వీటిపై ప్రభుత్వ అధికారి స్పందిస్తూ.. అలాంటివేవీ ఉండవని స్పష్టం చేశారు. కేంద్రం అన్ని కంపెనీలను ఒకే విధంగా పరిగణిస్తుందని, టెస్లా కోసం కొత్తగా ఎలాంటి విధానాలు రూపొందించడం లేదని పీటీఐకు చెప్పారు.
Tesla in India : "ఇప్పుడున్న పాలసీలను మార్చమని టెస్లాకు చెప్పాము. అవసరమైతే వారు పీఎల్ఐ స్కీమ్‌కు అప్లై చేసుకోవచ్చు. ఒక్క సంస్థ కోసం ప్రత్యేక పాలసీలను కేంద్రం రూపొందించదు. టెస్లాకు బ్యాటరీలు సప్లై చేసే పానాసోనిక్ సంస్థ కూడా మమ్మల్ని సంప్రదించింది. ఇండియాలో బ్యాటరీలను తయారీని ప్రతిపాదించింది. పీఎల్ఐ స్కీమ్‌కు అప్లై చేసుకోవాలని చెప్పాము," అని సంబంధిత ప్రభుత్వ అధికారి తెలిపారు.
సంబంధిత కథనం