Twitter news Logo : ట్విట్టర్​ కొత్త లోగో ‘ఎక్స్​’.. ఐకానిక్​ బ్లూ బర్డ్​కు గుడ్​ బై!-musk makes fan created x twitters new logo in abrupt change ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Twitter News Logo : ట్విట్టర్​ కొత్త లోగో ‘ఎక్స్​’.. ఐకానిక్​ బ్లూ బర్డ్​కు గుడ్​ బై!

Twitter news Logo : ట్విట్టర్​ కొత్త లోగో ‘ఎక్స్​’.. ఐకానిక్​ బ్లూ బర్డ్​కు గుడ్​ బై!

Sharath Chitturi HT Telugu
Updated Jul 24, 2023 04:01 PM IST

Twitter news Logo : ట్విట్టర్​ బ్లూ బర్డ్​ ఇక కనిపించదు! ఈ మేరకు కొత్త లోగోను ఆవిష్కరించారు ఎలాన్​ మస్క్​.

ట్విట్టర్​ లోగో మార్చేసిన ఎలాన్​ మస్క్​..
ట్విట్టర్​ లోగో మార్చేసిన ఎలాన్​ మస్క్​..

Twitter new logo : ప్రముఖ సామాజిక మాధ్యమ దిగ్గజ ట్విట్టర్​లో మరో భారీ మార్పును తీసుకొచ్చారు ఎలాన్​ మస్క్​. 'ఎక్స్​' సింబల్​ను ట్విట్టర్​ కొత్త లోగోగా ప్రకటించారు. ఫలితంగా.. 17ఏళ్ల చరిత్ర కలిగిన ఐకానిక్​ బ్లూ బర్డ్​ లోగోకు ముగింపు పడింది.

24 గంటల్లో మాయం..

ట్విట్టర్​ లోగో మార్చాలన్న ఉద్దేశాన్ని 24 గంటల ముందే వెల్లడించారు మస్క్​. 'ఎక్స్​' అక్షరంతో కూడిన లోగోను డిజైన్​ చేసి చూపించాలని తన 149 మిలియన్​ మంది ఫాలోవర్స్​ను కోరారు. వారు డిజైన్​ చేసి పోస్టు చేయడం, వాటిల్లో నుంచి మస్క్​ ఒకటి ఎంపిక చేయడం వంటి పనులు చెకచెకా జరిగిపోయాయి. ఇక ఇప్పుడు ఈ ఎక్స్​ లోగో.. సోషల్​ మీడియా హోం పేజ్​తో పాటు మస్క్​ ప్రొఫైల్​ ఫొటో, లోడింగ్​ యానిమేషన్స్​లో కూడా కనిపిస్తోంది. అయితే ఈ డిజైన్​ తాత్కాలికమేనని, త్వరలో తుది మెరుగుదిద్దే అవకాశం ఉందని మస్క్​ తన ఫాలోవర్స్​కు చెప్పారు.

Twitter new logo X : సాన్​ఫ్రాన్సిస్క్​లోని ట్విట్టర్​ కార్యాలయంపై లోగోను ప్రొజెక్ట్​ చేశారు. సంస్థ కొత్త సీఈఓ లిండా సాసరినో సైతం 'ఎక్స్'​కు తన మద్దతు ప్రకటించారు.

'ఎక్స్​' అంటే మస్క్​కు ఇష్టం..!

స్పేస్​ఎక్స్​, టెస్లా సీఈఓ, ట్విట్టర్​ ఓనర్​కు 'ఎక్స్​' అక్షరం చాలా ఇష్టం! 1990 దశకం నుంచి ఇది బయటపడుతూనే ఉంది. పేపాల్​కి ముందు 'ఎక్స్​.కామ్​' అనే ఆన్​లైన్​ బ్యాంకింగ్​ ప్లాట్​ఫామ్​ను లాంచ్​ చేశారు. 2017లో ఆ డొమైన్​ని మళ్లీ కొనుగోలు చేశారు. 'మనలోని లోపాలే మనల్ని ప్రత్యేకం చేస్తాయి,' అన్న విషయాన్ని తెలిపేందుకే.. ట్విట్టర్​ లోగోను మారుస్తున్నట్టు మస్క్​ వెల్లడించారు.

Whats_app_banner

సంబంధిత కథనం