Tesla self driving cars : ఏడాది చివరి నాటికి- టెస్లా ‘సెల్ఫ్ డ్రైవింగ్’ కార్స్..!
Self driving cars Tesla : టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్‌పై వ్యాఖ్యానించారు ఆ సంస్థ సీఈఓ ఎలాన్ మస్క్. ఈ ఏడాది చివరి నాటికి వాటిని సిద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు.
Self driving cars Tesla : సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్‌పై కీలక అప్డేట్ ఇచ్చారు టెస్లా సీఈఓ, అపర కుబేరుడు ఎలాన్ మస్క్. ఈ ఏడాది చివరి నాటికి.. సెల్ఫ్ డ్రైవింగ్ టెస్లా కార్లను సిద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. అమెరికా, యూరోప్‌లో ఈ టెస్లా కార్ల విస్తృత వినియోగం జరుగుతుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.
నార్వోలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్నారు ఎలాన్ మస్క్. సెల్ఫ్ డ్రైవింగ్ టెస్లా కార్లతో పాటు అనేక అంశాలపై వ్యాఖ్యానించారు. ప్రపంచంలో మునుపెన్నడూ లేనంతగా.. ప్రస్తుతం చమురు, గ్యాస్ అవసరం ఉందని ఆయన అభిప్రాపడ్డారు. శిలాజ ఇంధనాలకు తాను వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అదే సమయంలో రినివెబుల్ ఎనర్జీ సప్లైపై అందరు దృష్టిసారించాలని పేర్కొన్నారు.
ఇంధన సంక్షోభంతో యూరోప్ కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో ఎలాన్ మస్క్ ఈ వ్యాఖ్యాలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ట్విట్టర్ వ్యవహారం..
Elon Musk twitter deal : ఎలాన్ మస్క్- ట్విట్టర్ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ వ్యవహారంపై ఇటీవలే కోర్టులో విచారణ జరిగింది. ఫేక్ ఖాతాలపై మస్క్‌కు మరింత డేటాను అందించాలని ట్విట్టర్‌ను ఆదేశించింది కోర్టు.
ఈ 'ఫేక్ అకౌంట్' డేటా వల్లే ఎలాన్ మస్క్ ట్విట్టర్ డీల్ నిలిచిపోయింది. ట్విట్టర్ చెప్పిన దాని కన్నా ఎన్నో రెట్ల ఫేక్ అకౌంట్లు ఉన్నట్టు మస్క్ భావిస్తున్నారు. డేటా ఇవ్వడానికి ట్విట్టర్ నిరాకరించింది.
స్టాక్ మార్కెట్‌పై మస్క్ పాఠాలు..
సామాజిక మాధ్యమాల్లో ఎలాన్ మస్క్ చురుకుగా ఉంటారు. ముఖ్యంగా ట్విట్టర్లో తన ఫాలోవర్స్‌తో అనేక విషయాలు పంచుకుంటారు. ఈ క్రమంలోనే.. స్టాక్ మార్కెట్‌పైనా పాఠాలు చెప్పారు ఎలాన్ మస్క్.
స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు సంపాదించాలని చాలా మంది ఆశిస్తూ ఉంటారు. కానీ అనేకమంది స్టాక్ మార్కెట్లో నష్టాలు చూస్తారు. స్టాక్స్ ఎప్పుడు కొనాలి? ఎప్పుడు అమ్మాలి? అన్న విషయంపై సరైన స్పష్టత, అవగాహన లేక తప్పులు చేసి, నష్టపోతూ ఉంటారు. వారి కోసమే.. అపర కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. తన అనుభవం నుంచి కొన్ని టిప్స్ ఇచ్చారు.
Elon Musk news : స్టాక్స్ కొనుగోళ్లు, అమ్మకాలపై తనకు తరచూ ప్రశ్నలు వస్తుంటాయని మస్క్ అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
"మీరు నమ్మే ప్రాడక్టులు, సర్వీసులపైనే దృష్టిపెట్టండి. అలాంటి సంస్థల స్టాక్స్ మాత్రమే బై చేయండి. ఇక ప్రాడక్టులు, సర్వీసులు దారుణంగా ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే వాటిని అమ్మేయండి," అని మస్క్ పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే మరో టిప్ కూడా ఇచ్చారు మస్క్. 'మార్కెట్ తీవ్ర ఒడుదొడుకుల్లో ఉన్నప్పుడు.. మీరు కంగారు పడకండి. దీర్ఘకాలంలో ఇది మీకు ఉపయోగపడుతుంది,' అని వెల్లడించారు.
ఎలాన్ మస్క్‌కు ట్విట్టర్లో 89మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. వారిలో చాలా మంది స్టాక్ మార్కెట్ బిగినర్స్ ఉండే అవకాశం ఉంది. వారికి మస్క్ టిప్స్ చాలా ఉపయోగపడతాయి. పైగా.. తమకు ఇష్టమైన, లేదా సక్సెస్ఫుల్ వ్యాపారవేత్త నుంచి సూచనలను పొందాలని చాలా మంది భావిస్తూ ఉంటారు.
సంబంధిత కథనం