తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Reliance Q2 Results: రిలయన్స్ Q2 రిజల్ట్స్; ఆదాయం పెరిగింది కానీ అంచనాలు తప్పాయి

Reliance Q2 results: రిలయన్స్ Q2 రిజల్ట్స్; ఆదాయం పెరిగింది కానీ అంచనాలు తప్పాయి

HT Telugu Desk HT Telugu

21 October 2022, 20:28 IST

    • Reliance Q2 results: భారతదేశ దిగ్గజ పారిశ్రామిక సంస్థ రిలయన్స్(Reliance) ఈ ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసిక(Q2) ఫలితాలను విడుదల చేసింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ

Reliance Q2 results: ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ కాంప్లెక్స్ ను నిర్వహిస్తున్న, భారత దిగ్గజ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ Q2 లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. సంస్థ కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ రూ. 13,656 కోట్లుగా నమోదైంది. ఇది అంచనాల కన్నా తక్కువే.

ట్రెండింగ్ వార్తలు

Replacing smart phone: మీ స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడు రీప్లేస్ చేయాలంటే?.. మీ ఫోన్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే..

Air India Cabin Baggage: అలర్ట్.. క్యాబిన్ బ్యాగేజ్ పరిమితిని తగ్గించిన ఎయిర్ ఇండియా..

Kotak Bank Q4 results: క్యూ 4 లో కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభాలు రూ. 4,133 కోట్లు; వృద్ధి 18 శాతం..

Mahindra XUV700 Blaze Edition: మహీంద్రా ఎక్స్ యూవీ700 బ్లేజ్ ఎడిషన్ లాంచ్

Reliance Q2 results: ఆదాయంలో 33.7% పెరుగుదల

ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రిలయన్స్ ఆదాయం రూ. 2.32 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరం Q2 తో పోలిస్తే 33.7’% అధికం. గత సంవత్సరం Q2లో సంస్థ ఆదాయం రూ. 1.74 లక్షల కోట్లు. నెట్ ప్రాఫిట్ విషయానికి వస్తే.. ఈ Q2లో రిలయన్స్ రూ. 13,656 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇది గత Q2తో పోలిస్తే 0.18% తక్కువ. గత సంవత్సరం Q2 లో రిలయన్స్ సాధించిన లాభం రూ. 13,680 కోట్లు.

Reliance Q2 results: Q1 తో పోలిస్తే..

పన్ను అనంతర లాభం(profit after tax - PAT) కూడా ఈ ఆర్థిక సంవత్సరం Q1 తో పోలిస్తే.. Q2లో 24% తగ్గింది. జూన్ తో ముగిసే Q1 లో రిలయన్స్ PAT రూ. 17,955 కోట్లుగా ఉంది.

Reliance Q2 results: అంచనాలు తప్పాయి..

గత సంవత్సరం Q2 తో పోలిస్తే.. ఈ సంవత్సరం కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ రెండంకెల వృద్ధిని సాధిస్తుందని నిపుణులు అంచనా వేశారు. ఆయిల్ టు కెమికల్స్ విభాగం 33% వృద్ధిని కనబర్చింది. గత Q2లో ఈ విభాగం ఆదాయం రూ. 1.2 లక్షల కోట్లు కాగా, ఈ Q2 లో అది రూ. 1.41 లక్షల కోట్లుగా ఉంది.