తెలుగు న్యూస్  /  Business  /  Reliance Industries Chairman Mukesh Ambani Says Indian Economy To Grow 40 Trillion Dollar By 2047

Mukesh Ambani on Indian Economy: భారత ఆర్థిక వృద్ధిపై ముకేశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు

23 November 2022, 7:35 IST

    • Mukesh Ambani on Indian Economy: భారత ఆర్థిక వృద్ధిపై ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఊహించని విధంగా 25 ఏళ్లలో 13 రెట్ల అభివృద్ధి ఉంటుందని అన్నారు. ఇందుకు కారణమయ్యే మూడు విప్లవాలు ఏవో కూడా చెప్పారు.
Mukesh Ambani: భారత ఆర్థిక వృద్ధిపై ముకేశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
Mukesh Ambani: భారత ఆర్థిక వృద్ధిపై ముకేశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు (Bloomberg)

Mukesh Ambani: భారత ఆర్థిక వృద్ధిపై ముకేశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు

Mukesh Ambani on Indian Economy: రానున్న సంవత్సరాల్లో భారత ఆర్థిక వృద్ధి అత్యంత వేగవంతంగా ఉంటుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, బిలీనియర్ ముకేశ్ అంబానీ అన్నారు. ఎవరూ ఊహించని స్థాయిలో ఆర్థిక వ్యవస్థ ఎదుగుతుందని అంచనా వేశారు. గుజరాత్‍లోని పండిత్ దీన్‍దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ 10వ స్నాతకోత్సవంలో ముకేశ్ అంబానీ ప్రసంగించారు. 2047 నాటికి 40 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని అన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలుస్తుందని చెప్పారు. మరిన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు.

Mukesh Ambani on Indian Economy: 25 ఏళ్లలో 13 రెట్లు

ప్రస్తుతం భారత్ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో ప్రపంచంలో అయిదో స్థానంలో ఉంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాతి స్థానంలో మన దేశం ఉంది. ఇటీవలే బ్రిటన్‍ను వెనక్కి నెట్టింది. అయితే 2047 నాటికి 40 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంటుందని ముకేశ్ అంబానీ అన్నారు. అంటే 25 సంవత్సరాల్లో 13 రెట్ల వృద్ధి ఉంటుందని అంచనా వేశారు. క్లీన్ ఎనర్జీ విప్లవం, డిజిటలైజేషన్ ఇందుకు ప్రధాన కారణాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. నానాటికీ అధికమవుతున్న వినియోగం, ఆర్థిక సంస్కరణలు వృద్ధి ఎంతో ఊతమిస్తాయని అంబానీ చెప్పారు. “3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ నుంచి, 2047 నాటికి ఇండియా 40 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదుగుతుంది. ప్రపంచంలోని టాప్-3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంటుంది” అని అంబానీ అన్నారు.

Mukesh Ambani on Indian Economy: మూడు విప్లవాలు

రానున్న మూడు దశాబ్దాలు భారత్‍కు అమృత కాలమని రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్ ముకేశ్ అంబానీ చెప్పారు. ఎవరూ ఊహించని స్థాయిలో భారీ ఆర్థిక వృద్ధి, అవకాశాలు ఉన్నాయని అన్నారు. రానున్న దశాబ్దాల్లో మూడు గేమ్ చేంజింగ్ రెవల్యూషన్స్ భారత వృద్ధిని గణనీయంగా పెంచుతాయన్నారు. క్లీన్ ఎనర్జీ విప్లవం, బయో ఎనర్జీ విప్లవం, డిజిటల్ విప్లవం.. భారత వృద్ధిని వేగంగా నడిస్తాయని అభిప్రాయపడ్డారు. “క్లీన్ ఎనర్జీ రెవల్యూషన్, బయో ఎనర్జీ రెవల్యూషన్.. ఎనర్జీ సస్టైనబులిటీ (శక్తి ఉత్పాదక సుస్థిరత్వం)ని ప్రొడ్యూజ్ చేస్తే.. వినియోగ శక్తి సమర్థంగా ఉండేలా డిజిటల్ రెవల్యూషన్ సాయపడుతుంది. ఈ మూడు విప్లవాలు.. భారత వృద్ధి ప్రధాన కారణాలుగా ఉంటాయి. వాతావరణ మార్పుల నుంచి మన అందమైన గ్రహాన్ని ఈ విప్లవాలు రక్షిస్తాయి” అని ముకేశ్ అంబానీ చెప్పారు.

అంబానీ ‘40’, అదానీ ‘30’

2050 కల్లా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీ (Gautam Adani) గత వారం చెప్పారు. సామాజిక ఆర్థిక సంస్కరణతో ఇండియా దూసుకెళుతుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పుడు అంబానీ ఏకంగా 25 సంవత్సరాల్లో 40 ట్రిలియన్ డాలర్లుగా ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని చెప్పారు. మొత్తంగా ఈ ఇద్దరు టాప్ వ్యాపారవేత్తలు భారత ఆర్థిక వ్యవస్థపై భారీ అంచనాలను వెల్లడించారు.