తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ppf Crorepati: పీపీఎఫ్ లో పెట్టుబడులతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే..

PPF crorepati: పీపీఎఫ్ లో పెట్టుబడులతో కోటీశ్వరులు కావచ్చు.. ఎలాగంటే..

HT Telugu Desk HT Telugu

18 March 2023, 12:06 IST

  • PPF crorepati: పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (Public Provident Fund PPF).. ఒక విశ్వసనీయ పెట్టుబడుల సాధనం. ఆకర్షణీయమైన వడ్డీ రేటు అదనపు లాభం.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

PPF calculator: దీర్ఘకాలిక పెట్టుబడులకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (Public Provident Fund PPF) మంచి సాధనం. ఆకర్షణీయమైన వడ్డీ కూడా లభిస్తుంది. రిటైర్మెంట్ అనంతరం ఆర్థిక ఇబ్బందుల బారిన పడకుండా కాపాడుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Replacing smart phone: మీ స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడు రీప్లేస్ చేయాలంటే?.. మీ ఫోన్ ఇచ్చే సిగ్నల్స్ ఇవే..

Air India Cabin Baggage: అలర్ట్.. క్యాబిన్ బ్యాగేజ్ పరిమితిని తగ్గించిన ఎయిర్ ఇండియా..

Kotak Bank Q4 results: క్యూ 4 లో కొటక్ మహీంద్ర బ్యాంక్ నికర లాభాలు రూ. 4,133 కోట్లు; వృద్ధి 18 శాతం..

Mahindra XUV700 Blaze Edition: మహీంద్రా ఎక్స్ యూవీ700 బ్లేజ్ ఎడిషన్ లాంచ్

How to open PPF account: ఎలా ఓపెన్ చేయడం?

పీపీఎఫ్ (PPF) ఖాతాను ఎవరైనా, ఏ బ్యాంక్, లేదా పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్ లోనైనా తెరవవచ్చు. ఇందుకు అవసరమైన కనీసం మొత్తం రూ. 100 మాత్రమే. ఆ తరువాత ఒక సంవత్సరంలో కనీసం రూ. 500 అయినా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పీపీఎఫ్ అకౌంట్ కు 15 సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ (lock-in period) ఉంటుంది. ఆ కాలంలో ఖాతాదారుడు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఒకే సారి ఒకే మొత్తంగా రూ. 1.5 లక్షలను కానీ, లేదా సంవత్సరం మొత్తంలో 12 వాయిదాల్లో కానీ ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు.

Tax exemption too: పన్ను రాయితీ కూడా..

ఆదాయ పన్ను చట్టంలో పీపీఎఫ్ (PPF) అకౌంట్ ఈఈఈ (EEE) కేటగిరీలోకి వస్తుంది. అంటే, 80 సీ సెక్షన్ కింద ఈ మొత్తానికి, అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 1.5 లక్షలకు ఆదాయ పన్ను మినహాయింపు పొందవచ్చు. అలాగే, ఇందులోని మరో ప్రయోజనం ఏంటంటే, మెచ్యూరిటీ అనంతరం మీరు పొందే మొత్తానికి కూడా పన్ను మినహాయింపు ఉంటుంది.

Extension of PPF account: ఖాతా లాక్ ఇన్ పీరియడ్ ను పొడగించుకోవచ్చు..

ప్రస్తుతం పీపీఎఫ్ (PPF) వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. వడ్డీని 3 నెలలకు ఒకసారి ఖాతాకు జమచేస్తారు. ఖాతాదారుడు క్రమశిక్షణతో ఈ పీపీఎఫ్ ఖాతాను నిర్వహిస్తే, మెచ్యూరిటీ సమయానికి సులభంగా కోటీశ్వరుడు కావచ్చని ఇన్వెస్ట్ మెంట్ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ‘‘ పీపీఎఫ్ ఖాతా లాక్ ఇన్ పీరియడ్ (lock-in period) 15 ఏళ్లు. ఐదేళ్ల చొప్పున ఈ లాక్ ఇన్ పీరియడ్ ను ఎన్నిసార్లైనా పొడిగించుకోవచ్చు. అంటే, అవసరం లేకుంటే, ఖాతా నుంచి డబ్బును విత్ డ్రా చేయకుండా, మరో 5 ఏళ్లు పొడగించుకోవచ్చు. అయితే, ఈ ఎక్స్ టెన్షన్ ను మరో సౌలభ్యం కూడా ఉంది. ఎక్స్ టెన్షన్ చేసుకున్న ఐదు సంవత్సరాలలో డబ్బులు డిపాజిట్ చేయకుండా కూడా పొడగించుకోవచ్చు. లేదా, ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, అంతకుముందు డిపాజిట్ చేసిన విధంగా, కంటిన్యూ చేయవచ్చు’’ అని ఎస్భీఐ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఎక్స్ పర్ట్ జితేంద్ర సోలంకి వివరించారు. అయితే, పీపీఎఫ్ ఖాతాను 15 ఏళ్ల తరువాత కూడా పొడగించాలనుకుంటే, ఇన్వెస్ట్ మెంట్ చేస్తూ పొడగించుకోవడం ఉత్తమమని వెల్త్ ఎట్ ట్రాన్సెండ్ కన్సల్టెంట్స్ డైరెక్టర్ కార్తిక్ ఝవేరీ తెలిపారు. దాని వల్ల మెచ్యూరిటీ అమౌంట్ పై వడ్డీతో పాటు, కొత్తగా డిపాజిట్ చేసిన మొత్తంపై కూడా వడ్డీ లభిస్తుందని వివరించారు.

Crorepati with PPF account: ఇలా కోటీశ్వరులు కావచ్చు..

పీపీఎఫ్ ద్వారా కోటీశ్వరుడు కావడం ఎలాగో నిపుణులు వివరిస్తున్నారు. వారిచ్చిన ఉదాహరణ ప్రకారం.. ‘‘30 ఏళ్ల వ్యక్తి పీపీఎఫ్ ఖాతా ఓపెన్ చేసి, ఏటా రూ. 1.5 లక్షలు డిపాజిట్ చేశాడు. లాకిన్ పీరియడ్ (lock-in period) అయిన 15 ఏళ్లు ముగిసిన తరువాత మరో మూడు సార్లు ఖాతాను ఎక్స్ టెండ్ చేశాడు. అంటే మరో 15 ఏళ్లు తన ఫీపీఎఫ్ (PPF) ఖాతాను పొడగించుకున్నాడు. అంటే, మొత్తంగా 30 ఏళ్ల పాటు, అంటే తనకు 60 సంవత్సరాలు వచ్చేవరకు పీపీఎఫ్ ఖాతాను నిర్వహించాడు. అంటే, సంవత్సరానికి రూ. 1.5 లక్షల చొప్పున 30 ఏళ్లకు గానూ ఆ వ్యక్తి ఇన్వెస్ట్ చేసిన మొత్తం రూ. 45 లక్షలు. 30 సంవత్సరాల తరువాత, ఆ వ్యక్తికి 60 ఏళ్లు వచ్చేనాటికి 7.1% వడ్డీతో పీపీఎఫ్ మెచ్యూరిటీ మొత్తం రూ. 1,54, 50,911 (రూ. 1.54 కోట్లు) కి చేరుతుంది. అయితే, అతడు అంతకుముందు ఎలాంటి విత్ డ్రాయల్స్ చేసి ఉండకూడదు.

సూచన: ఇవి ఆర్థిక రంగ నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు సొంతంగా నిర్ణయం తీసుకోవడం సముచితం.

పీపీఎఫ్ కాలిక్యులేటర్