తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Paytm’s Surprise Buyback Plan: షేర్ల బై బ్యాక్ కు పేటీఎం ప్రణాళిక

Paytm’s surprise buyback plan: షేర్ల బై బ్యాక్ కు పేటీఎం ప్రణాళిక

HT Telugu Desk HT Telugu

13 December 2022, 19:55 IST

  • Paytm’s buyback plan:షేర్ మార్కెట్లోకి భారీ అంచనాలతో అడుగుపెట్టి, అత్యంత దారుణంగా విఫలమైన ఐపీఓలలో పేటీఎం(Paytm) ఐపీఓ ఒకటి. తాజాగా, షేర్స్ ను తిరిగి కొనుగోలు చేయాలన్న బై బ్యాక్ (buyback) ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Paytm’s surprise buyback plan: భారీ అంచనాల మధ్య మార్కెట్లో లిస్ట్ అయి, డిజాస్టర్ గా నిలిచి, మదుపర్ల డబ్బును భారీగా నష్టపరిచిన స్టాక్ గా పేటీఎం(Paytm) నిలిచింది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన నాటి నుంచి పేటీఎం షేరు విలువ క్రమం తప్పకుండా కిందికి వెళ్తూనే ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Gold rate today: స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధర; 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 66,240

Trading guide for today: ఈ రోజు ఈ 4 స్టాక్స్ కొనండి.. లాభాలు గ్యారెంటీ అంటున్న మార్కెట్ నిపుణులు..

iVOOMi JeetX ZE: ఐవూమి నుంచి మరో ఎలక్ట్రిక్ స్కూటర్; ధర, రేంజ్ ల్లో దీనికి సాటి లేదు..

Discounts on Hyundai cars: ఎక్స్టర్ ఎస్యూవీ సహా టాప్ మోడళ్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన హ్యుందాయ్

Paytm’s buyback plan: 75% లాస్..

గత సంవత్సరం నవంబర్ లో లిస్ట్ అయిన నాటి ధరతో పోలిస్తే.. ప్రస్తుత షేరు వాల్యూ 75% తగ్గింది. సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టిన జపాన్ కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ కూడా పేటీఎంలో తన వాటాను గణనీయంగా తగ్గించుకుంది. తాజాగా, సంస్థ విడుదల చేసిన క్యూ2 ఫలితాలు కూడా నిరాశాజనకంగానే ఉన్నాయి. తాజాగా, పేటీఎం(Paytm) యాజమాన్య సంస్థ ఒన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్(One 97 Communications Ltd) ముందుకు షేర్ల బై బ్యాక్ ప్రతిపాదన వచ్చింది. సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో మంగళవారం ఈ ప్రతిపాదనపై చర్చించారు. బై బ్యాక్ వల్ల కొంతైనా షేర్ విలువ పతనాన్ని నిలువరించవచ్చని భావిస్తున్నారు. అయితే, ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను మళ్లీ బై బ్యాక్ కోసం వినియోగించడం సరికాదన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే, బై బ్యాక్ కు అవసరమైనన్ని నిధులు సంస్థ వద్ద ఉన్నాయని బై బ్యాక్ ప్రపోజల్ లో వివరించారు. అయితే, ఓపెన్ మార్కెట్ నుంచి షేర్ల బై బ్యాక్ ను ప్రారంభిస్తే, పేటీఎం(Paytm) అందుకు కనీసం రూ. 800 కోట్ల రూపాయల నుంచి వెయ్యి కోట్ల రూపాయల వరకు వెచ్చించాల్సి వస్తుంది. అయితే, బై బ్యాక్ న్యూస్ మార్కెట్లో కి వచ్చినప్పటి నుంచి పే టఎం షేర్ల విలువ పెరుగుతుండడం విశేషం.

Paytm share value: లాంగ్ టర్మ్ కు అనుకూలం

అయితే, ప్రస్తుతం పేటీఎం(Paytm) బిజినెస్ ను నిశితంగా పరిశీలిస్తున్న చాలా మంది నిపుణులు.. పేటీఎం లాంగ్ రన్ లో మంచి లాభాలను అందిస్తుందన్న అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తుండడం విశేషం. 12 మంది అనలిస్ట్ ల్లో కనీసం 8 మంది ఈ స్టాక్ కు ఇటీవల ’బై(buy)’ ఆప్షన్ నే ఇవ్వడం గమనార్హం. వీరిలో చాలా మంది ఇన్నాళ్లూ ఈ స్టాక్ సెల్(sell) ఆప్షన్ నే ఇచ్చారు.