Paytm share price target : భారీగా పెరగనున్న పేటీఎం షేర్లు! టార్గెట్​ రూ. 1300?-paytm shares rise 17 in 5 days paytm share price potential target is 1 100 1 300 ahead ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Paytm Shares Rise 17% In 5 Days; Paytm Share Price Potential Target Is 1,100- 1,300 Ahead

Paytm share price target : భారీగా పెరగనున్న పేటీఎం షేర్లు! టార్గెట్​ రూ. 1300?

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Dec 04, 2022 07:06 AM IST

Paytm share price target : పేటీఎం షేర్లు గత ఐదు రోజుల్లో 17శాతం పెరిగాయి. ఇక్కడి నుంచి ఈ స్టాక్​ రూ. 1300 వరకు వెళుతుందని బ్రోకరేజీ సంస్థలు చెబుతున్నాయి.

భారీగా పెరగనున్న పేటీఎం షేర్లు! టార్గెట్​ రూ. 1300?
భారీగా పెరగనున్న పేటీఎం షేర్లు! టార్గెట్​ రూ. 1300? (REUTERS)

Paytm share price target : నవంబర్​ 24న కనిష్ఠ స్థాయికి పడిపోయిన పేటీఎం షేర్లు.. ఆ తర్వాత నెమ్మదిగా పుంజుకున్నాయి. ఇక గత ఐదు ట్రేడింగ్​ సెషన్స్​లో పేటీఎం స్టాక్​ ఏకంగా 17శాతం పెరిగింది. ఒక్క శక్రవారం ట్రేడింగ్​ సెషన్​లోనే పేటీఎం స్టాక్​ 7.72శాతం వృద్ధిచెందింది. ఈ సంస్థ షేర్లు భవిష్యత్తులో భారీగా పెరుగుతాయని బ్రోకరేజీ సంస్థలు చెబుతున్నాయి. కొన్ని సంస్థలు.. పేటీఎం షేర్​ ప్రైజ్​ టార్గెట్​ను రూ. 1300 వరకు చెబుతున్నాయి.

పేటీఎం స్టాక్​.. ఎందుకు పెరుగుతోంది?

కొన్ని రోజుల క్రితం.. పేటీఎం ఎనలిస్ట్​ మీటింగ్​ జరిగింది. 2023 సెప్టెంబర్​ నాటికి.. అడ్జస్టెడ్​ ఎబిట్​డా బ్రేక్​ ఈవెన్​ టార్గెట్​ను సాధిస్తామని సంస్థ చాలా నమ్మకంగా చెప్పింది. పేటీఎం వ్యాపారం మోడల్​, తాజా పరిస్థితులు, భవిష్యత్​ కార్యచరణను యాజమాన్యంలోని సీనియర్లు చర్చించారు. ఫలితంగా.. అనేక బ్రోకరేజీ సంస్థలు.. పేటీఎంకు 'బై రేటింగ్​'ని ఇచ్చాయి.

Paytm share price : మోర్గాన్​ స్టాన్లీ, సీఎల్​ఎస్​ఏ, జేఎం ఫైనాన్షియల్​ వంటి సంస్థలు.. పేటీఎం షేర్​ ప్రైజ్​ టార్గెట్​ను రూ. 600- రూ. 700 మధ్యలో ఇచ్చాయి.

"పేటీఎం బిజినెస్​ మోడల్​పై మేము ఆచితూచి వ్యవహరిస్తాము. ఈ వ్యాపారంలో భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. రిస్క్​ కూడా ఎక్కువే. ప్రాఫిటెబులిటీ సాధించేందుకు చాలా ఏళ్లు గడిచిపోతుంది. కానీ పేటీఎం ఫైనాన్షియల్స్​ నిదానంగా మెరుగుపడుతున్నాయి. ప్రాఫిటెబులిటీని పెంచుకోవాలని యాజమాన్యం కూడా భావిస్తోంది. అందువల్ల ఎఫ్​వై26 నాటికి పేటీఎం అజ్జస్టెడ్​ బ్రేక్​ఈవెన్​ను సాధించవచ్చు. అదే సమయంలో.. ఐపీఓ దశ నుంచి పేటీఎం షేరు 77శాతం పతనమైంది. ఫలితంగా స్టాక్​లో రిస్క్​- రివార్డ్​ సానుకూలంగా ఉంది. అందుకే పేటీఎంకు బై రేటింగ్​ ఇస్తున్నాము. టార్గెట్​ ప్రైజ్​ రూ. 600," అని జేఎం ఫైనాన్షియల్​ పేర్కొంది.

మరోవైపు ఏడాది కాలంలో పేటీఎం షేర్​ ప్రైజ్​ రూ. 1,100కి చేరుతుందని గోల్డ్​మాన్​ సాక్స్​ అభిప్రాయపడింది. ఇక ఐసీఐసీఐ సెక్యూరిటీస్​.. పేటీఎంకు బై రేటింగ్​ ఇస్తూ.. టార్గెట్​ ప్రైజ్​ను రూ. 1,285గా పేర్కొంది.

పేటీఎం క్యూ2 ఫలితాలు..

Paytm q2 results 2022 : డిజిటల్​ ఫైనాన్స్​ సర్వీస్​లు అందించే పేటీఎం.. 2023 ఆర్థిక ఏడాది క్యూ2 ఫలితాలను గత నెలలో ప్రకటించింది. క్యూ2లో పేటీఎం కన్సాలిడేటెడ్​ లాస్​.. రూ. 571కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నెట్​ లాస్​ రూ. 472.90కోట్లుగా ఉండేది.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

పేటీఎం స్టాక్​ ప్రైజ్​..

Paytm share price history : శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో 7.72శాతం పెరిగిన పేటీఎం స్టాక్​.. 540 వద్ద స్థిరపడింది. ఇక గత ఐదు రోజుల్లో ఈ స్టాక్​ ఏకంగా 17.98శాతం వృద్ధి చెందింది. కానీ.. నెల రోజుల్లో పేటీఎం షేరు ధర 17శాతం పతనమైంది. ఆరు నెలల్లో 12.16శాతం పడిపోయింది. ఇక ఈ ఏడాదిలో ఇప్పటివరకు 59.71శాతం నష్టపోయింది పేటీఎం స్టాక్​. ఏడాది కాలంలో ఏకంగా 66.36శాతం నష్టపోయి.. మదుపర్లకు భారీ నష్టాన్ని మిగిల్చింది!

WhatsApp channel

సంబంధిత కథనం