Paytm Q2 results : క్యూ2లో.. మరింత పెరిగిన పేటీఎం నష్టాలు-paytm q2 results net loss widens to 571 crore revenue up 76percent ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Paytm Q2 Results: Net Loss Widens To 571 Crore, Revenue Up 76percent

Paytm Q2 results : క్యూ2లో.. మరింత పెరిగిన పేటీఎం నష్టాలు

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 08, 2022 06:29 AM IST

Paytm Q2 results 2022 : పేటీఎం నష్టాలు మరింత పెరిగాయి. కాగా.. ఆదాయం మాత్రం వృద్ధిచెందింది. ఈ మేరకు క్యూ2 ఫలితాలను విడుదల చేసింది పేటీఎం.

క్యూ2లో.. మరింత పెరిగిన పేటీఎం నష్టాలు
క్యూ2లో.. మరింత పెరిగిన పేటీఎం నష్టాలు

Paytm Q2 results 2022: డిజిటల్​ ఫైనాన్స్​ సర్వీస్​లు అందించే పేటీఎం.. 2023 ఆర్థిక ఏడాది క్యూ2 ఫలితాలను ప్రకటించింది. క్యూ2లో పేటీఎం కన్సాలిడేటెడ్​ లాస్​.. రూ. 571కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో నెట్​ లాస్​ రూ. 472.90కోట్లుగా ఉండేది.

ట్రెండింగ్ వార్తలు

అంచనాల కన్నా తక్కువే..!

అయితే.. గత త్రైమాసికంతో(రూ. 644.4కోట్ల నష్టం) పోల్చుకుంటే మాత్రం పేటీఎం నెట్​ లాస్​ తగ్గింది. ఇక పేటీఎం కన్సాలిడేటెడ్​ రెవెన్యూ(ఇయర్​ ఆన్​ ఇయర్​).. 76శాతం పెరిగి రూ. 1,914కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో అది రూ. 1,679.60కోట్లుగా నమోదైంది.

Paytm Q2 results : మర్చెంట్​ సబ్​స్క్రిప్షన్​ రెవెన్యూలో పెరుగుదల, ఎంటీయూ వృద్ధితో బిల్​ పేమెంట్లు పెరగడం, లోన్​ డిస్​బర్స్​మెంట్స్​లో వృద్ధి కనిపించడంతో ఈసారి పేటీఎం ఆదాయం పెరిగింది.

నెట్​ లాస్​, రెవెన్యూ విషయంలో పేటీఎం.. అంచనాల కన్నా తక్కువ ప్రదర్శన చేసింది. ఇయర్​ ఆన్​ ఇయర్​ బేసిస్​లో పేటీఎం రెవెన్యూ 62.4శాతం వృద్ధి చెందుతుందని, నష్టాలు రూ. 596కోట్లుగా నమోదవుతాయని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

ఇయర్​ ఆన్​ ఇయర్​ ప్రకారం.. ఫైనాన్షియల్​ సర్వీసెస్​, ఇతర వ్యాపారాల్లో పేటీఎం ఆదాయం రూ. 349కోట్లుగా నమోదైంది. మొత్తం రెవెన్యూలో దీని వాటా 18శాతంగా ఉంది.

లెండింగ్​ పార్ట్​నర్లకు జరిగిన లోన్​ డిస్​బర్స్​మెంట్​.. 9.2మిలియన్​గా నమోదైంది. ఇయర్​ ఆన్​ ఇయర్​లో ఇది 224శాతం, క్వార్టర్​ ఆన్​ క్వార్టర్​లో 8శాతం వృద్ధిచెందింది. రెవెన్యూలో దీని వాటా రూ. 7,313కోట్లుగా ఉంది.

పేటీఎం షేరు ధర..

Paytm share price : సోమవారం ట్రేడింగ్​ సెషన్​ ముగిసే సమయానికి పేటీఎం స్టాక్​ ధర 0.25శాతం పెరిగి రూ. 652కి చేరింది. ఈ పేటీఎం షేరు.. గత ఐదు రోజుల్లో 1.24శాతం పెరిగింది. ఇక గత నెల రోజుల్లో 10.35శాతం పతనమైంది. ఆరు నెలల్లో.. పేటీఎం స్టాక్​ ప్రైజ్​.. 17.22శాతం వృద్ధిని నమోదు చేసింది. కాగా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఈ స్టాక్​ ఏకంగా 51.34శాతం పతనమైంది.

WhatsApp channel

సంబంధిత కథనం