తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Nykaa Q2 Results : క్యూ2లో 330శాతం పెరిగిన నైకా లాభాలు!

Nykaa Q2 results : క్యూ2లో 330శాతం పెరిగిన నైకా లాభాలు!

01 November 2022, 13:26 IST

    • Nykaa Q2 results 2022 : నైకా సంస్థ లాభాలు.. క్యూ2లో 330శాతం పెరిగాయి. ఈ మేరకు త్రైమాసిక ఫలితాలను మంగళవారం వెల్లడించింది సంస్థ.
క్యూ2లో 330శాతం పెరిగిన నైకా లాభాలు!
క్యూ2లో 330శాతం పెరిగిన నైకా లాభాలు! (REUTERS)

క్యూ2లో 330శాతం పెరిగిన నైకా లాభాలు!

Nykaa Q2 results 2022 : 2023 ఆర్థిక ఏడాది రెండో త్రైమాసికం ఫలితాలను మంగళవారం ప్రకటించింది నైకా. ఈసారి 330శాతం లాభాలను నమోదు చేసింది. క్యూ2లో నైకా సంస్థ నెట్​ ప్రాఫిట్​ రూ. 5.2కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదేత్రైమాసికంలో నెట్​ ప్రాఫిట్​ రూ. 1కోటిగా ఉంది. జూన్​తో ముగిసిన త్రైమాసికంలో రూ. 5కోట్ల లాభాన్ని అర్జించింది ఈ సంస్థ.

ట్రెండింగ్ వార్తలు

iPad Air 2024: రెండేళ్ల నిరీక్షణకు తెర; లేటెస్ట్ ఎం2 చిప్ తో ఐప్యాడ్ ఎయిర్ 2024 సిరీస్ లాంచ్

Massive discounts on Mahindra cars: ఎక్స్ యూ వీ 300 సహా మహీంద్ర కార్లపై బంపర్ ఆఫర్స్, హెవీ డిస్కౌంట్స్..

Indegene Limited IPO: అదిరిపోయే జీఎంపీతో ఓపెన్ అయిన ఇండిజీన్ లిమిటెడ్ ఐపీఓ; ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు..

Stock market crash: స్టాక్ మార్కెట్ క్రాష్ కు కారణాలేంటి?.. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు మారాయా?

ఆపరేషన్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని కూడా పెంచుకుంది నైకా. గతేడాది రూ. 885కోట్లుగా ఉంటే, ఈసారి రూ. 1230కోట్లుగా నమోదైంది. అంటే.. 39శాతం పెరిగినట్టు. ఇక గత త్రైమాసికంతో(రూ. 1,148.4కోట్లు) పోల్చుకుంటే 7శాతం వృద్ధిని సాధించినట్టు.

నైకా షేర్లు అప్​..

అదిరిపోయే రిజల్ట్స్​ నేపథ్యంలో.. నైకా షేర్లు కూడా దూసుకెళుతున్నాయి. ప్రస్తుతం 4.8శాతం లాభంతో నైకా షేరు 1209 వద్ద ట్రేడ్​ అవుతున్నాయి.

స్టాక్​ మార్కెట్​లో గతేడాది నవంబర్​లో లిస్ట్​ అయ్యింది నైకా. అప్పటి నుంచి నష్టాల్లోనే ఉంది. మొత్తం మీద 48శాతం కోల్పోయింది.

రూ. 2,358 వద్ద లిస్ట్​ అయిన నైకా షేరు.. ఇప్పటివరకు 48.79శాతం నష్టపోయింది. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 42.12శాతం నష్టాలను నమోదు చేసింది. ఇక ఆరు నెలల్లో దాదాపు 30శాతం, నెల రోజుల్లో 7శాతం మేర నష్టాలను చూసింది నైకా షేరు.

బోనస్​ షేర్లు..

నైకా సంస్థ ఇటీవలే 1:5 రేషియోలో బోనస్​ షేర్లను కూడా ప్రకటించింది. అంటే.. నైకాకు చెందిన ఒక షేరు ఉంటే.. 5 షేర్లు వచ్చి చేరుతాయి. ఇందుకు రికార్డ్​ డేట్​ను ఈ నెల 11గా నిర్ణయించింది సంస్థ.