తెలుగు న్యూస్  /  బిజినెస్  /  New Toyota Fortuner : టయోటా ఫార్చ్యునర్​లో 2 కొత్త వేరియంట్లు లాంచ్​..

New Toyota Fortuner : టయోటా ఫార్చ్యునర్​లో 2 కొత్త వేరియంట్లు లాంచ్​..

Sharath Chitturi HT Telugu

28 March 2023, 11:53 IST

google News
  • New Toyota Fortuner : భారీ డిమాండ్​ ఉన్న ఫార్చ్యునర్​కు రెండు కొత్త వేరియంట్లను లాంచ్​ చేసింది టయోటా సంస్థ. వీటి పేర్లు టయోటా మోడలిస్టా, టయోటా జీఆర్​ స్పోర్ట్​. పూర్తి వివరాలు..

టయోటా ఫార్చ్యునర్​లో 2 కొత్త వేరియంట్లు లాంచ్​..
టయోటా ఫార్చ్యునర్​లో 2 కొత్త వేరియంట్లు లాంచ్​.. (Live Hindustan)

టయోటా ఫార్చ్యునర్​లో 2 కొత్త వేరియంట్లు లాంచ్​..

New Toyota Fortuner : టయోటా ఫార్చ్యునర్​కు ఇండియాలో సపరేట్​ ఫ్యాన్​బేస్​ ఉంది. ఈ భారీ ఎస్​యూవీకి డిమాండ్​ ఎక్కువే. ఇక ఇప్పుడు.. ఫార్చ్యునర్​లో రెండు కొత్త వేరియంట్​లను తీసుకొచ్చింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టయోటా. 2023 బ్యాంకాక్​ మోటార్​ షోలో ఈ కొత్త వేరియంట్లను లాంచ్​ చేసింది. వాటి పేర్లు టయోటా ఫార్చ్యునర్​ మోడలిస్టా, 2023 జీఆర్​ స్పోర్ట్​. ఆటోమొబైల్​ మార్కెట్​లో వీటికి కూడా మంచి ఆదరణ లభిస్తుందని సంస్థ భావిస్తోంది.

2023 టయోటా ఫార్చ్యునర్​ మోడలిస్టా.. జీఆర్​ స్పోర్ట్​..

టయోటా ఫార్చ్యునర్​ మోడలిస్టాలో 2.4 లీటర్​ టర్బో డీజిల్​ ఇంజిన్​ ఉంటుంది. ఈ మోడల్​ జపాన్​లో ఇప్పటికే అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అంతర్జాతీయంగానూ హై క్వాలిటీ ప్రాడక్ట్​నే టయోటా తీసుకొస్తుందని అంచనాలు ఉన్నాయి. మోడలిస్టా కిట్​తో ఈ వెహికిల్​ను మనకు నచ్చినట్టు కస్టమైజ్​ చేసుకునే వెసులుబాటును కూడా టయోటా కల్పిస్తుందని సమాచారం. ఫలితంగా డ్రైవింగ్​ ఎక్స్​పీరియన్స్​ మరింత పెరుగుతుంది.

Toyota Fortuner Modellista : మరో కొత్త వేరియంట్​ టయోటా జీఆర్​ స్పోర్ట్​లో 2.8 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. చాలా రేసింగ్​ కార్స్​లో దీనిని ఉపయోగిస్తారు. దీనిని టయోటా గాజూ రేసింగ్​ అభివృద్ధి చేసింది. అద్భుతమైన డ్రైవింగ్​ ఎక్స్​పీరియన్స్​ని ఇచ్చే విధంగా ఈ టయోటా జీఆర్​ స్పోర్ట్​ను డిజైన్​ చేసింది సంస్థ. ఇందులో లెక్సెస్​ తరహా భారీ గ్రిల్​ ఉండటంతో లుక్​ మరింత బోల్డ్​గా, స్టైలిష్​గా, స్పోర్టీగా మారింది.

Toyota Fortuner GR Sport launch : ఈ జీఆర్​ స్పోర్ట్​లో 9 ఇంచ్​ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, వయర్​లెస్​ ఛార్జింగ్​ వంటివి ఉన్నాయి. రేర్​ ప్యాసింజర్లకు ఓవర్​హెడ్​ స్క్రీన్​ ఆప్షన్​ కూడా లభిస్తోంది. ఎలక్ట్రిక్​ టెయిల్​గేట్​, హిల్​ స్టార్ట్​ అసిస్ట్​, ట్రైలర్​ అసిస్ట్​ వంటి ఫీచర్స్​ కూడా వస్తున్నాయి.

కొత్త వేరియంట్ల ధరలు..

2.4 లీటర్​ డీజిల్​ ఇంజిన్​ టయోటా ఫార్చ్యునర్​ మోడలిస్టా ఎక్స్​షోరూం ధర 1.67 మిలియన్​ థాయ్​ భ్​ట్​. ఇండియన్​ కరెన్సీలో ఇది దాదాపు రూ. 40.41లక్షలు. 2023 ఫార్చ్యునర్​ జీఆర్​ స్పోర్ట్​ వేరియంట్​ ఎక్స్​షోరూం ధర 1.8 మిలియన్​ థాయ్​ భాట్​. అంటే రూ. 45.9లక్షలు.

Toyota Fortuner new variants : ఇండియాలో వీటి లాంచ్​పై ప్రస్తుతం స్పష్టత లేదు. అయితే త్వరలోనే ఇవి ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో లాంచ్​ అవుతాయని అంచనాలు ఉన్నాయి. అయితే.. ప్రస్తుతం ఉన్న ఫార్చ్యునర్​కు ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని కూడా టయోటా ప్లాన్​ చేస్తున్నట్టు తెలుస్తోంది.

తదుపరి వ్యాసం