BMW India : ఏడాదిలో 19 మోడల్స్​ లాంచ్​.. ఇండియాలో బీఎండబ్ల్యూ భారీ ప్లాన్​!-bmw plans to launch 19 car models in india this year aims at double digit growth ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Bmw India : ఏడాదిలో 19 మోడల్స్​ లాంచ్​.. ఇండియాలో బీఎండబ్ల్యూ భారీ ప్లాన్​!

BMW India : ఏడాదిలో 19 మోడల్స్​ లాంచ్​.. ఇండియాలో బీఎండబ్ల్యూ భారీ ప్లాన్​!

Sharath Chitturi HT Telugu
Mar 28, 2023 09:55 AM IST

BMW cars launch in India : ఈ ఏడాది బీఎండబ్ల్యూ నుంచి 19 కార్​ మోడల్స్​ లాంచ్​ కానున్నాయి! వీటితో పాటు మరో 3 బైక్స్​ కూడా ఇండియా మార్కెట్​లోకి అడుగుపెట్టనున్నాయి.

ఏడాదిలో 19 కార్లు లాంచ్​.. ఇండియాలో బీఎండబ్ల్యూ భారీ ప్లాన్​!
ఏడాదిలో 19 కార్లు లాంచ్​.. ఇండియాలో బీఎండబ్ల్యూ భారీ ప్లాన్​! (BMW/file)

BMW cars launch in India : జర్మనీకి చెందిన దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​పై ఫోకస్​ మరింత పెంచింది. ఎలక్ట్రిక్​ వాహనాలతో పాటు ఈ ఏడాది మొత్తం మీద 19 కార్​ మోడల్స్​ను లాంచ్​ చేసేందుకు ప్లాన్​ వేసింది. ఇండియా మార్కెట్​లో రెండంకెల సేల్స్​ వృద్ధిని సాధించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ చర్యలు చేపట్టనుంది.

19 కార్లు.. 3 బైక్స్​..!

ఇండియాలో సేల్స్​ పరంగా.. 2023 సంస్థకు ది బెస్ట్​గా నిలుస్తుందని బీఎండబ్ల్యూ భావిస్తోంది. ఫలితంగా భారీ అంచనాలు పెట్టుకుంది. ముఖ్యంగా ఈవీ సెగ్మెంట్​పై మరింత దృష్టిసారించింది. సంస్థ పూర్తి విక్రయాల్లో 15శాతం వాటా ఈవీలకే ఉండేట్టుగా చూసుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. వీటితో పాటు బీఎండబ్ల్యూ మోటరాడ్​ వ్యాపారంలో భాగంగా ఇండియాలో ఈ ఏడాది మూడు బైక్​ మోడల్స్​ని కూడా లాంచ్​ చేయాలని చూస్తోంది.

BMW India latest news : "ఈ ఏడాది ఇండియాలో మొత్తం మీద 22 ప్రాడక్టులను లాంచ్​ చేస్తున్నాము. వీటిల్లో 19 కార్లు, 3 బైక్స్​ ఉన్నాయి," అని బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్​ విక్రమ్​ పావాహ్​ మీడియాకు తెలిపారు. కొత్త వాహనాల లాంచ్​లతో పాటు ప్రస్తుత మోడల్స్​కు చెందిన ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లు ఈ ఏడాది మార్కెట్​లోకి అడుగుపెడతాయని వివరించారు.

'లగ్జరీ కార్లకు భారీ డిమాండ్​..'

గతేడాది డిసెంబర్​ నుంచి ఈ ఏడాది జనవరి (8 వారాలు) మధ్య బీఎండబ్ల్యూ 8 ప్రాడక్టులను లాంచ్​ చేసిందని తెలిపిన పావాహ్​.. 5,500 కార్లు, 4,500 బైక్​ ఆర్డర్లు లభించినట్టు తెలిపారు. ఇండియాలో నాలుగు వివిధి ఈవీ మోడల్స్​ ఉన్న ఏకైక కంపెనీ తమదేనని పావాహ్​ వ్యాఖ్యానించారు.

BMW India new launches : "ఈ 5,500 వాహనాల్లో 600 ఈవీలు ఉన్నాయి. అంటే మొత్తం సేల్స్​లో ఈవీ వాటా ఇప్పటికే 11శాతం మార్క్​ను దాటేసింది. ఈ ఏడాది చివర్లో అది 15శాతానికి చేరుతుందని ఆశిస్తున్నాము," అని పావాహ్​ స్పష్టం చేశారు.

"అంతర్జాతీయంగా 2023 చివరి నాటికి సంస్థకు చెందిన 12 ఫుల్లీ ఎలక్ట్రిక్​ మోడల్స్​ అందుబాటులో ఉంటాయి. వాటన్నింటినీ ఇండియాలోకి తీసుకురావాలని ప్లాన్​ చేస్తున్నాము. ప్రీమియం ఈవీ సెగ్మెంట్​లో లీడర్​గా కొనసాగే అవకాశం మాకు ఉంది. లగ్జరీ వాహనాలకు ఇండియాలో డిమాండ్​ ఎక్కువగా ఉంది. డిమాండ్​ తగ్గుతుందన్న సంకేతాలే లేవు. ఇతర దేశాల్లో ఈ విషయంలో సమస్యలు ఉండొచ్చేమో.. కానీ ఇండియాలో మాత్రం లగ్జరీ కార్ల సెగ్మెంట్​ బలంగా ఉంది," అని పావాహ్​ తెలిపారు.

BMW cars launch news : 2022లో ఇండియాలో మొత్తం మీద 11,981 కార్లను విక్రయించింది బీఎండబ్ల్యూ. ఈ ఏడాది ఇంకా ఎక్కువ సేల్స్​ నమోదు చేయాలని సంకల్పంతో ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం