Toyota Innova Hycross waiting period : ఇన్నోవా హైక్రాస్ కోసం.. 'వెయిట్' చేయాల్సిందే!
04 February 2023, 13:20 IST
- Toyota Innova Hycross waiting period : టయోటా ఇన్నోవాకు సాధారణంగానే మంచి డిమాండ్ ఉంటుంది. ఇక నెక్స్ట్ జెనరేషన్ ఇన్నోవా హైక్రాస్కు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. ఫలితంగా ఈ వెహికిల్ వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువగానే ఉంది.
టయోటా ఇన్నోవా హైక్రాస్..
Toyota Innova Hycross waiting period : ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేసినట్టే.. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎంపీవీకి మంచి డిమాండ్ కనిపిస్తోంది. 2022 చివర్లో లాంచ్ అయినా ఈ కొత్త మోడల్‌కు సంబంధించి.. డెలివరీ ఇటీవలే ప్రారంభమైంది. కానీ భారీ డిమాండ్ నేపథ్యంలో ఈ న్యూ జెనరేషన్ ఎంపీవీకి వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువగానే ఉంది. దేశంలోని వివిధ నగరాల్లో.. టయోటా ఇన్నోవా హైక్రాస్కు ఉన్న వెయిటింగ్ పీరియడ్‌ను ఇక్కడ తెలుసుకుందాము..
ఇన్నోవా హైక్రాస్ కావాలంటే.. వెయిట్ చేయాల్సిందే..!
టయోటా నుంచి వచ్చిన సరికొత్త ఎంపీవీకి కనిష్ఠంగా 2.5 నెలలు- గరిష్ఠంగా 4.5 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 3-4 నెలల వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. ఇక బెంగళూరు, పుణె, జైపూర్, ఛండీగఢ్ నగరాల్లో వెయిటింగ్ పీరియడ్ 4 నెలలుగా ఉంది.
Toyota Innova Hycross on road price in Hyderabad : హైదరాబాద్‌లో టయోటా ఇన్నోవా హైక్రాస్ డెలివరీకి 4- 4.5 నెలల సమయం పడుతోంది. అదే సమయంలో.. ముంబై, చెన్నై, అహ్మదాబాద్, లక్నో, సూరత్, కోయంబత్తూర్, పట్నా, ఇండోర్‌లో ఈ ఎంపీవీని దక్కించుకోవాలంటే కనీసం 3 నెలలు వెయిట్ చేయాల్సిందే. గురుగ్రామ్, కోల్‌కతా, ఠాణె, ఫరీదాబాద్, నోయిడాల్లో వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి 3-4 నెలల మధ్యలో ఉంది. ఘజియాబాద్‌లో కస్టమర్లు 2.5- 3.5 నెలల వరకు ఎదురుచూడాల్సి వస్తోంది.
టయోటా ఇన్నోవా హైక్రాస్- ఫీచర్స్..
ఈ హైక్రాస్ మోడల్.. 4755 ఎంఎం పొడవు, 1850 ఎంఎం వెడల్పు, 1795 ఎంఎం ఎత్తు ఉంటుంది. దీని వీల్ బేస్ 2850 ఎంఎంగా ఉంది. అంటే ఇన్నోవాలోని గత మోడల్స్‌తో పోల్చుకుంటే దీని డైమెన్షన్స్ ఎక్కువ.
Toyota Innova Hycross vs Kia Carnival : ఇన్నోవా హైక్రాస్- కియా కార్నివాల్.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Toyota Innova Hycross bookings : ఇక ఈ కొత్త మోడల్ ముందువైపు ఆకర్షణీయమైన హెక్సాగోనల్ రేడియేటర్ గ్రిల్, డ్యుయెల్ టోన్ బంపర్‌ను అమర్చారు. ఇన్నోవా క్రిస్టాతో పోలిస్తే.. ఇంటీరియర్స్ లోనూ విప్లవాత్మక మార్పులు జరిగాయి.
ఇండియా మార్కెట్లో ఈ టయోటా ఇన్నోవా హైక్రాస్.. ఎంజీ హెక్టర్ ప్లస్, టాటా సఫారీ, మహింద్ర ఎక్స్యూవీ 700, హ్యుందాయ్ అల్కజార్ మోడల్స్‌కు గట్టిపోటీనిస్తోంది.
టయోటా ఇన్నోవా హైక్రాస్- ఇంజిన్, ధర..
Toyota Innova Hycross price : ఇన్నోవా హైక్రాస్లో డీజిల్ వేరియంట్ లేదు. రెండు పెట్రోల్, మూడు హైబ్రీడ్ వేరియంట్లలో దీనిని టయోటా రూపొందిస్తోంది. 2.0లీటర్ పెట్రోల్, 2.0 లీటర్ పెట్రోల్ హైబ్రీడ్ మోటార్లు ప్రధానంగా కనిపిస్తున్నాయి. హైబ్రీడ్ మోడల్ లీటరుకు 21.1కేఎంపీఎల్ మైలేజీని ఇస్తోంది. అంటే.. ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే.. 1,097కి.మీల వరకు ప్రయాణించవచ్చు!
మార్కెట్లో టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర రూ. 18.30లక్షలు- రూ. 28.97లక్షలు (ఎక్స్‌షోరూం)గా ఉంది.