Toyota SUV's launch : ఇండియాలో 3 కొత్త ఎస్‌యూవీల లాంచ్‌కు టయోటా ప్లాన్!
Toyota new SUV's launch in India : ఇండియాలో 3 కొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేసేందుకు టయోటా సంస్థ ప్లాన్ చేస్తోంది. వీటిల్లో నెక్స్ట్ జెన్ ఫార్చ్యునర్ కూడా ఉంది.
Toyota new SUV's launch in India : ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్యూవీ సెగ్మెంట్‌కు ఈ మధ్య కాలంలో విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే వివిధ ఆటోమొబైల్ సంస్థలు.. కొత్త కొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేస్తున్నాయి. ఈవీలతో పాటు ఇప్పుడు చాలా కంపెనీల లైనప్‌లో ఎస్‌యూవీలే ఉంటున్నాయి! ఇండియా మార్కెట్లో ఇన్నోవా హైక్రాస్, హైరైడర్ వంటి మోడల్స్‌ను ఇటీవలే లాంచ్ చేసిన టాయోటా మోటార్స్.. రానున్న కాలంలో మరో మూడు ఎస్‌యూవీలను లాంచ్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఎస్‌యూవీలే.. ఎస్‌యూవీలు..!
రానున్న 2,3 ఏళ్లల్లో.. మూడు ఎస్‌యూవీలను లాంచ్ చేయనుంది టయోటా సంస్థ. ఇండియాలో మారుతీ సుజుకీకి టయోటా మోటార్స్‌కు మధ్య ఒప్పందం ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే.. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్‌ను రీనేమ్ చేసి టయోటా సంస్థ కూడా లాంచ్ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ మోడల్‌కు ఏ15 అన్న కోడ్‌నేమ్ పెట్టినట్టు తెలుస్తోంది. 1.0 లీటర్ 3 సిలిండర్ బూస్టర్‌జెట్ టర్బో, 1.2 లీటర్ డ్యూయెల్ జెట్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ ఇది లాంచ్ అవుతుందని అంచనాలు ఉన్నాయి.
Toyota new SUV's : మారుతీ ఫ్రాంక్స్.. వచ్చే నెలలో లాంచ్ కానుంది. బుకింగ్స్ పరంగా చూసుకుంటే.. ఈ మోడల్‌కు ఇప్పటికే మంచి డిమాండ్ కనిపిస్తోంది. ఇక తమ ప్రాడక్ట్‌కి కూడా అదే తరహా డిమాండ్ వస్తుంది జపాన్ ఆధారిత సంస్థ భావిస్తోంది.
మరోవైపు.. టయోటా మోటార్స్‌కు బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌లో ఒకటిగా ఉన్న ఫార్చ్యునర్కు లేటెస్ట్ వర్షెన్‌ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే.. నెక్స్ట్ జెనరేషన్ ఫార్చ్యునర్.. 2025 నాటికి ఇండియా రోడ్ల మీద చక్కర్లు కొడుతుంది. 2024లోనే ఇది అంతర్జాతీయంగా లాంచ్ కానుంది. బ్రాండ్- న్యూ డిజైన్, అప్డేటెడ్ కేబిన్, కొత్త ఇంజిన్ ఆప్షన్ వంటివి ఇందులో కనిపించనున్నాయి. టయోటా టీఎన్జీఏ-ఎఫ్ ఆర్కిటెక్చర్ అనే ప్లాట్‌ఫామ్‌పై దీనిని రూపొందిస్తున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ప్లాట్‌ఫామ్‌పై 2,500ఎంఎం- 4,180ఎంఎం వీల్‌బేస్‌తో కూడిన వాహనాలను తయారు చేయవచ్చని తెలుస్తోంది.
Toyota motors latest launch : వీటితోపాటు ఓ కొత్త 3-రో ఎస్‌యూవీని ప్రత్యేకంగా ఇండియన్ మార్కెట్ కోసం టయోటా అభివృద్ధి చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంత్జాతీయంగా ఉన్న కొరొల్లా క్రాస్ ఎస్యూవీ ప్లాట్‌ఫామ్‌పై దీనిని డెవెలప్ చేస్తున్నట్టు సమాచారం. ఇదొక 7- సీటర్ అని తెలుస్తోంది. ఈ 7 సీటర్ కొరొల్లా క్రాస్.. హ్యుందాయ్ అల్కజార్, మహీంద్రా ఎక్స్‌యూవీ700, జీప్ మెరీడియన్ వంటి డిమాండ్ ఉన్న మోడల్స్‌కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
సంబంధిత కథనం