తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Motorola Edge 30 Ultra కు టాప్-ఎండ్ వేరియంట్‌ లాంచ్, ధర ఎంతంటే?

Motorola Edge 30 Ultra కు టాప్-ఎండ్ వేరియంట్‌ లాంచ్, ధర ఎంతంటే?

HT Telugu Desk HT Telugu

18 October 2022, 19:29 IST

    • మోటోరోలా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ Motorola Edge 30 Ultra లో టాప్-ఎండ్ వేరియంట్‌ అందుబాటులోకి వచ్చింది. కొత్త వేరియంట్లో ఫీచర్లు, ధర ఎంత తెలుసుకోండి.
Motorola Edge 30 Ultra
Motorola Edge 30 Ultra

Motorola Edge 30 Ultra

మోటోరోలా కంపెనీ Edge సిరీస్‌లో Motorola Edge 30 Ultra డివైస్‌ను సెప్టెంబర్‌లో భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఆ సమయంలో, కంపెనీ 8GB RAM , 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఏకైక వేరియంట్‌ను మాత్రమే విడుదల చేసింది. అయితే మార్కెట్లో ఇప్పుడు అనేక మొబైల్ బ్రాండ్లు మెరుగైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లలో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ మోడళ్లను విడుదల చేస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని మోటోరోలా కంపెనీ కూడా పోటీలో నిలిచేందుకు తమ Motorola Edge 30 Ultra స్మార్ట్‌ఫోన్‌ను అప్డేట్ చేసింది. తాజాగా ఈ మోడల్‌కు 12GB+256GB వేరియంట్‌ను లాంచ్ చేసింది. Motorola Edge 30 Ultra టాప్-ఎండ్ వేరియంట్‌ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Stock Market News: శనివారమైనా రేపు స్టాక్ మార్కెట్ పని చేస్తుంది.. కారణం ఏంటంటే..?

Personal loan for business : వ్యాపారం కోసం పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నాారా? తప్పు చేసినట్టే!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 390 స్టాక్​ని ట్రాక్​ చేయండి- భారీ లాభాలు!

Mahindra XUV 3XO : గంటలో 50వేల బుకింగ్స్​.. ఇదీ మహీంగ్స్​ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ క్రేజ్​!

మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా అనేది భారీ 200 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్ సెటప్‌తో భారత మార్కెట్లో విడుదలైన మొదటి ఫోన్. ఇదే కాకుండా ఈ ఫోన్‌లో 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, టెలిఫోటో లెన్స్, 60MP సెల్ఫీ స్నాపర్ 125W ఫాస్ట్ ఛార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్, డస్ట్ రెసిస్టెంట్, వాటర్ రెసిస్టెంట్ వంటి ఇతర ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో వచ్చింది. ఇప్పుడు కొత్త వేరియంట్‌లో వచ్చిన ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత తదితర వివరాలు పరిశీలిద్దాం.

New Motorola Edge 30 Ultra స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.67 అంగుళాల pOLED FHD+ కర్వ్‌డ్ డిస్‌ప్లే
  • 12GB RAM, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • Qualcomm స్నాప్‌డ్రాగన్ 8+ Gen1 ప్రాసెసర్
  • వెనకవైపు 200MP + 50MP + 12MP ట్రిపుల్ కెమెరా, ముందు భాగంలో 60MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4610 mAh బ్యాటరీ సామర్థ్యం, 125W ఛార్జర్
  • డాల్బీ అట్మోస్‌ స్పీకర్లు

కనెక్టివిటీ కోసం 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ v5.2, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

ధర, రూ. 64,999/-

పాత మోడల్ 8GB + 128GB వేరియంట్ ధర రూ. 55 వేలుగా ఉంది. ఇంత ధర ఉండి, భారీ కెమెరాలు కలిగి స్టోరేజ్ తక్కువ ఉండటంతో కస్టమర్లు ఈ ఫోన్ కొనుగోలుపై సందేహించారు. దీంతో కంపెనీ స్టోరేజ్ రెట్టింపు చేసి, ఈ కొత్త వేరియంట్ విడుదల చేసింది.

తదుపరి వ్యాసం