తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Moto Edge 30 Fusion। ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు.. ఇది బెస్ట్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌!

Moto Edge 30 Fusion। ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు.. ఇది బెస్ట్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌!

HT Telugu Desk HT Telugu

18 September 2022, 14:50 IST

google News
    • మొబైల్ మేకర్ మోటోరోలా Moto Edge 30 Ultra స్మార్ట్‌ఫోన్‌ తో పాటుగా మరొక మోడల్ Moto Edge 30 Fusionను కూడా ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రత్యేకతలు, దీని ధర, లభ్యత వివరాలు ఇక్కడ చూడండి.
Moto Edge 30 Fusion
Moto Edge 30 Fusion

Moto Edge 30 Fusion

మోటోరోలా కంపెనీ ఇటీవలే తమ Edge సిరీస్‌లో మరో రెండు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో ఒకటి 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కలిగిన Moto Edge 30 Ultra, ఇది ఒక ఫ్లాగ్‌షిప్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌. అయితే దీనితో పాటుగా కంపెనీ మరొక మోడల్ Moto Edge 30 Fusionను కూడా ప్రవేశపెట్టింది. ఈ Fusion మోడల్ స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇది ఎడ్జ్ సిరీస్‌లో వచ్చిన మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌.

ఈ హ్యాండ్‌సెట్లో కూడా ప్రీమియం ఫీచర్లను అందించారు. ఇందులో భాగంగా హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇచ్చే విధంగా వంపు అంచులు కలిగిన కర్వ్‌డ్ డిస్‌ప్లే ఇచ్చారు. ఇలాంటి డిస్‌ప్లే ఇటీవలకాలంలో విడుదలైన OnePlus 10 Pro, Xiaomi 12 Pro ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో చూడవచ్చు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 లేయర్, స్పష్టమైన దృశ్యాన్ని అందించే స్క్రీన్‌తో పాటు డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేసే స్టీరియో స్పీకర్లు ఇచ్చారు. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ IP52 రేటింగ్స్ కలిగి ఉంది.

Moto Edge 30 Fusion నిస్సందేహంగా ఒక అద్భుతమైన హ్యండ్‌సెట్ అని చెప్పవచ్చు. దీని వెనుక ప్యానెల్ గాజుతో వచ్చి, దానికి మ్యాట్ ఫినిషింగ్ వచ్చింది. దీనిపై పడిన స్క్రాచ్ మార్క్‌లను సులభంగా తుడిచివేయవచ్చు. ఈ డిజైన్ తో ఈ ఫోన్ ప్రీమియం హ్యాండ్‌సెట్ అనే అనుభూతిని కలిగిస్తుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ సోలార్ గోల్డ్, కాస్మిక్ గ్రే అనే కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది.

ఈ సరికొత్త 'మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్' లో ఇంకా ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి? మొదలగు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Moto Edge 30 Fusion 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 144Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.55 అంగుళాల pOLED FHD+ కర్వ్‌డ్ డిస్‌ప్లే
  • 8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • Qualcomm స్నాప్‌డ్రాగన్ 888+ ప్రాసెసర్
  • వెనకవైపు 50MP + 13MP + 2MP ట్రిపుల్ కెమెరా, ముందు భాగంలో 32MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
  • 4400 mAh బ్యాటరీ సామర్థ్యం, 68W ఛార్జర్
  • డాల్బీ అట్మోస్‌ స్పీకర్లు
  • ధర, రూ. 39,999/-

కనెక్టివిటీ పరంగా, మోటో ఎడ్జ్ 30 ఫ్యూజన్‌లో 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.2, GPS, USB టైప్-C, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మొదలైనవి ఉన్నాయి.

ఈ ఫోన్‌ సెప్టెంబర్ 22వ తేదీ నుండి ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్, రిలయన్స్ డిజిటల్ అవుట్‌లెట్‌లతో సహా ఇతర అన్ని ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్‌లలో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.

కాగా, మోటోరోలా కంపెనీ గ్లోబల్ మార్కెట్లో Moto Edge 30 Neo అనే స్మార్ట్‌ఫోన్‌ను కూడా లాంచ్ చేసింది. దీని ధర సుమారు. 42,999/- గా ఉంది. అయితే ఇండియాలో మాత్రం లాంచ్ చేయలేదు.

టాపిక్

తదుపరి వ్యాసం