భారీ ఫీచర్లు, అదిరిపోయే ధరతో OnePlus 10 Pro 5G స్మార్ట్‌ఫోన్..-oneplus 10 pro 5g smartphone launched in india ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  భారీ ఫీచర్లు, అదిరిపోయే ధరతో Oneplus 10 Pro 5g స్మార్ట్‌ఫోన్..

భారీ ఫీచర్లు, అదిరిపోయే ధరతో OnePlus 10 Pro 5G స్మార్ట్‌ఫోన్..

HT Telugu Desk HT Telugu
Mar 31, 2022 10:39 PM IST

వన్‌ప్లస్ తమ బ్రాండ్ నుంచి వన్‌ప్లస్ 10 ప్రో 5G పేరుతో సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లో విడుదలైంది. దీని ధర, ఫీచర్స్, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి..

OnePlus 10 Pro 5G
OnePlus 10 Pro 5G (OnePlus)

ప్రముఖ మొబైల్ తయారీదారు వన్‌ప్లస్ తమ బ్రాండ్ నుంచి సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 10 ప్రో 5Gను గురువారం భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. రెండు రకాల ర్యామ్- స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో ఈ అందుబాటులో ఉంటుంది. భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ. 66,999 నుంచి ప్రారంభమవుతుంది.

OnePlus 10 Pro 5G బేస్ వేరియంట్ 8GB + 128GB ధర రూ. 66,999/- గా నిర్ణయించగా.. మరో వేరియంట్ 12GB + 256GB ధరను రూ.71,999/- గా నిర్ణయించారు. ఇదే స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది ప్రారంభంలో చైనాలో 8GB + 256GB స్టోరేజ్ మోడల్‌గా విడుదల చేశారు.

పవర్ ప్యాక్డ్ ఫీచర్లతో OnePlus 10 Pro 5G స్మార్ట్‌ఫోన్ ను లోడ్ చేశారు. వెనుక భాగంలో హాసెల్‌బ్లాడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఈ సెటప్‌లో 48-మెగాపిక్సెల్ సోనీ ప్రైమరీ సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ అలాగే 8-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ ఉన్నాయి. ఇక ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

అంతేకాకుండా ఇందులోని 80W సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 32 నిమిషాల్లోనే దీని బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. 

ఈ స్మార్ట్‌ఫోన్‌లో డాల్బీ అట్మోస్ సౌండ్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను ఇచ్చారు. నాయిస్ క్యాన్సిలేషన్ సపోర్ట్ కూడా ఉంది.

ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఇతర ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో చూడండి.

OnePlus 10 Pro 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

120Hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.7-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే

8/12GB RAM, 128/256GB స్టోరేజ్ సామర్థ్యం 

శక్తివంతమైన Qualcomm Snapdragon 8 Gen 1 SoC ప్రాసెసర్

వెనకవైపు 48 & 50 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 32 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ ఆక్సిజన్‌ 12 ఆపరేటింగ్ సిస్టమ్

5,000mAh డ్యూయల్-సెల్ బ్యాటరీ, 80W SuperVOOC వైర్డ్ ఛార్జింగ్, 50W AirVOOC వైర్‌లెస్ ఛార్జింగ్‌

ధర రూ 66,999 నుంచి రూ. 71,999 వరకు.

OnePlus 10 Pro 5G స్మార్ట్‌ఫోన్ వోల్కానిక్ బ్లాక్ , ఎమరాల్డ్ ఫారెస్ట్ అనే రెండు కలర్ ఛాయిస్ లలో లభిస్తుంది. ఏప్రిల్ 5, 2022 నుంచి అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.

ఇక One Plus 10 Pro 5Gతో పాటు, కంపెనీ OnePlus Buds Pro Silver Edition అలాగే OnePlus Bullets Wireless Z2ని కూడా పరిచయం చేసింది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్