Nokia T10 Tablet LTE । వాటర్ రెసిస్టెన్స్ కలిగిన నోకియా టాబ్లెట్ భారత్‌లో లాంచ్!
భారత మార్కెట్లో తాజాగా Nokia T10 Tablet LTE విడుదలైంది. ఈ బడ్జెట్ టాబ్లెట్ నీటి నిరోధకత కలిగిన డిజైన్, IPX2 రేటింగ్‌ను కలిగి ఉంది. దీని ధర, ఫీచర్లు, ఇతర విశేషాలను ఇక్కడ తెలుసుకోండి.
HMD గ్లోబల్ ఇటీవలే Nokia T10 Tablet పేరుతో ఒక ఎంట్రీ-లెవల్ టాబ్లెట్‌ను భారత మార్కెట్లో మార్కెట్లో విడుదల చేసింది. ఈ టాబ్లెట్ Wi-Fi అలాగే LTE+Wi-Fi డ్యుయల్ కనెక్టివిటీ అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. కానీ, ఇండియాలో బేస్ మోడల్ అయిన Wi-Fi వేరియంట్‌ను మాత్రమే అప్పుడు విడుదల చేయగా, తాజాగా మరో వేరియంట్‌ను కూడా మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇప్పుడు Nokia T10 Tablet రెండు వేరియంట్‌లలో (LTE, Wi-Fi) కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది.
నోకియా టీ10 టాబ్లెట్ LTE వేరియంట్ కూడా దాని మునుపటి వేరియంట్‌కు సమానమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. కొత్త వేరియంట్ కూడా యూనిసోక్ T606 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 800 x 1280 (HD+) రిజల్యూషన్, 450 nits పీక్ బ్రైట్‌నెస్ లెవెల్ కలిగిన 8-అంగుళాల డిస్‌ప్లే, 5250mAh బ్యాటరీ, ఆడియో కోసం డ్యుయల్-స్టీరియో-స్పీకర్‌లు మొదలైనవి అలాగే ఉన్నాయి. ఇతర ఫీచర్లలో వైర్డు ఆడియో అవుట్ కోసం 3.5mm ఆడియో జాక్, బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ, యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలెరోమీటర్, ఇన్‌బిల్ట్ GPS ఉన్నాయి.
అయితే Nokia T10 Tablet LTE వేరియంట్ దాని Wi-Fi వేరియంట్ కంటే సుమారు రూ. 1000 ఖరీదు ఎక్కువగా ఉంది.
Nokia T10 Tablet LTEకి సంబంధించి ఫీచర్ల జాబితా, ధరలు తదితర వివరాలను పరిశీలించండి.
Nokia T10 Tablet LTE ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
- 1280x800 రెసల్యూషన్ కలిగిన 8-అంగుళాల IPS LCD HD+ డిస్‌ప్లే
- 3GB/4GB RAM, 32GB/64GB స్టోరేజ్ సామర్థ్యం, మైక్రో SD కార్డ్ స్లాట్ (512GB వరకు సపోర్ట్)
- Unisoc T606 ప్రాసెసర్ ప్రాసెసర్
- వెనకవైపు 8MP కెమెరా, ముందు భాగంలో 2MP సెల్ఫీ కెమెరా
- ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
- 5250mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఛార్జింగ్
- 3GB+32GB Nokia T10 Tablet LTE ధర, రూ. 12,799/-
- 4GB+64GB Nokia T10 Tablet LTE ధర, రూ. 13,999/-
Nokia T10 Tablet LTEను అక్టోబర్ 15 నుంచి నోకియా అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
సంబంధిత కథనం