Nokia 5710 XpressAudio 4G। పాత స్టాక్ అమ్మేస్తోందా? నోకియా నుంచి మరో ఫీచర్ ఫోన్!-nokia 5710 xpressaudio yet another feature phone from hmd global launched ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Nokia 5710 Xpressaudio Yet Another Feature Phone From Hmd Global Launched

Nokia 5710 XpressAudio 4G। పాత స్టాక్ అమ్మేస్తోందా? నోకియా నుంచి మరో ఫీచర్ ఫోన్!

HT Telugu Desk HT Telugu
Sep 14, 2022 02:46 PM IST

భారత మార్కెట్లో నోకియా నుంచి మరో ఫీచర్ ఫోన్ Nokia 5710 XpressAudio విడుదలైంది. ఇది రూ. 5 వేల బడ్జెట్ ధరలో లభిస్తుంది. విశేషాలు ఇలా ఉన్నాయి.

Nokia 5710 XpressAudio 4G
Nokia 5710 XpressAudio 4G

HMD గ్లోబల్ తమ నోకియా బ్రాండ్ మీద వరుస ఉత్పత్తులను మార్కెట్లో లాంచ్ చేస్తుంది. ముఖ్యంగా ఒకదాని తర్వాత ఒకటి ఫీచర్ ఫోన్‌లను విడుదల చేస్తుండటం విశేషం. ఒకవైపు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూనే మరోవైపు ఫీచర్ ఫోన్‌లను విడుదల చేసుకుంటూ మార్కెట్ ను క్యాష్ చేసుకుంటుంది. గత రెండు నెలల కాలంలో నోకియా నుంచి Nokia 110, Nokia 8120 4G, Nokia 2660 Flip వంటి ఫీచర్ ఫోన్‌లను విడుదల చేసింది. ఇప్పుడు సరికొత్తగా మరొక ఫీచర్ ఫోన్ Nokia 5710 XpressAudio 4G ను విడుదల చేసింది. ఈ ఫోన్ 2007లో విడుదలైన నోకియా 5310 XpressMusic ఫోన్‌ను పోలి ఉంది. చూడబోతే స్మార్ట్‌ఫోన్‌ యుగంలోనూ నోకియా చాలా తెలివిగా అప్పట్లో అమ్ముడుపోక మిగిలిపోయిన పాత ఫోన్‌లన్నింటినీ ఒక్కొక్కటిగా మార్కెట్లో విడుదల చేస్తూ తమ బిజినెస్ ముందుకు సాగిస్తున్నట్లు అర్థమవుతుంది.

తాజాగా భారత మార్కెట్లో విడుదలైన Nokia 5710 XpressAudio అనేది ప్రత్యేకంగా సంగీత ప్రియుల కోసం రూపొందించినది. ఈ ఫోన్ ఇన్-బిల్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లతో వస్తుంది. వీటిని ఫోన్ వెనుక ప్యానెల్‌లో ఇచ్చిన ప్రత్యేక స్లాట్‌లో ఉంచవచ్చు, ఫోన్‌తో పాటే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ఫోన్‌లో లౌడ్ స్పీకర్స్, ఆడియో కంట్రోల్ బటన్లు, దృఢమైన బ్యాటరీని కలిగి ఉంది.

ఈ కొత్త ఫీచర్ ఫోన్‌లో 1450mAh బ్యాటరీ ఉంటుంది. ఇది గంటల తరబడి నాన్-స్టాప్ ప్లేబ్యాక్‌ను అందించగలదు. అలాగే స్టాండ్‌బైలో కూడా వారాల పాటు బ్యాటరీ లైఫ్ నిలిచి ఉంటుందని కంపెనీ పేర్కొంది

Nokia 5710 XpressAudio 4G ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

  • 2.4-అంగుళాల QVGA డిస్‌ప్లే
  • వెనకవైపు 0.3 MP కెమెరా+ LED ఫ్లాష్
  • Unisoc T107 ప్రాసెసర్
  • నోకియా S30+ ఆపరేటింగ్ సిస్టమ్‌
  • 1450mAh బ్యాటరీ
  • 48 MB RAM, 128 MB స్టోరేజ్, 32 GB వరకు విస్తరించుకోవచ్చు.

MP3 ప్లేయర్‌, వైర్‌లెస్ FM రేడియో కూడా ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ రెడ్- వైట్, రెడ్- బ్లాక్ అనే రెండు కలర్ కాంబినేషన్లో లభ్యమవుతుంది.

'నోకియా 5710 ఎక్స్‌ప్రెస్ ఆడియో' ఫోన్ ధర రూ. 4,999/- ఇది ఇప్పటికే Nokia.comలో కొనుగోలు చేయటానికి అందుబాటులో ఉంది. సెప్టెంబర్ 19 నుండి ఇతర రిటైల్ అవుట్‌లెట్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలోకి అందుబాటులోకి వస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్