తెలుగు న్యూస్  /  Business  /  New Moto G73 5g Price In India Check Specifications Sale Details

New Moto G73 5G: బడ్జెట్ రేంజ్‍లో మోటోరోలా నుంచి మరో 5జీ ఫోన్: ధర, స్పెసిఫికేషన్లు ఇవే

10 March 2023, 14:14 IST

    • Moto G73 5G launched: మోటో జీ73 5జీ మొబైల్ వచ్చేసింది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఎల్‍సీడీ డిస్‍ప్లేతో ఈ ఫోన్ వచ్చింది.
New Moto G73 5G: బడ్జెట్ రేంజ్‍లో మోటోరోలా నుంచి మరో 5జీ ఫోన్ (Photo: Motorola)
New Moto G73 5G: బడ్జెట్ రేంజ్‍లో మోటోరోలా నుంచి మరో 5జీ ఫోన్ (Photo: Motorola)

New Moto G73 5G: బడ్జెట్ రేంజ్‍లో మోటోరోలా నుంచి మరో 5జీ ఫోన్ (Photo: Motorola)

Moto G73 5G launched: జీ సిరీస్‍లో మరో బడ్జెట్ 5జీ ఫోన్‍ (Budget 5G Phone)ను మోటోరోలా (Motorola) తీసుకొచ్చింది. మోటో జీ73 5జీ (Moto G73 5G) మొబైల్ భారత మార్కెట్‍లో శుక్రవారం లాంచ్ అయింది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ వస్తోంది. మీడియాటెక్ డైమన్సిటీ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. మోటో జీ73 5జీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

Stock market: ర్యాలీకి బ్రేక్; స్టాక్ మార్కెట్ క్రాష్; రూ. 2.3 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు

Cibil score : జీవితంలో ఎప్పుడూ లోన్​ తీసుకోకపోయినా.. సిబిల్​ స్కోర్​పై ఎఫెక్ట్​ పడుతుందా?

Mahindra XUV 3XO vs Tata Nexon : ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ వర్సెస్​ నెక్సాన్​.. ఏది బెస్ట్​?

Stocks to buy today : ఈ రూ. 98 స్టాక్​తో షార్ట్​ టర్మ్​లో మంచి ప్రాఫిట్స్​..!

మోటో జీ73 5జీ స్పెసిఫికేషన్లు

Moto G73 5G Specifications: 6.5 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ LCD డిస్‍ప్లేతో మోటో జీ73 5జీ వస్తోంది. 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మీడియాటెక్ డైమన్సిటీ 930 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ అవుతుంది. 8బీజీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‍తో వస్తోంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‍ను కలిగి ఉంది. ఈ మొబైల్‍కు ఆండ్రాయిడ్ 14 అప్‍డేట్ వస్తుందని మోటోరోలా పేర్కొంది.

Moto G73 5G Camera: మోటో జీ73 5జీ ఫోన్ వెనుక రెండు కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్‍కు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను మోటోరోలా పొందుపరిచింది. 5జీ, 4జీ ఎల్‍టీఈ, వైఫై, బ్లూటూత్, ఎన్‍ఎఫ్‍సీ, జీపీఎస్, యూఎస్‍బీ టైప్-సీ పోర్ట్, 3.5mm హెడ్‍ఫోన్ జాక్ కనెక్టివిటీ ఆప్షన్లుగా ఉన్నాయి.

Moto G73 5G Battery: మోటో జీ73 5జీ ఫోన్‍లో 5,000mAh బ్యాటరీ ఉంటుంది. 30 వాట్ల టర్బోపవర్ ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్ చేస్తుంది. మొత్తంగా ఈ ఫోన్ 181 గ్రాముల బరువు ఉంటుంది. నీటి బిందువుల నుంచి రక్షణ ఉండేలా ఐపీ52 రేటింగ్ ఉంటుంది.

మోటో జీ73 5జీ ధర, సేల్, ఆఫర్లు

Moto G73 5G price, Sale: మోటో జీ73 5జీ ఒకే వేరియంట్‍లో లాంచ్ అయింది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ఉన్న ఈ మొబైల్ ధర రూ.18,999గా ఉంది. ల్యుసెంట్ వైట్, మిడ్‍నైట్ బ్లూ కలర్ ఆప్షన్‍లలో లభిస్తుంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్‌లో మార్చి 16వ తేదీన ఈ ఫోన్ సేల్‍కు వస్తుంది. వివిధ బ్యాంక్ కార్డుల ఆఫర్ కూడా తొలి సేల్‍లో అందుబాటులోకి రానుందని ఫ్లిప్‍కార్ట్‌ పేర్కొంది. కార్డు ఆఫర్‌ను ఉపయోగించుకొని మోటో జీ73 5జీని కొంటే రూ.2,000 వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం వినియోగించుకోవచ్చు.