తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Useless Meetings: సగానికి పైగా ఆఫీస్ మీటింగ్స్ వేస్టేనట..

Useless Meetings: సగానికి పైగా ఆఫీస్ మీటింగ్స్ వేస్టేనట..

HT Telugu Desk HT Telugu

14 March 2023, 17:15 IST

    • Useless Meetings: ఆఫీస్ ల్లో ముఖ్యంగా ప్రైవేట్ కంపెనీల కార్యాలయాల్లో మీటింగ్స్ చాలా కామన్. వర్క్ ఫ్రం హోమ్ సిస్టమ్ వచ్చిన తరువాత ఈ మీటింగ్స్ ప్రాధాన్యత, ఫ్రీక్వెన్సీ బాగా పెరిగింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ ఆఫీస్ మీటింగ్ ల్లో సగానికి పైగా అనవసరమైనవేనని తాజాగా ఒక సర్వే లో తేలింది. టైం వేస్ట్ కావడం తప్పితే, ఈ మీటింగ్స్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండడం లేదని స్పష్టమైంది.

ట్రెండింగ్ వార్తలు

Discounts on Hyundai cars: ఎక్స్టర్ ఎస్యూవీ సహా టాప్ మోడళ్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించిన హ్యుందాయ్

2024 Maruti Suzuki Swift: 2024 మారుతి సుజుకీ స్విఫ్ట్ రేపు లాంచ్: టాప్ మైలేజ్ ఇచ్చే హ్యాచ్ బ్యాక్ ఇదే..

EPFO alert: ఉద్యోగులకు షాక్; గ్రాట్యుటీ పరిమితి పెంపు అమలుపై ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం

Aadhar Housing IPO: ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ ప్రారంభం; అప్లై చేయొచ్చా?.. నిపుణులేమంటున్నారు?

Useless Meetings: వారానికి కనీసం 25 గంటలు..

ఉద్యోగులు ఈ ఆఫీస్ మీటింగ్ ల్లో, ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ మీటింగ్ లు, ప్రాజెక్ట్ అప్ డేట్స్ ల్లో వారానికి సగటున 25 గంటలు స్పెండ్ చేస్తారని ఆ సర్వేలో తేలింది. అయితే, వాటిలో సగానికి పైగా ఎలాంటి సానుకూల ఫలితాలు రాకుండానే ముగుస్తాయని ఆ సర్వేలో తేలింది. 2020 కి ముందు 17% గా ఉన్న ఈ మీటింగ్స్ ఫర్క్ ఫ్రమ్ హోం సిస్టమ్ కారణంగా 2020 తరువాత 42 శాతానికి పెరిగాయి. ఫ్యూచర్ ఫోరమ్ (Future Forum) అనే సంస్థ దాదాపు 10 వేలకు పైగా డెస్క్ ఎంప్లాయీస్ ను సర్వే చేసి ఈ వివరాలను క్రోడీకరించారు. సేల్స్ ఫోర్స్ సంస్థకు చెందిన స్లాక్ టెక్నాలజీస్ సాయంతో ఫ్యూచర్ ఫోరమ్ ఈ సర్వే నిర్వహించింది.

Useless Meetings: కారణాలేంటి?

సాధారణంగా మీటింగ్స్ వల్ల మంచి ఫలితాలు వస్తాయన్న అభిప్రాయం ఉంది. అయితే, మెజారిటీ ఉద్యోగులు మీటింగ్ పై లేదా ఆ మీటింగ్ ఫలితాలపై ఆసక్తితో కాకుండా, మీటింగ్ కు హాజరుకాకపోతే, ముఖ్యమైన విషయాలేమైనా మిస్ అవుతామేనన్న భయంతోనో, లేదా తమ మేనేజర్లకు మేం కూడా వర్క్ చేస్తున్నా అని చూపించుకోవడం కోసమో మీటింగ్స్ కు హాజరవుతారని ఆ సర్వేలో తేలింది. అంతేకాకుండా, కింది స్థాయి ఉద్యోగులకు మీటింగ్ కు హాజరుకావడం మినహా మరో ఆప్షన్ ఉండకపోవడం కూడా మరో కారణమని తేలింది. అనవసర మీటింగ్స్ ను రద్దు చేసి సంవత్సర కాలంలో 320000 గంటల విలువైన సమయాన్ని ఆదా చేశామని కెనడాకు చెందిన ఈ కామర్స్ సైట్ ‘షాపిఫై(Shopify)’ వెల్లడించింది. నాన్ ఎగ్జిక్యూటివ్స్ మీటింగ్స్ కోసం సగటున వారానికి 10.6 గంటల సమయం వెచ్చిస్తారని ఈ సర్వే వెల్లడించింది. ఇందులో 43% అనవసరమైన సమావేశాలేనని తేల్చింది.