తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Mutual Funds: లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్.. ఏ ఫండ్ లో పెట్టుబడులు పెట్టడం బెటర్?

Mutual Funds: లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్.. ఏ ఫండ్ లో పెట్టుబడులు పెట్టడం బెటర్?

HT Telugu Desk HT Telugu

25 May 2023, 19:03 IST

    • Mutual Funds: మ్యుచ్యువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా అనుమానాలు వస్తుంటాయి. పెట్టుబడి పెట్టేముందు.. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ లో ఏ తరహా ఫండ్ ను ఎన్నుకోవాలనే విషయంలోనూ అనుమానాలు వస్తుంటాయి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (Mint)

ప్రతీకాత్మక చిత్రం

మ్యుచ్చువల్ ఫండ్ పోర్ట్ ఫొలియోను రూపొందించుకోవడం కొంత క్లిష్టమైన పనే. అందులో ఏ సెక్షన్లో ఎంత పెట్టుబడి పెడితే బావుంటుందనే విషయంలో గందరగోళం ఉంటుంది. అయితే, పెట్టుబడి పెడ్తున్న వ్యక్తి తీసుకునే రిస్క్ శాతాన్ని బట్టి మ్యుచ్యువల్ ఫండ్స్ తరహా ను ఎంపిక చేసుకోవడం సముచితమని నిపుణులు సూచిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

iPad Air 2024: రెండేళ్ల నిరీక్షణకు తెర; లేటెస్ట్ ఎం2 చిప్ తో ఐప్యాడ్ ఎయిర్ 2024 సిరీస్ లాంచ్

Massive discounts on Mahindra cars: ఎక్స్ యూ వీ 300 సహా మహీంద్ర కార్లపై బంపర్ ఆఫర్స్, హెవీ డిస్కౌంట్స్..

Indegene Limited IPO: అదిరిపోయే జీఎంపీతో ఓపెన్ అయిన ఇండిజీన్ లిమిటెడ్ ఐపీఓ; ఇన్వెస్టర్లు ఎదురు చూస్తున్నారు..

Stock market crash: స్టాక్ మార్కెట్ క్రాష్ కు కారణాలేంటి?.. లోక్ సభ ఎన్నికల ఫలితాలపై అంచనాలు మారాయా?

మ్యుచ్యువల్ ఫండ్స్ కేటగిరీలు

మ్యుచ్యువల్ ఫండ్స్ లో ప్రధానంగా మూడు కేటగిరీలు ఉంటాయి. అవి లార్జ్ క్యాప్ (large-cap mutual funds), మిడ్ క్యాప్ (mid-cap mutual funds), స్మాల్ క్యాప్ (small-cap mutual funds). ఇన్వెస్టర్.. తన పెట్టుబడుల విషయంలో సంప్రదాయ విధానాన్ని (conservative) ఇష్టపడే వాడా? లేక బ్యాలెన్స్డ్ (balanced) గా ఉండేవాడా? లేక దూకుడుగా (aggressive) ఉండేవాడా? అనే అంశంపై కూడా ఏ ఫండ్ లో పెట్టుబడి పెట్టాలనే విషయం ఆధారపడి ఉంటుంది.

  • లార్జ్ క్యాప్: ఫండమెంటల్స్ బలంగా ఉన్న పెద్ద కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే లార్జ్ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడంలో కొంతవరకు రిస్క్ తక్కువ ఉంటుంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లతో పోలిస్తే.. ఈ లార్జ్ క్యాప్ మ్యుచ్యువల్ ఫండ్స్ లో రిటర్న్ తక్కువే, అదే సమయంలో రిస్క్ కూడా తక్కువగానే ఉంటుంది. ఇవి చాలా వరకు సురక్షితమైన పెట్టుబడి మార్గాలు. వీటిపై మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం తక్కువగా ఉంటుంది.
  • మిడ్ క్యాప్: పోర్ట్ ఫొలియో డైవర్సిఫికేషన్ కోరుకునే వారికి సూటబుల్ ఫండ్స్ ఈ మిడ్ క్యాప్ ఫండ్స్. ఇందులో రిటర్న్స్ మరియు రిస్క్ .. రెండూ సమానంగా ఉంటాయి. మిడ్ క్యాప్ పై కూడా మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అంతా బావుంటే, లార్జ్ క్యాప్ కన్నా బెటర్ రిటర్న్ ను అందిస్తాయి.
  • స్మాల్ క్యాప్: సమీప భవిష్యత్తులో మంచి పనితీరు చూపగలవని భావించే చిన్న తరహా కంపెనీల్లో ఈ ఫండ్స్ పెట్టుబడులు పెడ్తాయి. అయితే, వీటిలో పెట్టే పెట్టుబడులకు రిస్క్ ఎక్కువ. వీటిపై మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంతా బావుంటే, ఈ ఫండ్స్ మంచి రిటర్న్స్ ను ఇస్తాయి. లార్జ్, మిడ్ క్యాప్ ల ఫండ్స్ కన్నా మంచి రిటర్న్స్ ను వీటి నుంచి ఆశించవచ్చు.

ఎందులో బెటర్?

ఈ మూడు తరహాల ఫండ్స్ లో ప్లాన్డ్ గా పెట్టుబడులు పెట్టాలని, మూడింటి మిక్స్ గా పోర్ట్ ఫోలియో ఉండాలని సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ జితేంద్ర సోలంకీ సూచిస్తున్నారు. పెట్టుబడి మొత్తంలో 50% నుంచి 70% లార్జ్ క్యాప్ లో, మిగతా మొత్తాన్ని మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం సరైన విధానమని సూచిస్తున్నారు. ‘మొత్తం ఇన్వెస్ట్ మెంట్ లో 30% లార్జ్ క్యాప్, 30% ఫ్లెక్సి క్యాప్, 20% మిడ్ క్యాప్, 20% స్మాల్ క్యాప్ ల్లో పెట్టుబడులు పెట్టాలి’ అని ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ బల్వంత్ జైన్ వివరించారు. పెట్టుబడి కాలపరిమితిని బట్టి కూడా ఇన్వెస్ట్ మెంట్ తరహాను ఎంపిక చేసుకోవాలి. ఐదు నుంచి ఏడేళ్ల కాల పరిమితికి లార్జ్ క్యాప్ మంచి నిర్ణయమవుతుంది.