తెలుగు న్యూస్  /  Business  /  Multibagger Ipo Ep Biocomposites Stock Given Good Returns

Multibagger IPO: 13 సెషన్లలోనే డబుల్.. సూపర్ హిట్ అయిన ఐపీవో

HT Telugu Desk HT Telugu

29 September 2022, 14:41 IST

    • Multibagger stock: ఐపీఓ జారీ చేసి మార్కెట్లో లిస్టయి 13 సెషన్లలోనే రెట్టింపైన స్టాక్ ఇది.
EP Biocomposites కంపెనీ తయారు చేసే ఉత్పత్తుల్లో బయో డైజెస్టర్ ట్యాంక్ ఒకటి
EP Biocomposites కంపెనీ తయారు చేసే ఉత్పత్తుల్లో బయో డైజెస్టర్ ట్యాంక్ ఒకటి (EP Biocomposites)

EP Biocomposites కంపెనీ తయారు చేసే ఉత్పత్తుల్లో బయో డైజెస్టర్ ట్యాంక్ ఒకటి

Multibagger IPO: బీఎస్ఈలో లిస్టయిన EP Biocomposites షేర్లు 2022లో భారతీయ స్టాక్ మార్కెట్ మల్టీబ్యాగర్ స్టాక్‌ల జాబితాలో ప్రవేశించిందనే చెప్పాలి. BSEలో ఈ కంపెనీ 13 సెప్టెంబర్ 2022న లిస్టయింది. మొత్తం 13 సెషన్‌లలోనూ ఇది అప్పర్ సర్క్యూట్‌ను తాకుతూ వచ్చింది. 13 సెప్టెంబర్ 2022న ఈ షేరు రూ.168.25 వద్ద ముగిసింది. ఐపీఓ కేటాయింపు సమయంలో కంపెనీ షేర్లను పొందలేకపోయిన ఇన్వెస్టర్లు ఈ స్మాల్-క్యాప్ స్టాక్‌ను లిస్టింగ్ తేదీలో కొనుగోలు చేసి ఉంటే, ఈ రోజు ఆ పెట్టుబడి రెట్టింపు అయి ఉండేది. ప్రస్తుతం షేరు ఒక్కొక్కటి రూ. 346.95కి చేరుకుంది. సెప్టెంబర్ 13న దాని ముగింపు ధరతో పోల్చితే 105 శాతం రాబడి వచ్చినట్టు లెక్క.

మల్టీబ్యాగర్ స్టాక్

పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 2022లో ఈక్విటీ షేర్‌కు రూ. 126 ప్రైస్ బ్యాండ్‌తో వచ్చింది. ఈ ఇష్యూ ద్వారా 13 సెప్టెంబర్ 2022న షేరుకు రూ. 160.25 చొప్పున లిస్టయింది. ఐపీవోలో ఇన్వెస్ట్ చేసిన వారికి 27 శాతం లిస్టింగ్ ప్రీమియం లభించింది. ఐపీవోలో స్టాక్స్ దక్కిన వారు ఇప్పటి వరకు స్టాక్‌లో తమ పెట్టుబడి కొనసాగించి ఉన్నట్టయితే వారికి దాదాపు 175 శాతం రాబడి అందినట్టు లెక్క. ఐపీవోలో షేర్లు దక్కిన వారికి ఇది మల్టీబ్యాగర్ ఐపీవోగా చెప్పొచ్చు. తద్వారా EP Biocomposites IPO, EP బయోకంపొజిట్స్ షేర్ పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల నుండి గణనీయమైన రాబడి సాధించారు.

FPI: విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న స్టాక్

ఇటీవల ఈ స్టాక్ విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను (ఎఫ్‌పిఐ) ఆకర్షించి వార్తల్లోకెక్కింది. నవ్ క్యాపిటల్ వీసీసీ- నవ్ క్యాపిటల్ ఎమర్జింగ్ స్టార్ ఫండ్ ఇపి బయోకంపోజిట్స్ షేర్లను కొనుగోలు చేశాయి. సింగపూర్‌కు చెందిన ఎఫ్‌పిఐ 12,000 కంపెనీ షేర్లను ఒక్కొక్కటి రూ. 224.15 చొప్పున కొనుగోలు చేసింది. అంటే రూ. 26,89,800 విలువైన షేర్లను కొనుగోలు చేసింది.

ఈ స్మాల్ క్యాప్ స్టాక్ ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ. 58 కోట్లు. గురువారం రెండు గంటల ట్రేడ్ సెషన్ తర్వాత ఈ స్మాల్-క్యాప్ స్టాక్ యొక్క ట్రేడ్ వాల్యూమ్ దాదాపు 2,000 గా ఉంది. అంటే ఇది అధిక రిస్క్ వ్యాపారులకు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. ఈ స్టాక్ బీఎస్ఈలో ట్రేడ్‌కు మాత్రమే అందుబాటులో ఉంది. అలాగే స్టాక్ మార్కెట్‌లో స్టాక్ గత చరిత్ర ఎప్పుడూ భవిష్యత్తు ఫలితాలకు సూచిక కారాదని గుర్తుంచుకోవాలి.

టాపిక్