Mukesh Ambani driver: ముకేశ్ అంబానీ డ్రైవర్ సంపాదన ఎంతో తెలుసా?.. వారికి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా..
19 October 2024, 17:32 IST
Mukesh Ambani driver: సాధారణంగా సంపన్నులు ప్రత్యేక ఏజెన్సీల నుండి ప్రొఫెషనల్ డ్రైవర్లను నియమించుకుంటారు. అత్యంత సురక్షితంగా లగ్జరీ, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను నడపడానికి వారు సుశిక్షితులై ఉంటారు. ఆ తరహా వాహనాలను నడపడానికి కఠినమైన శిక్షణ పొంది ఉంటారు.
ముకేశ్ అంబానీ
Mukesh Ambani driver: ఎనర్జీ, పెట్రోకెమికల్స్, టెక్స్టైల్స్, రిటైల్, టెలీకమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విస్తరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ తన వ్యక్తిగత సిబ్బంది అయిన డ్రైవర్లు, ఇతర ఉద్యోగులకు మంచి వేతనాలను ఇస్తార. వారి వేతనాల్లో అలవెన్సులు, బీమా ప్రయోజనాలు, ఇతర బెనిఫిట్స్ చాలా ఉంటాయి.
సంపన్న పారిశ్రామిక వేత్త
బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అక్టోబర్ 19, 2024 నాటికి, ముకేశ్ అంబానీ (mukesh ambani) ప్రపంచంలోని 15 వ అత్యంత సంపన్నుడు. ఆసియా సంపన్నుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. ఆయన వ్యక్తిగత వేతనం రూ.15 కోట్లు. 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి ఆయన అదే వేతనం పొందుతున్నారు. ఆ సంవత్సరం తన వేతనంపై ఆయన పరిమితి విధించుకున్నారు.
ముఖేష్ అంబానీ డ్రైవర్ సంపాదన ఎంత?
2017 నాటి సమాచారం ప్రకారం ముకేశ్ అంబానీ వ్యక్తిగత డ్రైవర్ నెలకు రూ .2 లక్షలు సంపాదిస్తున్నాడు. అంటే, ఇది సంవత్సరానికి రూ .24 లక్షల వరకు ఉంటుంది. ఇతి కాకుండా, ఇతర అలవెన్సులు ఉంటాయి. ఈ వార్త 2017 లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే అది ఏడేళ్ల కిందటిది. ప్రస్తుత వేతనం మరింత ఎక్కువగా ఉండొచ్చు.
ఎందుకు అంత మంచి జీతం?
అంబానీ కుటుంబానికి చెందిన డ్రైవర్లతో పాటు ఇతర సంపన్నుల డ్రైవర్లకు కూడా భారీగా జీతం ఉంటుంది. వారికి ఇంత ఎక్కువ జీతాలు పొందడానికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే, వారు ప్రొఫెషనల్ డ్రైవర్లు. వారు చాలా కఠినమైన శిక్షణ పొంది ఉంటారు. ప్రయాణీకులకు అత్యంత భద్రత కల్పిస్తారు. లగ్జరీ, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను నడపడమే కాకుండా, వాటి టెక్నాలజీ, మెయింటెనెన్స్ ల పై అవగాహన కలిగి ఉంటారు. సాధారణంగా ఇలాంటి ప్రొఫెషనల్ డ్రైవర్లను సంపన్నులు ప్రైవేట్ కాంట్రాక్ట్ ఏజెన్సీల ద్వారా నియమించుకుంటారు. ఆ ఏజెన్సీలే వారికి శిక్షణ కూడా ఇస్తాయి.