APSDPS Job Notification : ఏపీఎస్డీపీఎస్ లో 13 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, నెలకు వేతనం రూ.2.5 లక్షలు వరకు!-ap state development planning society 13 posts notification application submit last date oct 29th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apsdps Job Notification : ఏపీఎస్డీపీఎస్ లో 13 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, నెలకు వేతనం రూ.2.5 లక్షలు వరకు!

APSDPS Job Notification : ఏపీఎస్డీపీఎస్ లో 13 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, నెలకు వేతనం రూ.2.5 లక్షలు వరకు!

APSDPS Job Notification : ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీలో ఒప్పంద ప్రాతిపదికన 13 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 29 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాజెక్టు మేనేజర్ పోస్టులకు నెలకు గరిష్టంగా రూ.2 లక్షల నుంచి 2.5 లక్షల జీతం ఉంటుంది.

ఏపీఎస్డీపీఎస్ లో 13 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, నెలకు వేతనం రూ.2.5 లక్షలు వరకు!

APSDPS Job Notification : ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీలో ఒప్పంద ప్రాతిపదికన 13 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 29 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ప్రాజెక్టు మేనేజర్ పోస్టులకు నెలకు గరిష్టంగా రూ.2 లక్షల నుంచి 2.5 లక్షల జీతం ఉంటుంది.

విజయవాడలోని ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీలో ఒప్పంద ప్రాతిపదికన 13 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీఎస్డీపీఎస్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో స్వర్ణాంధ్ర@2047 విజన్ ప్రాజెక్టులో ఏడాది పాటు పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించారు. ఎంపికైన అభ్యర్థులు విజయవాడలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అక్టోబర్ 29 లోపు అధికారిక వెబ్ సైట్ http://www.apsdps.ap.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 16న నోటిఫికేషన్ విడుదలైంది.

అర్హతలు

అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/బీఎస్సీ (కంప్యూటర్స్‌), పీజీ లేదా డాక్టరేట్ (పబ్లిక్ పాలసీ/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/ఎకనామిక్స్‌/ ఇంజినీరింగ్/ డెవలప్మెంట్ స్టడీస్) ఉత్తీర్ణత సాధించాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ తప్పనిసరిగా ఉండాలి.

పోస్టుల వివరాలు

1. ప్రోగ్రామ్/ ప్రాజెక్ట్ మేనేజర్/ సీనియర్ అనలిస్ట్/ సీనియర్ అడ్వైజర్- 04 పోస్టులు

2. కన్సల్టెంట్/ రీసెర్చ్ అసోసియేట్స్‌ - 08 పోస్టులు

3. డేటాబేస్ డెవలపర్- 01 పోస్టు

4.మొత్తం ఖాళీలు - 13

జీతం, వయోపరిమితి, ఇతర వివరాలు

ప్రాజెక్టు మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులకు 01-01-2025 నాటికి 55 ఏళ్లు మించకూడదు. అలాగే డేటాబేస్ డెవలపర్ పోస్టులకు 35 ఏళ్లు, కన్సల్టెంట్ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు. ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు నెలకు రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షలు, కన్సల్టెంట్ పోస్టులకు రూ.75 నెల నుంచి రూ.1.5 లక్షలు, డేటాబేస్ డెవలపర్ పోస్టులకు రూ.45 వేల నుంచి రూ.75 వేల జీతం ఇస్తారు. అకడమిక్ క్వాలిఫికేషన్, స్క్రీనింగ్ టెస్ట్‌, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపికే చేస్తారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

Step 1 : దరఖాస్తుదారులు ఏపీఎస్డీపీఎస్ అధికారిక వెబ్ సైట్ http://apsdps.ap.gov.in/ పై క్లిక్ చేయాలి.

Step 2 : హోంపేజీలో జాబ్ నోటిఫికేషన్ అప్లై ఆన్ లైన్ పై క్లిక్ చేస్తే వెబ్ పోర్టల్ https://apsdpscareers.com/ డైరెక్ట్ అవుతారు.

Step 3 : అభ్యర్థి అర్హత అనుగుణంగా తగిన పోస్టులకు వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి.

Step 4 : అభ్యర్థి వ్యక్తిగత వివరాలు, గత అనుభవం, రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి.

Step 5 : పూర్తి వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి.

సంబంధిత కథనం