Allowance hike: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు - అలవెన్సులు పెంచుతూ ఆదేశాలు-govt employees allowance hike in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Allowance Hike: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు - అలవెన్సులు పెంచుతూ ఆదేశాలు

Allowance hike: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు - అలవెన్సులు పెంచుతూ ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 23, 2023 02:54 PM IST

Telangana Govt Latest News:ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్లకు మరో గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా అలవెన్సులు పెంచుతూ ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసంది.

తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Telangana Govt: ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్లకు మరో శుభవార్త అందించింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు,.. అలవెన్సులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

పెంపు వివరాలివే:

- ఉద్యోగులకు ట్రావెంలింగ్ అండ్ కన్వీయనెన్స్ అలెవెన్స్ 30 శాతం పెంపు

- బదిలీపై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ 30 శాతం పెంపు

సెలవు రోజుల్లో పని చేసే లిఫ్ట్ ఆపరేటర్లు, డ్రైవర్లకు అదనంగా రూ. 150 చెల్లింపు

షెడ్యూల్ ప్రాంతాల్లోని ఉద్యోగులకు స్పెషల్ కాంపెన్సెటరీ అలవెన్స్ 30 శాతం పెంపు

-ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితి రూ. 20 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంపు

-దివ్యాంగ ఉద్యోగులకు అందే కన్వీయన్స్ అలవెన్స్ రూ. 2వేల నుంచి 3వేలకు పెంపు

ఇళ్లు నిర్మించుకునే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ. 20 లక్షల నుంచి రూ. 30లక్షలకు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. కారు కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ. 6 లక్షల నుంచి 9 లక్షలకు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మోటార్ సైకిల్ కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ 80వేల నుంచి రూ. లక్షకు పెంపు చేసింది. ఉద్యోగుల పిల్లల పెళిళ్ళకు సంబంధించి, కుమార్తె పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ లక్ష నుంచి రూ. 4 లక్షలు, కుమారుడి పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ రూ. 75వేల నుంచి రూ. 3 లక్షలకు పెంచింది. గ్రేహౌండ్స్, ఇంటిలిజెన్స్, ట్రాఫిక్, సీఐడి, ఆక్టోపస్, యాంటి నక్సలైట్ స్క్వాడ్ విభాగాల్లో పని చేసే పోలీసులకు ఇచ్చే స్పెషల్ పేస్ ను… 2020 పే స్కేల్ ప్రకారం వర్తింపచేస్తారని పేర్కొంది. ఇక పింఛనర్లు చనిపోతే అందించే తక్షణ సాయం రూ. 20 వేల నుంచి రూ. 30 వేలకు పెంచుతున్నట్లు సర్కార్ స్పష్టం చేసింది. ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వర్తించే అన్ని కేటగిరీల్లోని ఉద్యోగులకు అదనంగా 15శాతం స్పెషల్ పే మంజూరు చేసింది.

Whats_app_banner