తెలుగు న్యూస్  /  Business  /  Maruti Suzuki Selles 1 78 Units In May Brezza Fronx Grand Vitrara Ertiga Among Top Selling Models

Maruti Suzuki Sales: మేలో సేల్స్‌లో అదరగొట్టిన మారుతీ సుజుకీ.. ఎక్కువగా అమ్ముడైన కార్లు ఏవంటే!

01 June 2023, 14:41 IST

    • Maruti Suzuki Sales in May: మే నెలలో అమ్మకాల్లో వృద్ధి సాధించింది మారుతీ సుజుకీ. ముఖ్యంగా ఎస్‍యూవీ సేల్‍లు బాగా పెరిగాయి.
Maruti Suzuki Sales: మేలో సేల్స్‌లో అదరగొట్టిన మారుతీ సుజుకీ.. ఎక్కువగా అమ్ముడైన కార్లు ఏవంటే! (HT Photo)
Maruti Suzuki Sales: మేలో సేల్స్‌లో అదరగొట్టిన మారుతీ సుజుకీ.. ఎక్కువగా అమ్ముడైన కార్లు ఏవంటే! (HT Photo)

Maruti Suzuki Sales: మేలో సేల్స్‌లో అదరగొట్టిన మారుతీ సుజుకీ.. ఎక్కువగా అమ్ముడైన కార్లు ఏవంటే! (HT Photo)

Maruti Suzuki Sales in May: భారత్‍లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ.. మే నెలలో అమ్మకాల్లో అదరగొట్టింది. మొత్తం ఈ ఏడాది మేలో 1,78,083 యూనిట్లను (కార్లు) విక్రయించింది. గతేడాది ఇదే నెల(1,61,413)తో పోలిస్తే ఇది 10.32 శాతం అధికం. ఈ ఏదాది మేలో దేశంలో 1,45,596 యూనిట్లను అమ్మిన మారుతీ సుజుకీ.. 26,477 యూనిట్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది. వివరాలివే..

ఎస్‍యూవీ కార్ల అమ్మకాల్లో మారుతీ సుజుకీ భారీ వృద్ధి సాధించింది. ఎస్‍యూవీ విభాగంలో మారుతీ సుజుకీ నుంచి బ్రెజా, ఎర్టిగా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఎస్.క్రాస్ కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. హ్యాచ్‍బ్యాక్ సెగ్మెంట్‍లో డిజైర్, స్విఫ్ట్, బలెనో, ఇగ్నిస్, కే10, వాగన్ఆర్ సహా మరిన్ని మోడళ్లు సేల్స్‌లో దూసుకెళ్లాయి.

ఎస్‍యూవీలో 64 శాతం వృద్ధి

ఈ ఏడాది మే నెలలో మారుతీ సుజుకీ బ్రెజా, ఎర్టిగా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఎస్-క్రాస్, ఎక్స్ఎల్-6 సహా ఎస్‍యూవీ విభాగంలో మొత్తంగా 46,243 యూనిట్లను మారుతీ సుజుకీ సేల్ చేసింది. గతేడాది ఇదే మే (28,501) కంటే ఇది ఏకంగా సుమారు 64 శాతం అధికం.

హ్యాచ్‍బాక్ కార్ల విభాగంలో మేలో 83,655 యూనిట్లను మారుతీ సుజుకీ విక్రయించింది.

మినీ కార్ల విభాగంలో మారుతీ సుజుకీ సేల్స్ కాస్త తగ్గాయి. ఆల్టో, ఎస్-ప్రెసో లాంటి మోడళ్లు ఉన్న మినీ కార్ల సెగ్మెంట్‍లో మేలో 12,236 యూనిట్లను మారుతీ సుజుకీ విక్రయించింది. గతేడాది ఇదే నెలలో (17,406) సేల్ కాగా.. దానితో పోలిస్తే 30 శాతం క్షీణత కనిపిచింది.

మొత్తంగా ప్యాసింజర్ వెహికల్స్ విభాగంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మేలో 15.3 శాతం వృద్ధిని మారుతీ సుజుకీ సాధించింది.

ఎంజీ మోటార్ అమ్మకాల్లో 25 శాతం వృద్ధి

MG Motor Sales in May : బ్రిటన్‍కు చెందిన కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్.. ఈ ఏడాది మేలో భారత్‍లో 5,006 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే నెల (4,008)తో పోలిస్తే ఇది 25 శాతం వృద్ధిగా ఉంది. ఇటీవలే ఎంజీ కామెట్ ఈవీ స్మాల్ ఎలక్ట్రిక్ కారు ఇండియాలో లాంచ్ అయింది. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ కార్లను ఇండియాలో కస్టమర్లకు డెలివరీ చేస్తున్నట్టు ఎంజీ మోటార్ చెప్పింది. మే అమ్మకాల్లో ఈ కొత్త కారు ప్రభావం కనిపింది. ఎంజీ హెక్టార్ ఎస్‍యూవీ కార్ల అమ్మకాలు కూడా మెరుగైనట్టు సమాచారం.