Maruti Suzuki Dzire facelift : సరికొత్తగా మారుతీ సుజుకీ డిజైర్.. ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌లో భారీ మార్పులు!
23 September 2024, 11:22 IST
- Maruti Suzuki Dzire facelift 2024 : మారుతీ సుజుకీ డిజైర్ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్ లాంచ్‌కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌కి సంబంధించిన అనేక కీలక వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి..
మారుతీ సుజుకీ డిజైర్ ఫేస్‌లిఫ్ట్..
మచ్ అవైటెడ్ ఫేస్లిఫ్ట్స్లో మారుతీ సుజుకీ డిజైర్ ఒకటి. ఈ డిజైర్ ఫేస్‌లిఫ్ట్ సబ్-కాంపాక్ట్ సెడాన్ 2024 అక్టోబర్‌లో అరంగేట్రం చేయనుందని సమాచారం. డిజైర్‌కి సరికొతత లుక్స్, ఫీచర్స్ ఇచ్చి.. ఈ సెగ్మెంట్‌ని రివైవ్ చేసేందుకు మారుతీ సుజుకీ సంస్థ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది.. ఈ ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌కి సంబంధించిన లీక్డ్ ఫొటోల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
మారుతీ సుజుకీ డిజైర్ ఫేస్‌లిఫ్ట్..
డిజైర్ ప్రస్తుతం భారతదేశంలో అన్ని సెగ్మెంట్లలో అత్యధికంగా అమ్ముడవుతున్న సెడాన్‌గా నిలిచింది. పెట్రోల్, సీఎన్జీ వర్షెన్లలో లభిస్తుంది. దీని ధర రూ .6.57 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
తాజా స్పైషాట్ వీడియో రాబోయే డిజైర్ ఫేస్‌లిఫ్ట్ సెడాన్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్స్‌ని లీక్ చేసింది. కొత్త ఫ్రంట్ ఫేస్, అల్లాయ్ వీల్స్‌తో సహా ఈ సెడాన్‌లో భారీ మార్పులు కనిపించే అవకాశం ఉంది. కొత్త ఫీచర్లు, ఎలిమెంట్స్ పరిచయంతో సెడాన్ అప్డేటెడ్ క్యాబిన్ని ఫొటోలు కూడా లీక్ అయ్యాయి.
సబ్ కాంపాక్ట్ సెగ్మెంట్లో హ్యుందాయ్ ఆరా, హోండా అమేజ్, టాటా టిగోర్ వంటి కార్లకు మారుతీ సుజుకీ డిజైర్ పోటీనిస్తుంది.
మారుతీ సుజుకీ డిజైర్ 2024: ఎక్స్టీరియర్ మార్పులు..
కొత్త డిజైర్ సెడాన్ కొత్త గ్రిల్‌తో కూడిన (రీడిజైన్ చేసిన) ఫ్రెంట్ ఫేస్‌తో వస్తుంది. ఈ సెడాన్ తన రౌండ్ అట్రాక్షన్‌ని వదులుకుని, పదునైన లుక్స్‌తో ఫ్రెంట్ ఫేస్‌ని పొందుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ అయిన కొత్త స్విఫ్ట్‌లో కనిపించే డిజైన్ లాంగ్వేజ్‌కు ఇది చాలా భిన్నంగా ఉంటుంది. కొత్త డిజైర్ బాడీ అంతా బలమైన క్యారెక్టర్ లైన్లు, డీఆర్ఎల్స్తో పదునైన ఎల్ఈడీ హెడ్‌లైట్ యూనిట్లు, కొత్త అల్లాయ్ వీల్ డిజైన్, రీడిజైన్ చేసిన టెయిల్లైట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కలిగి ఉంది.
మారుతీ సుజుకీ డిజైర్ ఫేస్‌లిఫ్ట్: ఇంటీరియర్ అప్డేట్స్..
మారుతీ సుజుకీ డిజైర్ ఫేస్‌లిఫ్ట్ క్యాబిన్ డ్యూయెల్-టోన్ థీమ్, రీ-డిజైన్డ్ డ్యాష్‌బోర్డ్‌తో వస్తుంది. కార్ల తయారీదారు ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ని ప్రవేశపెట్టనుంది. బహుశా కొత్త స్విఫ్ట్ లోపల ఉపయోగించిన అదే సెటప్ ఇందులో ఉండొచ్చు. డ్రైవర్ డిస్ప్లే సెమీ డిజిటల్‌గా ఉంటుంది. డిజైర్ 2024లో 360-డిగ్రీ కెమెరా, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జింగ్, వెనుక కూర్చున్న ప్రయాణీకుల కోసం ఏసీ వెంట్స్ వంటి ఇతర ఫీచర్లు ఇందులో రావొచ్చు.
మారుతీ సుజుకీ డిజైర్ 2024: ఇంజిన్..
కొత్త స్విఫ్ట్‌తో ఇండియాలో అరంగేట్రం చేసిన కొత్త జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ని ఇప్పుడు మారుతీ సుజుకీ డిజైర్ ఫేస్‌లిఫ్ట్‌లో సంస్థ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 1.2-లీటర్, 3 సిలిండర్ పెట్రోల్ యూనిట్‌ని 5-స్పీడ్ మేన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ సుమారుగా 80బీహెచ్పీ పవర్, 112ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ప్రస్తుతం ఇవి లీక్స్ మాత్రమే అని గుర్తించాలి. లాంచ్ సమయానికి ఇతర వివరాలపై స్పష్టత వస్తుంది.