Tata Punch facelift : టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్- కొత్తగా వచ్చే ఫీచర్స్ ఇవే..
17 September 2024, 15:23 IST
- Tata Punch facelift launch : భారత ఆటోమొబైల్ మార్కెట్లో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అయ్యింది. సెగ్మెంట్-లీడింగ్ ఫీచర్లతో ఈ 2024 టాటా పంచ్ ఇప్పుడు అందుబాటులో ఉంది. సన్‌రూఫ్ వేరియంట్లు కూడా పెరిగాయి. చౌకగా లభిస్తున్నాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. పూర్తి వివరాలు..
మచ్ అవైటెడ్ టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ని టాటా మోటార్స్ సంస్థ మంగళవారం సైలెంట్‌గా లాంచ్ చేసింది. ఈ 2024 టాటా పంచ్ ఎక్స్‌షోరూం ధర రూ. 6.12లక్షల నుంచి రూ. 9.45లక్షల వరకు ఉంటుంది. అలాగే, టాటా మోటార్స్‌కి బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీగా ఉన్న టాటా పంచ్‌పై రూ .18,000 వరకు బెనిఫిట్స్‌ని ఇస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఈ అప్డేటెడ్, 2024 టాటా పంచ్ ఎస్‌యూవీని సంస్థకు చెందిన అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు.
2025 ఆర్థిక సంవత్సరంలో పంచ్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా కొనసాగుతోందని దేశీయ ఆటో మేజర్ తెలిపింది. ఆగస్టు 2024లో నాలుగు లక్షల అమ్మకాల మైలురాయిని చేరుకున్న దేశంలో అత్యంత వేగవంతమైన ఎస్యూవీ ఈ టాటా పంచ్ అని కార్ల తయారీ సంస్థ వెల్లడించింది. ఇప్పుడు, పండుగ సీజన్‌కి ముందు ఫేస్‌లిఫ్ట్‌ని విడుదల చేయడంతో, పంచ్ ఎస్‌యూవీకి అమ్మకాలు పెరుగుతాయని సంస్థ భావిస్తోంది.
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ అప్‌గ్రేడెడ్ ఫీచర్ లిస్ట్‌తో వస్తుంది. ఇందులో కొన్ని క్లాస్-లీడింగ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో కూడిన 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, గ్రాండ్ కన్సోల్‌తో కూడిన ఆర్మ్‌రెస్ట్, రియర్ ఏసీ వెంట్స్, టైప్ సీ ఫాస్ట్ యూఎస్బీ ఛార్జర్ ఉన్నాయి.
ఈ ఫీచర్లను జోడించడం ద్వారా టాటా పంచ్ మొత్తం లైనప్‌ని పూర్తి కొత్త వేరియంట్లతో అప్‌గ్రేడ్ చేసినట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. అడ్వెంచర్ వేరియంట్లో ఆటో కంపెనీ సన్‌రూఫ్‌ని యాడ్ చేసింది. ఫలితంగా పంచ్‌లో సన్‌రూఫ్ సన్ రూఫ్ అమర్చిన వేరియంట్లు మరింత చౌకగా మారాయని వాహన తయారీ సంస్థ పేర్కొంది.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. అప్డేట్ చేసిన టాటా పంచ్‌లో ఎటువంటి కాస్మెటిక్ మార్పులు లేవు. ఫీచర్ అప్గ్రేడ్లు మాత్రమే ఉన్నాయి. పవర్ట్రెయిన్ పరంగా కూడా ఎలాంటి మార్పు లేదు! ఈ ఎస్యూవీ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 1.2-లీటర్ మోటార్ నుంచి పవర్‌ని పొందుతుంది. కారు ట్రాన్స్మీషనన్ ఆప్షన్స్‌లో మాన్యువల్, ఏఎంటీ గేర్‌బాక్స్ ఉన్నాయి.
ఆగస్ట్ నెల సేల్స్‌లో తగ్గిన పంచ్ జోరు..!
ఆగస్ట్ నెలకు సంబంధించిన బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల డేటాలో చాలా మార్పులు కనిపించాయి. ఇప్పటివరకు నెం.1గా కొనసాగుతున్న టాటా పంచ్ 3వ స్థానానికి పడిపోయింది. మారుతీ సుజుకీ బ్రెజా టాప్‌లో నిలిచింది.
ఆగస్టులో ఎస్‌యూవీల అమ్మకాల్లో 32 శాతం వృద్ధితో మారుతీ సుజుకీ బ్రెజా అగ్రస్థానంలో నిలిచింది. కార్ల తయారీదారు ఈ ఎస్యూవీ 19,190 యూనిట్లను విక్రయించింది, ఇది గత సంవత్సరం ఇదే నెలలో విక్రయించిన 14,572 యూనిట్లతో పోలిస్తే ఎక్కువ. అంతకుముందు నెలలో విక్రయించిన 14,676 యూనిట్లతో పోలిస్తే ఇది అధికం. మారుతీ సుజుకీ పోర్ట్ఫోలియోలోని ఇతర ఎస్‌యూవీలతో పాటు గత నెలలో 1.80 లక్షలకు పైగా కార్ల అమ్మకాలను సాధించడానికి బ్రెజా సహాయపడింది.
టాటా మోటార్స్ కు చెందిన అతిచిన్న ఎస్యూవీ ఆగస్టు సేల్స్‌లో మూడో స్థానానికి పడిపోయింది. ఐసీఈ, సీఎన్జీ, ఈవీ వెర్షన్లలో అందిస్తున్న పంచ్ గత నెలలో 15,643 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఆగస్టులో 14,523 యూనిట్ల అమ్మకాలు జరగ్గా, జులైలో 16,121 యూనిట్లకు పడిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.